మనవడు చేసిన అప్పుకి శివాజీ గణేశన్ ఇల్లు జప్తు.. హైకోర్ట్ సంచలన ఆదేశం
Sivaji Ganesan: నడిగర్ తిలగం శివాజీ గణేశన్ ఇంటిని జప్తు చేయమని హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. దుష్యంత్ తీసుకున్న అప్పు తీర్చలేకపోవడంతో కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది.

Sivaji Ganesan Chennai Home Seized And Reasons Inside in telugu
Sivaji Ganesan: నడిగర్ తిలగం శివాజీ గణేశన్(Sivaji Ganesan)ఇంటిని జప్తు చేయమని హైకోర్టు సంచనల తీర్పు ఇచ్చింది. ఇప్పుడు ఇదే తమిళ వర్గాల్లో సెన్సేషన్ వార్తగా మారింది. అయితే ఇప్పుడు ఆయన ఇల్లు ని జప్తు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది, అసలేం జరిగింది ?
Sivaji Ganesan Chennai Home Seized And Reasons Inside in telugu
వివరాల్లోకి వెళితే...
శివాజీ గణేశన్ వారసుడు దుష్యంత్ తన భార్యతో కలిసి ఈశాన్ ప్రొడక్షన్స్ అనే నిర్మాణ సంస్థ స్థాపించాడు. ఇప్పటికే నష్టాల్లో ఉండగా.. ఫైనల్ గా ఒక్క మూవీ తీసి అప్పులన్నీ తీర్చేద్దామని మొదెలెట్టారు. ఈ క్రమంలోనే ధనభాగ్యం ఎంటర్ ప్రైజెస్ అనే సంస్థ నుంచి రూ.3.74 కోట్లు రూపాయల్ని ఏడాదికి 30 శాతం వడ్డీకి అప్పుగా తీసుకున్నాడు. 'జగజాల కిలాడి' అనే సినిమా మొదలుపెట్టాడు. ఆ సినిమా సంగతేమో కానీ వడ్డీ పెరిగిపోయింది. అప్పు, వడ్డీ రెండూ తీర్చటం లేదు.
Sivaji Ganesan Chennai Home Seized And Reasons Inside in telugu
ఈ క్రమంలోనే తమ దగ్గర తీసుకున్న అప్పుని దుష్యంత్ చెల్లించలేదని.. సదరు ధనభాగ్య సంస్థ మద్రాసు హైకోర్టుని ఆశ్రయించింది. మధ్యవర్తి ద్వారా ఈ సమస్యని పరిష్కరించుకోవాలని కోర్టు చెప్పింది. ఈ క్రమంలోనే తీసిన సినిమాను ధనభాగ్య సంస్థకు ఇచ్చేయాలని దుష్యంత్ తో మధ్యవర్తి చెప్పాడు.
Sivaji Ganesan Chennai Home Seized And Reasons Inside in telugu
కానీ తాను ఇంతవరకు సినిమా పూర్తి చేయలేదని, అప్పుగా తీసుకున్న డబ్బుతో తన పాత బాకీలు తీర్చుకున్నానని దుష్యంత్ చెప్పాడు. ఈ విషయంలో తమని తప్పుదారి పట్టించాడని కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
దీంతో దుష్యంత్ కి ఉమ్మడి ఆస్తిగా దక్కిన తాత శివాజీ గణేశన్ ఇంటిని జప్తు చేయాలని, ఇంటికి తాళాలు వేయాలని అధికారుల్ని న్యాయస్థానం ఆదేశించింది. ఇది తెలిసిన దిగ్గజ హీరో అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.