MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Bigg Boss Telugu 10
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
IMD Weather Update
iPhone 18 Pro
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Entertainment
  • RGV: ఆ పాట తీసేటప్పుడు ఆర్జీవీ తెలివిని చూసి ఆశ్చర్యపోయా.. ఇంత అందంగా తీస్తాడనుకోలే

RGV: ఆ పాట తీసేటప్పుడు ఆర్జీవీ తెలివిని చూసి ఆశ్చర్యపోయా.. ఇంత అందంగా తీస్తాడనుకోలే

RGV: దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు తన సినిమాలోని సన్నివేశాలపై ఉన్న స్పష్టత గురించి సిరివెన్నెల గొప్పగా వివరించారు. 'క్షణక్షణం' సినిమాలో "జామురాతిరి జాబిలమ్మ" పాటను సృష్టించే క్రమంలో వర్మ తనకు ఇచ్చిన స్వేచ్ఛను.. 

2 Min read
Author : Pavithra D
Published : Apr 10 2026, 12:59 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
సిరివెన్నెల మాటల్లో ఆర్జీవీ
Image Credit : Pinterest

సిరివెన్నెల మాటల్లో ఆర్జీవీ

తెలుగు సినీ సాహితీ ప్రపంచంలో సిరివెన్నెల సీతారామశాస్త్రి స్థానం అద్వితీయం. ఆయన పాటల్లో ఉండే గాఢత, భావం ప్రేక్షకులను మంత్రముగ్థులను చేస్తాయి. ముఖ్యంగా రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన 'క్షణక్షణం' సినిమాలోని పాటలు ఇప్పటికీ ఆల్ టైమ్ ఫేవరెట్స్‌గా నిలిచిపోయాయి. ఈ పాటల సృష్టి వెనుక ఉన్న అనుభవాలను సిరివెన్నెల గతంలో ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ఆర్జీవీ విజన్, స్పష్టత:
Image Credit : our own

ఆర్జీవీ విజన్, స్పష్టత:

రామ్ గోపాల్ వర్మకు తన కథపై, సన్నివేశాలపై అద్భుతమైన స్పష్టత ఉంటుందని సిరివెన్నెల కొనియాడారు. 'క్షణక్షణం' సినిమాలో కేవలం రెండు పాటలకే చోటు ఉందని, అందులో ఒకటి కోటి రూపాయలు దొరికితే మధ్యతరగతి ఆశలు ఎలా ఉంటాయనే దానిపై సీన్ రాయమని వర్మ అడిగారట. ఆ సీన్‌నే పాటగా మార్చడం జరిగింది. వర్మ తన పనిలో ఎంత క్లారిటీగా ఉంటారంటే, "మీరు రామాయణం రాసినా, మరేది రాసినా నేను ఎలా తీయాలో అలాగే తీస్తాను" అని చెప్పేంత ధైర్యం ఆయనది.

Related Articles

Related image1
Now Playing
Dhurandhar 2 Review And Rating.. రణ్‌వీర్‌ సింగ్‌ సినిమా ఎలా ఉందంటే? | Cinema | Asianet News Telugu
Related image2
Now Playing
Bandla Gnesh Speech: మనోడు మంచి ప్యాకేజీని ఇచ్చాడు వాడుకోండి | Cinema Releases | Asianet News Telugu
35
జామురాతిరి జాబిలమ్మ - ఒక అద్భుతం:
Image Credit : our own

జామురాతిరి జాబిలమ్మ - ఒక అద్భుతం:

ఈ సినిమాలో అత్యంత ప్రజాదరణ పొందిన "జామురాతిరి జాబిలమ్మ" పాట గురించి చెబుతూ.. అది కేవలం ఒక హీరో హీరోయిన్ కోసం పాడే పాట కాదని శాస్త్రి వివరించారు. అడవిలో భయపడుతున్న ఒక చిన్న పాపాయిని ఓదార్చే తండ్రిలా లేదా ఒక నిష్కల్మషమైన స్నేహితుడిలా ఈ పాటను రాశానని చెప్పారు. అతిలోక సుందరి శ్రీదేవిని ముఖానికి బురద పూసి ఒక గొయ్యిలో కూర్చోబెట్టి, ఆమె అందాన్ని కాకుండా ఆమెలోని అమాయకత్వాన్ని(పాపాయి మనస్తత్వాన్ని) చూపిస్తూ పాట పాడించడం వర్మ గొప్పతనం అని ఆయన అన్నారు.

45
సాహిత్యం, సహజత్వం:
Image Credit : our own

సాహిత్యం, సహజత్వం:

సినిమా కథకు సంబంధం లేకపోయినా, వినడానికి ఆహ్లాదకరంగా ఉండేలా అక్షరాలను పేర్చడంలో సిరివెన్నెలసిద్ధహస్తులు. "అందనంత ఎత్త తారా తీరం ఎందుకందా" వంటి పద ప్రయోగాలు సన్నివేశానికి ఒక కొత్త అందాన్ని తెచ్చాయని ఆయన గుర్తు చేసుకున్నారు.

55
ఒక అద్భుతమైన పాట..
Image Credit : our own

ఒక అద్భుతమైన పాట..

దర్శకుడు క్రియేట్ చేసిన వాతావరణం, నటీనటుల ప్రతిభ, గాయకుల గళం అన్నీ కలిస్తేనే ఒక అద్భుతమైన పాట పుడుతుందని, తన బాధ్యత కేవలం ఆ భావాలను అక్షరాల్లోకి తర్జుమా చేయడం మాత్రమేనని ఆయన వినమ్రంగా చెప్పారు.

About the Author

PD
Pavithra D
పవిత్ర సీనియర్ జర్నలిస్ట్. ఈమె పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో ఆంధ్రజ్యోతి, ఇతర వెబ్ సైట్లలో సబ్ ఎడిటర్ గా పని చేశారు. ప్రస్తుతం ఏసియానెట్ న్యూస్ తెలుగులో ఫ్రీలాన్సర్ గా ఉన్నారు.
తెలుగు సినిమా
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss: బిగ్ బాస్ లో హైయెస్ట్ పెయిడ్ హోస్ట్ ఎవరు.. నాగార్జునని మించిపోయిన క్రేజీ విలన్
Recommended image2
Bigg Boss: బిగ్ బాస్ 20లో మేరీ కోమ్ గ్రాండ్ ఎంట్రీ.. వార్నింగ్ ఇచ్చిన ప్రియాంక చోప్రా
Recommended image3
Irumudi Day 17 Collections: బాక్సాఫీసు వద్ద ఇరుముడి సునామీ.. లాభాల్లో రవితేజ సినిమా రికార్డు
Related Stories
Recommended image1
Now Playing
Dhurandhar 2 Review And Rating.. రణ్‌వీర్‌ సింగ్‌ సినిమా ఎలా ఉందంటే? | Cinema | Asianet News Telugu
Recommended image2
Now Playing
Bandla Gnesh Speech: మనోడు మంచి ప్యాకేజీని ఇచ్చాడు వాడుకోండి | Cinema Releases | Asianet News Telugu
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved