- Home
- Entertainment
- Sobhan Babu: 500 పెట్టుబడితో 5 కోట్లు సంపాదించాడు.. శోభన్ బాబు మనీ సేవింగ్ సీక్రెట్స్ తెలిస్తే షాక్ అవుతారు..
Sobhan Babu: 500 పెట్టుబడితో 5 కోట్లు సంపాదించాడు.. శోభన్ బాబు మనీ సేవింగ్ సీక్రెట్స్ తెలిస్తే షాక్ అవుతారు..
Sobhan Babu: డబ్బు సంపాదించడం కాదు.. ఎలా పొదుపు చేయాలి.. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం ఎలా పొందాలి బాగా తెలిసిన వ్యక్తి శోభన్ బాబు. ఆయన పొడుపు సూత్రాలు పాటించి చాలామంది నటులు కోటీశ్వరులు అయ్యారు. అందాల నటుడు పొదుపు సూత్రాలు ఎలా ఉండేవంటే?

నటుడిగా, వ్యాపార వేత్తగా..
టాలీవుడ్ చలనచిత్ర పరిశ్రమలో నటుడిగా, నిర్మాతగా, వ్యాపారవేత్తగా, రాజకీయ నాయకుడిగా మాగంటి మురళీ మోహన్ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు. అయితే, తాను ఈ రోజు ఈ స్థాయిలో ఉండటానికి, ముఖ్యంగా రియల్ ఎస్టేట్, వ్యాపార రంగాలలో రాణించడానికి దివంగత నటుడు 'శోభన్ బాబు' అందించిన అమూల్యమైన సలహాలే కారణమని మురళీ మోహన్ పలు సందర్భాలలో వెల్లడించారు. శోభన్ బాబు కేవలం గొప్ప నటుడే కాకుండా, అద్భుతమైన ఆర్థిక క్రమశిక్షణ కలిగిన వ్యక్తి అని ఆయన కొనియాడారు.
శోభన్ బాబు పెట్టుబడి సూత్రాలు
రీసెంట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో మురళీ మోహన్ శోభన్ బాబు పెట్టుబడి వ్యూహాలను, తన జీవితంలో వాటి ప్రభావాల గురించి వివరించారు. మురళీ మోహన్ కెరీర్ బిగినింగ్ డేస్ గురించి గుర్తు చేసుకుంటూ, తాను ఒక సినిమాకు వెయ్యి రూపాయలు తీసుకుంటున్న సమయంలోనే చెన్నైలోని టి.నగర్లో 50,000తో 11,000 చదరపు అడుగుల ఇంటిని కొనుగోలు చేశానని చెప్పారు. ఆ ఇల్లు ప్రస్తుతం 50 కోట్ల రూపాయలకు పైగా విలువ చేస్తుందని తెలిపారు. అప్పటి నుంచే తాను “డబ్బును డబ్బు సంపాదించే విధంగా చేయాలి తప్ప, ఖర్చు పెట్టకూడదు” అనే సూత్రాన్ని నమ్మానని, ఇదే ఐడియాలజీ శోభన్ బాబుదని పేర్కొన్నారు.
శోభన్ బాబు ఎప్పుడూ లగ్జరీలకు పోకుండా, అవసరాలకు మాత్రమే ఖర్చు పెట్టేవారని మురళీ మోహన్ అన్నారు. ఆయన సాధారణంగా తెల్ల బట్టలనే ధరించేవారని, డబ్బును బీరువలో దాచుకకోకుండా భూముల మీద పెట్టుబడిగా పెట్టేవారని గుర్తు చేసుకున్నారు. అప్పట్లో చెన్నైకి దగ్గరలో ఎకరం 500 రూపాయలకు కొని వదిలేసేవారని, 20 సంవత్సరాల తర్వాత ఆ భూమి విలువ ఎకరాకు 5 కోట్లలకు పెరిగిందని మురళీ మోహన్ చెప్పారు.
సినిమా రంగంలో సంపాదించిన ప్రతి రూపాయిని ఎక్కడ పడితే అక్కడ ఖర్చు చేయకుండా, భవిష్యత్తు కోసం ఎలా పొదుపు చేయాలో శోభన్ బాబు అందరికంటే ముందే గ్రహించారు. "సంపాదన ఎంత అన్నది ముఖ్యం కాదు, దానిని ఎలా మదుపు చేస్తున్నామన్నదే ముఖ్యం" అనే సూత్రాన్ని శోభన్ బాబు కచ్చితంగా పాటించారు. మనుషులు ఎంతగా పెరిగినా ఈ భూమి మాత్రం పెరగదని, అందుకే భూముల్లో చేసే పెట్టుబడులు ఎప్పటికీ నష్టపోవని శోభన్ బాబు గట్టిగా నమ్మేవారు. హైదరాబాద్ వంటి ప్రాంతాలలో ఆయన చేసిన వ్యూహాత్మక భూముల కొనుగోళ్లు ఆయనను అపారమైన సంపన్నుడిని చేశాయి.
మురళీ మోహన్ అనుసరించిన మార్గం
శోభన్ బాబు చెప్పిన సూత్రం.. "నీకు అవసరమైనంత వరకే ఖర్చు పెట్టుకో" ఈ నిబంధనను మురళీ మోహన్ తప్పకుండా పాటించారు. సినిమాల ద్వారా వచ్చిన రెమ్యూనరేషన్ను అనవసరమైన విలాసాల కోసం కాకుండా, భవిష్యత్తుకు భరోసానిచ్చే రియల్ ఎస్టేట్.. వ్యాపార రంగాలలో పెట్టుబడిగా పెట్టారు. శోభన్ బాబు చూపిన ఆ మార్గమే తనను ఒక విజయవంతమైన వ్యాపారవేత్తగా, రియల్ ఎస్టేట్ దిగ్గజంగా నిలబెట్టిందని మురళీ మోహన్ ఎంతో గర్వంగా చెబుతుంటారు.
ప్రతి ఒక్కరికీ వర్తించే ఆర్థిక సూత్రాలు
శోభన్ బాబు చెప్పిన ఈ మనీ మేనేజ్మెంట్ సూత్రాలు కేవలం సెలబ్రిటీలకే కాకుండా సామాన్యులకు కూడా ఎంతో స్ఫూర్తినిస్తాయి. ఎంత తక్కువ సంపాదించినా సరే, క్రమశిక్షణతో కూడిన పొదుపు, ఆవేశపూరిత ఖర్చులకు దూరంగా ఉండటం, భవిష్యత్తు కోసం సురక్షితమైన ఆస్తులను కూడబెట్టడం వంటి అలవాట్లు ప్రతి ఒక్కరిని ఆర్థికంగా ఉన్నతస్థితికి చేర్చుతాయని శోభన్ బాబు జీవితం నిరూపిస్తుంది.




