- Home
- Entertainment
- క్యూట్ అందాలతో స్నేహ నెవర్ బిఫోర్ లుక్.. నా యాటిట్యూడ్ నా ఇష్టమంటోన్న హోమ్లీ బ్యూటీ.. రచ్చ మామూలుగా లేదు
క్యూట్ అందాలతో స్నేహ నెవర్ బిఫోర్ లుక్.. నా యాటిట్యూడ్ నా ఇష్టమంటోన్న హోమ్లీ బ్యూటీ.. రచ్చ మామూలుగా లేదు
హోమ్లీ బ్యూటీ స్నేహ.. నిండైన రూపం, మంత్రముగ్దుల్ని చేసే అందం, కనువిందు చేసే నటనకు కేరాఫ్. పెళ్లి తర్వాత సినిమాల వేగం తగ్గించిన ఈ అందాల భామ.. చాలా సెలక్టీవ్‌గా వెళ్తుంది. ఆచితూచి అడుగులు వేస్తుంది.
- FB
- TW
- Linkdin
Follow Us
)
స్నేహ గ్లామర్‌కి దూరంగా ఉంటూ వచ్చింది. ట్రెడిషనల్ లుక్‌లోనే మెరిసింది. అందుకే హోబ్లీ బ్యూటీగా నిలిచింది. అయితే ఇటీవల కాలంలో ఆమె కాస్త గ్లామర్‌సైడ్ ఓపెన్ అవుతూ కనిపిస్తుంది. హాట్ లుక్స్ లో అదరగొడుతూ కనిపించింది. నెటిజన్లని వాహ్ అనేలా చేసింది. అడపాదడపా ఈ అమ్మడు హాట్‌గా అలరించింది.
కానీ చాలా వరకు హద్దుల్లోనే ఉంది. తాజాగా నిందైన దుస్తుల్లోనే మెరిసిందీ ముద్దుగుమ్మ. గ్రీన్ కలర్ డ్రెస్‌లో హోయలు పోయింది. కుర్రాళ్లని రెచ్చగొట్టేలా కిల్లర్ పోజులిచ్చింది. హంట్ చేసే పోజులతో కుర్రాళ్లని తన వైపు తిప్పుకుంటుంది. తనని ఫాలో అయ్యేలా చేసుకుంది. ఇందులో తీరైన పోజులతో స్నేహ ఇచ్చిన పోజులు మంత్రముగ్దుల్ని చేసేలా ఉండటం విశేషం.
స్నేహ ఈ సందర్భంగా ఓ కిర్రాక్ పోస్ట్ పెట్టింది. ఆమె నుంచి ఊహించని పోస్ట్ కావడం విశేషం. తన గ్లామర్ ఫోటోలు పంచుకుంటూ `మై లైఫ్, మై రూల్, మై యాటిట్యూడ్` అని పేర్కొంది. ఇక్కడ తన జీవితం, తాను అనుకున్నట్టుగా, తన యాటిట్యూడ్‌తోనే సాగుతుందని ఆమె తెలిపింది. దీనికి విశేష స్పందన లభిస్తుంది. మరోవైపు తన గ్లామర్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
తాను నటించిన సినిమాల్లో తెలుగింటి ఆడపడుచులా కనిపించి ఆకట్టుకుంది. తెలుగు ఆడియెన్స్ కి దగ్గరైంది స్నేహ. మిగిలిన హీరోయిన్లు గ్లామర్ షోతో దూసుకుపోతుంటే తాను మాత్రం తాను అనుకున్నదానికి కట్టుబడి ఉంది. చివరి వరకు దానిపైనే నిలబడింది.
అయితే ఈ క్రమంలో స్నేహకి ఎక్కువ కమర్షియల్ సినిమాలు రాలేదు. పెద్ద స్టార్లతోనూ కలిసి నటించలేదు. కానీ తన కెరీర్‌లో మాత్రం గుర్తిండిపోయే సినిమాలు చేసింది. బలమైన పాత్రలకే ప్రయారిటీ ఇచ్చింది. ఆ విషయంలో స్నేహ సక్సెస్ అయ్యింది.
కెరీర్ బాగా రన్ అవుతున్నప్పుడే నటుడు ప్రసన్నని ప్రేమించి పెళ్లి చేసుకుంది స్నేహ. పెళ్లి తర్వాత కొన్నాళ్లపాటు సినిమాలకు దూరమయ్యారు. ఫ్యామిలీ లైఫ్‌కే ప్రయారిటీ ఇచ్చింది. వీరికి ఓ కుమారుడు, ఓ కూతురు జన్మించారు. వాళ్లు కాస్త పెద్ద అయ్యారు. స్కూల్‌కి వెళ్లే వయసు రావడంతో మళ్లీ సినిమాలు స్టార్ట్ చేసింది స్నేహ.
కానీ సెకండ్ ఇన్నింగ్స్ లోనూ మరింత జాగ్రత్తగా సినిమాలు చేస్తుంది. తాను మాత్రమే కావాలనుకునే పాత్రలు, అలాంటి సినిమాలే చేస్తుంది. ఆ మధ్య ఈ బ్యూటీ `సన్నాఫ్ సత్యమూర్తి`, `వినయ విధేయ రామ` చిత్రాల్లో మెరిసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత మళ్లీ తెలుగులో సినిమాలు చేయలేదు ఈ బ్యూటీ.