MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • నన్ను పెళ్లి చేసుకుంటావా?.. నెటిజన్‌ ప్రపోజల్‌కి `సీతారామం` బ్యూటీ దిమ్మతిరిగే ఆన్సర్‌.. నెట్టింట రచ్చ రచ్చ

నన్ను పెళ్లి చేసుకుంటావా?.. నెటిజన్‌ ప్రపోజల్‌కి `సీతారామం` బ్యూటీ దిమ్మతిరిగే ఆన్సర్‌.. నెట్టింట రచ్చ రచ్చ

`సీతారామం`తో సౌత్‌ని ఊపేసిన మృణాల్‌ ఠాకూర్‌ కి పెళ్లి ప్రపోజల్‌ వచ్చింది. తాను పెట్టిన పోస్ట్ ని చూసి ఈ ప్రపోజల్‌ రాగా, ఈ బ్యూటీ రియాక్ట్ అయ్యింది. ఇదిప్పుడు రచ్చ రచ్చగా మారిపోయింది. 

2 Min read
Author : Aithagoni Raju
Published : Mar 01 2023, 01:20 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

`సీతారామం` చిత్రంతో ఒక్కసారిగా సౌత్‌లో పాపులర్‌ అయ్యింది మృణాల్‌ ఠాకూర్‌. ఆమె సీతగా ఎంతగా ఆకట్టుకుందో తెలిసిందే. ఈ బ్యూటీకి ఫిదా అయిపోయారు నెటిజన్లు. ఆడియెన్స్ ఆమె ప్రేమలో పడిపోయారు. సోషల్‌ మీడియాలోనూ ఈ బ్యూటీకి మంచి క్రేజ్‌ ఏర్పడింది. అయితే సినిమాలో కనిపించినంత హోమ్లీ బ్యూటీ తాను కాదని చాటి చెబుతుంది మృణాల్‌. 
 

27

సినిమాలో ట్రెడిషనల్‌ లుక్‌లో సీత అంటూ ఇలానే ఉంటుందేమో అనేట్టుగా మెప్పించి మైమరపింప చేసింది. కానీ సోషల్‌ మీడియాలో మాత్రం తన విశ్వరూపం చూపించింది. గ్లామర్‌ సైడ్‌ యాంగిల్‌ని ఆవిష్కరించి షాకిచ్చింది. టాప్‌ లెస్‌ ఫోటోలతో, హాట్‌ ఫోటో షూట్లతో మైండ్‌ బ్లాక్‌ చేసింది. దీంతో చాలా ట్రోలింగ్‌కి గురయ్యింది. 
 

37

ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ బ్యూటీ సోషల్‌ మీడియాలో రచ్చ చేసింది. ఓ అభిమాని అడిగిన ప్రశ్నకి సమాధానం ఇచ్చింది. ఇదే ఇప్పుడు రచ్చ లేపుతుంది. ఇన్‌స్టాగ్రామ్‌ని ఊపేస్తుంది. ఇందులో రెండు రోజుల క్రితం ఓ పోస్ట్ పెట్టింది మృణాల్‌. తన తడి జుట్టుతో చిలిపి పోజులిస్తూ దిగిన ఓ వీడియో క్లిప్‌ని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. అంతటితో ఆగలేదు, కాసేపట్లోనే డిలీట్‌ చేస్తానని తెలిపింది. దీంతో వద్దు వద్దు అంటూ అభిమానులు, సెలబ్రిటీలు సైతం రియాక్ట్ అవుతూ పోస్ట్ పెట్టడం విశేషం. 
 

47

ఇంత వరకు బాగానే ఉంది, కానీ ఇందులో ఓ నెటిజన్‌, నన్ను పెళ్లి చేసుకుంటావా? అని ప్రశ్నించాడు. `నా తరఫున పెళ్లి పక్కా` అని పోస్ట్ చేయగా, దానికి మాత్రం రియాక్ట్ అయ్యింది మృణాల్‌ ఠాకూర్‌. `నా తరఫు నుంచి వద్దు అనుకుంటున్నా` అని హిందీలో పోస్ట్ చేసింది. దీంతో సదరు నెటిజన్‌కి దిమ్మతిరిగిపోయింది. తన పోస్ట్ కి అతను రియాక్ట్ అవుతుందనే ఊహించలేదు, దీంతో ఆమె చెప్పిన సమాధానం కంటే ఆమె రియాక్ట్ అయినందుకే మైండ్‌ బ్లాక్‌ అయిపోయిందని అంటున్నారు. 
 

