- Home
- Entertainment
- AK 47 6 Days Collections: ఆదర్శ కుటుంబం కలెక్షన్లు భారీ డ్రాప్.. వెంకీ, త్రివిక్రమ్‌ల సినిమాకి ఊహించని దెబ్బ
AK 47 6 Days Collections: ఆదర్శ కుటుంబం కలెక్షన్లు భారీ డ్రాప్.. వెంకీ, త్రివిక్రమ్‌ల సినిమాకి ఊహించని దెబ్బ
వెంకటేష్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందిన `ఆదర్శ కుటుంబం హౌజ్ నెంబర్ 47` చిత్రం బాక్సాఫీసు వద్ద డీలా పడింది. ఈ సినిమా ఆరు రోజుల్లో ఎంత కలెక్ట్ చేసిందంటే?

డల్ అయిన ఆదర్శ కుటుంబం మూవీ కలెక్షన్లు
వెంకటేష్ హీరోగా, త్రివిక్రమ్ దర్శకత్వంలో `ఆదర్శ కుటుంబం హౌజ్ నెంబర్ 47` రూపొందిన విషయం తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన తొలి చిత్రమిది. ఇందులో శ్రీనిధి శెట్టి హీరోయిన్గా నటించింది. నారా రోహిత్, నివేతా పేతురాజ్, సత్య, రావు రమేష్, బ్రహ్మాజీ, యువీనా, రాజా ప్రజ్వల్ వంటి వారు కీలక పాత్రలు పోషించారు. హారికా అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్ రాధాకృష్ణ(చినబాబు) నిర్మించారు. ఈ చిత్రం అక్టోబర్ 30న విడుదలైంది. ఫ్యామిలీ ఎలిమెంట్లు ప్రధానంగా చేసుకొని యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కింది. త్రివిక్రమ్ మార్క్ కామెడీ, ఫ్యామిలీ ఎమోషన్స్, యాక్షన్ మేళవింపుగా తెరకెక్కించారు. తొలిసారి ఊరమాస్ యాక్షన్ ట్రై చేశారు. అయితే సినిమాకి ఆడియెన్స్ నుంచి మిశ్రమ స్పందన లభించింది. మూడు రోజులు బాగానే ఉంది. కానీ ఇప్పుడు డల్ అయ్యింది.
ఆదర్శ కుటుంబం 6 రోజుల కలెక్షన్లు
ఇక `ఆదర్శ కుటుంబం హౌజ్ నెంబర్ 47`(ఏకే 47) మూవీ విడుదలై ఆరు రోజులు పూర్తి చేసుకుంది. మరి ఇప్పటి వరకు ఎంత కలెక్ట్ చేసింది? వసూళ్లు ఎలా ఉన్నాయనేది చూస్తే, 6వ రోజు బుధవారం ఈ చిత్రానికి చాలా డల్‌గా వసూళ్లు వచ్చాయి. ఇండియాలో ఇది రూ.2.10కోట్లు మాత్రమే వసూలు చేసింది. ఓవర్సీస్లో రూ.35లక్షలు మాత్రమే వచ్చాయి. మొత్తంగా బుధవారం రూ.2.80కోట్లు రాబట్టింది. ఇక ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ఆరు రోజుల్లో రూ.61.80కోట్లు రాబట్టినట్టు సాక్నిల్క్ వెల్లడించింది. ఓవర్సీస్లో రూ.15.50కోట్లు వసూళు చేసింది. సోమవారం నుంచే ఈ చిత్రం భారీగా పడిపోతూ వస్తోంది.
ఆదర్శ కుటుంబం మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్
ఈ సినిమాకి రూ.70కోట్లకుపైగానే బడ్జెట్ అయ్యిందట. థియేట్రికల్ బిజినెస్ రూ.63కోట్లు అని సమాచారం. నైజాంలో రూ.17కోట్లు, సీడెడ్‌లో ఏడు కోట్లు, ఆంధ్రాలో రూ.20కోట్ల వ్యాపారం జరిగిందట. ఏపీ, తెలంగాణలో కలిపి రూ.44కోట్లు, ఇతర స్టేట్స్ అన్నీ కలిపి రూ.6కోట్లు, ఓవర్సీస్లో రూ.13కోట్ల బిజినెస్ జరిగిందని సమాచారం. సినిమా హిట్ కావాలంటే దాదాపు రూ.120-130కోట్ల గ్రాస్ కలెక్షన్లు రావాలి. ఇప్పటి వరకు దాదాపు సగం వసూళ్లు మాత్రమే రాబట్టింది. ఇంకా సగం రావాలి. మరి అది ఎంత వరకు సాధ్యమనేది చూడాలి. కానీ ప్రస్తుతం వసూళ్లు చూస్తుంటే ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కష్టమే అని టాక్.





