MalayalamNewsableKannadaTeluguTamilBanglaHindiMarathimynation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • KEA 2025
  • Home
  • Entertainment
  • చిరంజీవి నా బిడ్డ లాంటివాడు, అతడితో నాకు పోటీ ఏంటి.. శోభన్ బాబు అలా ఎందుకన్నారో తెలుసా ?

చిరంజీవి నా బిడ్డ లాంటివాడు, అతడితో నాకు పోటీ ఏంటి.. శోభన్ బాబు అలా ఎందుకన్నారో తెలుసా ?

శోభన్ బాబు ఓ కార్యక్రమంలో చిరంజీవి తన బిడ్డతో సమానం అని అన్నారు. అలా ఎందుకన్నారో ఈ కథనంలో చూద్దాం.

tirumala AN | Published : May 29 2025, 04:33 PM
2 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
15
అభిమానుల మధ్య గొడవలు 
Image Credit : Asianet News

అభిమానుల మధ్య గొడవలు 

చిత్ర పరిశ్రమలో హీరోల మధ్య ఎప్పుడూ పోటీ ఉంటుంది. కానీ ఆ పోటీని ఆరోగ్యకరంగా ఉంచడమే కీలకం. ప్రస్తుతం స్టార్ హీరోల అభిమానుల మధ్య సోషల్ మీడియాలో ఫ్యాన్ వార్స్ ఎలా జరుగుతున్నాయో చూస్తూనే ఉన్నాం. కొన్నిసార్లు అభిమానుల మధ్య గొడవలు తీవ్ర స్థాయికి చేరుతుంటాయి. తమకు ఇష్టం లేని హీరోల వ్యక్తిగత విషయాలపై కొందరు అసభ్యకరమైన పోస్టులు, ట్రోల్స్ చేస్తుంటారు. సోషల్ మీడియా లేని రోజుల్లో కూడా అభిమానుల మధ్య గొడవలు జరిగేవి.

25
కొత్త తరం హీరోలుగా చిరంజీవి, బాలకృష్ణ
Image Credit : our own

కొత్త తరం హీరోలుగా చిరంజీవి, బాలకృష్ణ

అప్పట్లో ఎన్టీఆర్, కృష్ణ అభిమానులు.. కృష్ణ, శోభన్ బాబు అభిమానులు.. ఎన్టీఆర్ ఏఎన్నార్ అభిమానులు గొడవ పడేవారు. ఎన్టీఆర్, కృష్ణ, శోభన్ బాబు లాంటి లెజెండ్రీ హీరోల కెరీర్ చివరి దశకు చేరుకున్నప్పుడు చిరంజీవి, బాలకృష్ణ లాంటి హీరోలు స్టార్లుగా ఎదిగారు. ఆ టైంలో శోభన్ బాబు అభిమానులు.. చిరంజీవి, బాలకృష్ణ లాంటి హీరోల అభిమానులతో కూడా వివాదానికి దిగేవారట.

Related Articles

ముద్దు సీన్ అవసరం, చూస్తే మీకే అర్థం అవుతుంది.. వివాదంపై నటి అభిరామి రియాక్షన్
ముద్దు సీన్ అవసరం, చూస్తే మీకే అర్థం అవుతుంది.. వివాదంపై నటి అభిరామి రియాక్షన్
ఖలేజా చిత్రాన్ని సర్వనాశనం చేసింది మహేష్ బాబు అభిమానులే, తాగేసి బూతులు తిట్టారు.. నిర్మాత కామెంట్స్
ఖలేజా చిత్రాన్ని సర్వనాశనం చేసింది మహేష్ బాబు అభిమానులే, తాగేసి బూతులు తిట్టారు.. నిర్మాత కామెంట్స్
35
నాకు ఎవ్వరితో పోటీ లేదు
Image Credit : our own

నాకు ఎవ్వరితో పోటీ లేదు

అభిమానుల మధ్య గొడవలు గురించి శోభన్ బాబు స్వయంగా ఓ కార్యక్రమంలో ప్రస్తావించారు. ఇతర హీరోల అభిమానులతో గొడవలు వద్దని శోభన్ బాబు తన ఫ్యాన్స్ కి చెబుతూ చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. శోభన్ బాబు మాట్లాడుతూ.. నా అభిమానులు నాకు సొంత కుటుంబంతో సమానం. ఇప్పుడు కొత్త తరం హీరోలు ఎదుగుతున్నారు. వారిని మీరు ఏ విధంగానూ కించపరచవద్దు. ఎందుకంటే ఏ హీరోతో కూడా నాకు పోటీ లేదు.

45
చిరంజీవి, బాలకృష్ణ నా బిడ్డలతో సమానం
Image Credit : our own

చిరంజీవి, బాలకృష్ణ నా బిడ్డలతో సమానం

చిరంజీవి, బాలకృష్ణ నాకు బిడ్డలతో సమానం. వాళ్లకి దాదాపుగా నా పిల్లల ఏజ్ ఉంటుంది. కాబట్టి వాళ్లని నా సొంత బిడ్డల్లాగానే భావిస్తాను. ప్రపంచంలో ఏ తండ్రి కూడా తన బిడ్డలతో పోటీ పడాలని అనుకోడు. కాబట్టి నన్ను ఎవరితోనూ పోల్చకండి. నా బిడ్డ లాంటి వారితో నాకు పోటీ ఏంటి అని శోభన్ బాబు తెలిపారు. చిరంజీవి, బాలకృష్ణ లతో నాకు పోటీ పెట్టకండి. కుదిరితే వాళ్లని ప్రోత్సాహించండి. అంతగా మీకు నచ్చకపోతే సైలెంట్ గా ఉండండి అని శోభన్ బాబు తన అభిమానులకు హితబోధ చేశారు.

55
శోభన్ బాబు, చిరంజీవి నటించిన చిత్రాలు
Image Credit : our own

శోభన్ బాబు, చిరంజీవి నటించిన చిత్రాలు

చిరంజీవి తన కెరీర్ బిగినింగ్ లో శోభన్ బాబుతో అనేక చిత్రాల్లో నటించారు. మోసగాడు, శ్రీవారు, చండీప్రియ, బంధాలు అనుబంధాలు లాంటి చిత్రాల్లో చిరు, శోభన్ బాబు కలిసి నటించారు.

tirumala AN
About the Author
tirumala AN
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది. Read More...
తెలుగు సినిమా
శోభన్ బాబు
నందమూరి బాలకృష్ణ
 
Recommended Stories
Top Stories