57

ఇదే ఇప్పుడు గోల గోలగా మార్చేసింది. దీనికి నెటిజన్లు కుప్పలు కుప్పలుగా రియాక్ట్ అవుతూ పోస్ట్ లు పెడుతున్నారు. నానా రచ్చ చేస్తున్నారు. దీంతో మిగిలిన నెటిజన్లు సైతం ఎగబడి పోస్ట్ లు పెడుతున్నారు. నన్ను పెళ్లి చేసుకుంటావా? అంటూ గోల గోల చేస్తున్నారు. ఏదేమైనా హీరోయిన్లు ఇలా రియాక్ట్ అయితే నెటిజన్లకి పండగే అని చెప్పొచ్చు. అంతేకాదు దీన్ని అంతా సైలెంట్‌గా గమనిస్తూ సెలబ్రిటీలు ఎంజాయ్‌ చేస్తారని చెప్పడంలో అతిశయోక్తి లేదు. 
 

67

ఇక సీరియల్స్ నుంచి కెరీర్‌ ని ప్రారంభించిన మృణాల్‌ ఠాకూర్‌.. కెరీర్‌ పరంగా ఎన్నో స్ట్రగుల్స్ పడింది. అనేక ఆటుపోట్లు ఎదుర్కొంది. సినిమా అవకాశాల కోసం అనేక అవమానాలను చవిచూసింది. ఒక్కో మెట్టు ఎక్కుతూ ఈ దశకు చేరుకుంది. `సీతారామం` తర్వాత ఈ బ్యూటీ కెరీర్‌కి బిగ్‌ బ్రేక్‌ దక్కింది. దీంతో వరుస అవకాశాలు క్యూ కడుతున్నాయి. ఇప్పటికే హిందీలో `గుమ్రా`, `పూజా మేరీ జాన్‌`, `పిప్పి`, `ఆంఖ్‌ మిచోలి`చిత్రాల్లో నటించింది. ఇవి విడుదలకు సిద్ధమవుతున్నాయి. అందులో `గుమ్రా` రిలీజ్‌ డేట్‌ని ప్రకటించారు. ఏప్రిల్‌ 7న విడుదల చేయబోతున్నట్టు తాజాగా మృణాల్‌ తెలిపింది. ఇదిలా ఉంటే ఇందులో గన్‌ పట్టుకుని సూపర్‌ ఉమెన్‌గా తనలోని మరో యాంగిల్‌ని చూపిస్తుంది మృణాల్‌. ఈ పోస్టర్‌ ఆద్యంతం ఆకట్టుకుంటుంది.
 

77

మరోవైపు తెలుగులోనూ అవకాశాలు జోరందుకుంటున్నాయి. ప్రస్తుతం ఈ బ్యూటీ `నాని30` చిత్రంలో నటిస్తుంది. ఇటీవలే ఈ సినిమా ప్రారంభమైన విషయం తెలిసిందే. దీంతోపాటు పెద్ద స్టార్ల సినిమాల్లోనూ ఈ బ్యూటీ పేరుని పరిశీలిస్తున్నట్టు సమాచారం. త్వరలోనే వరుసగా కొత్త ప్రాజెక్ట్ లను ప్రకటించనున్నట్టు తెలుస్తుంది. 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Karthika Deepam 2 Today Episode: హస్పిటల్లో దీప- దశరథను రెచ్చగొట్టిన జ్యో- నిజం చెప్పేశాడా?
Recommended image2
Mansion House Mallesh Movie Review: మెన్షన్‌ హౌజ్‌ మల్లేష్‌ మూవీ రివ్యూ.. అడల్ట్ కామెడీతో వచ్చిన ఈ సినిమా ఎలా ఉందంటే?
Recommended image3
చిరు, చరణ్, పవన్, సూర్య తో పాటు అల్లు శిరీష్ పెళ్లిలో సందడి చేసిన తారలు ఎవరెవరో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved