రజినీకాంత్ కోసం శివ కార్తికేయన్ త్యాగం! తలైవా అంటే ఇంత భక్తా?
సూపర్ స్టార్ రజినీకాంత్ కు సామాన్యుల దగ్గర నుంచి సెలబ్రిటీల వరకూ ఎంతో మంది అభిమానులు ఉన్నారు. వారిలో యంగ్ హీరో శివకార్తికేయన్ కూడా ఒకరు. ఇక తాజాగా తలైవా మీద అతనికున్న భక్తిని చాటుకున్నాడు శివకార్తికేయన్. సూపర్ స్టార్ కోసం ఓ త్యాగం చేశారట ఇంతకీ ఏంటది.

శివ కార్తికేయన్, రజినీకాంత్
సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో న్యాచురల్ స్టార్ గా ఎదిగారు శివ కార్తికేయన్. ప్రస్తుతం ఆయన నటిస్తున్న సినిమా మద్రాసి. ఏ.ఆర్.మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మలయాళ నటుడు బిజు మీనన్ కూడా ముఖ్యమైన పాత్రలో నటించారు. విద్యుత్ జమాల్, విక్రాంత్, రుక్మిణి వసంత్ వీళ్లంతా సినిమాలో ముఖ్యమైన క్యారెక్టర్లలో నటిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాని శ్రీ లక్ష్మి మూవీస్ సంస్థ నిర్మిస్తోంది.
Also Read: మోహన్ బాబు బయోపిక్, మంచు విష్ణు నిర్మాత, మరి హీరో ఎవరో తెలిస్తే షాక్ అవుతారు?
మద్రాసి
మద్రాసి సినిమాకి మొదట హంటర్ అని టైటిల్ పెట్టాలనుకున్నారంట. కానీ అదే పేరుతో రజినీకాంత్ వేటయ్యన్ (హంటర్ అని అర్థం) ఉండటంతో శివ కార్తికేయన్ వద్దన్నాడంట. రజినీకాంత్ మీద ఉన్న గౌరవంతో, ఆయన వీరాభిమాని అయినందున ఆ టైటిల్ని వదులుకున్నాడంట శివ కార్తికేయన్. అందుకే ఏ.ఆర్.మురుగదాస్ ఆ సినిమా టైటిల్ని మద్రాసిగా మార్చేశాడంట. మద్రాసి ఒక యాక్షన్ ఎంటర్టైనర్ సినిమాగా రూపొందుతోంది.
Also Read:హీరోగా కాదు, ధనుష్ డైరెక్షన్‌లో హిట్టేసిన సినిమాలు ఏంటో తెలుసా?
పరాశక్తి
ఇది కాకుండా శివ కార్తికేయన్ నటిస్తున్న పరాశక్తి అనే సినిమా కూడా సిద్ధమవుతోంది. ఈ సినిమాకి సుధ కొంగర దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో శివ కార్తికేయన్ విలన్ గా జయం రవి నటిస్తున్నారు. ఇందులో శ్రీలీల, అథర్వ కూడా ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. ఇది ఆయనకు 100వ చిత్రం. ఈ సినిమాని డాన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తోంది. నిజ జీవిత సంఘటనల ఆధారంగా పరాశక్తి సినిమా రూపొందుతోంది.
Also Read:నాగార్జున అసలు పేరు ఏంటో తెలుసా? ఆయన అసలు పేరు ఎవరు మార్చారు, కారణం ఏంటి?
అమరన్
ఇంతకుముందు మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవితం ఆధారంగా శివ కార్తికేయన్ నటించిన అమరన్ సినిమా బాక్స్ ఆఫీస్లో రూ.300 కోట్లకు పైగా వసూలు చేసి రికార్డు సృష్టించింది. ఈ సినిమాలో మేజర్ ముకుంద్ వరదరాజన్ గా శివ కార్తికేయన్, ఇందు రెబెకా వర్గీస్ గా సాయి పల్లవి నటించారు. రాజ్ కుమార్ పెరియసామి దర్శకత్వం వహించిన ఈ సినిమాని కమల్ హాసన్ నిర్మించారు. ఈ సినిమా ఇటీవల 100వ రోజుల విజయోత్సవాన్ని జరుపుకుంది.
Also Read:హీరోయిన్ తో పీకల్లోతు ప్రేమలో రామ్ పోతినేని, సీక్రేట్ గా డేటింగ్ చేస్తున్న యంగ్ స్టార్స్ నిజమేనా?