MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • బిగ్‌బాస్‌ సభ్యుల ఫస్ట్ లవ్‌ః ప్రియుడి కాళ్ల మీద పడ్డ ప్రియాంక.. నిద్రలేచే లోపు లవర్ చనిపోతే.. ఏడిపించిన సిరి

బిగ్‌బాస్‌ సభ్యుల ఫస్ట్ లవ్‌ః ప్రియుడి కాళ్ల మీద పడ్డ ప్రియాంక.. నిద్రలేచే లోపు లవర్ చనిపోతే.. ఏడిపించిన సిరి

బిగ్‌బాస్‌5 గురువారం ఎపిసోడ్‌లో ఫన్‌తోపాటు కన్నీళ్లు పెట్టించారు ఇంటిసభ్యుల. తమ జీవితంలోని ఫస్ట్ లవ్‌ గురించి చెప్పి ఎమోషనల్‌ అయ్యారు. ఇందులో ప్రియాంక సింగ్‌, సిరిల ఫస్ట్ లవ్‌ కంటతడి పెట్టిస్తుంది. హృదయాలను కదిలిస్తుంది.  

4 Min read
Author : Aithagoni Raju
| Updated : Sep 24 2021, 12:43 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
112

19వ రోజు బిగ్‌బాస్‌ షోలో మొదట ఇంటి సభ్యుల మధ్య సరదా చిట్‌చాట్‌ సాగింది. సిరిని దూరం పెట్టే ప్రయత్నం చేశాడు షణ్ముఖ్‌. దీంతో ఆమె ఫీలై కన్నీళ్లు పెట్టుకుంది. మరోవైపు కెప్టెన్సీ టాస్క్ ఇచ్చాడు బిగ్‌బాస్‌. ప్రియా నెక్లెస్‌ దొంగిలించిన యాంకర్‌ రవి, శ్రీరామ్‌, జస్వంత్‌, స్వేత వర్మలు కెప్టెన్సీ కోసం పోటీ పడ్డారు. `స్వింగ్‌ జరా.. `టాస్క్ లో జెస్సీ తొందరగా కెప్టెన్‌ అనే అక్షరాలను స్విమ్మింగ్‌ పూల్‌లో నుంచి తీసుకొచ్చి తనకిచ్చి బాక్స్ లో ఫిక్స్ చేశాడు. దీంతో నెక్ట్స్ వీక్ కెప్టెన్ గా గెలుపొందారు. షణ్ముఖ్‌కి రేషన్‌ మెనేజర్‌గా ఎంచుకున్నాడు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
212

ఆ తర్వాత ఇంటి సభ్యులు తమ ఫస్ట్ లవ్‌ జ్ఞాపకాలను పంచుకోవాలని తెలిపాడు బిగ్‌బాస్‌  మొదట షణ్ముఖ్‌ తన ఫస్ట్ లవ్‌ గురించి తెలిపారు. 8వ క్లాస్‌ నుంచి ఐషు అనే అమ్మాయిని ప్రేమించాడట. తనకున్న సిగ్గు కారణంగా చెప్పలేకపోయానని, ఇంటర్‌ సెకండ్‌ ఇయర్‌లో ఆమె బర్త్ డే రోజు ప్రపోజ్‌ చేశానని తెలిపాడు. ప్రపోజ్‌ తర్వాత దాన్ని ఎలా మెయింటేన్‌ చేయాలో అర్థం కాక ఇద్దరి మధ్య డిఫరెన్స్ వచ్చిందని, బ్రేకప్‌ అయ్యిందని తెలిపాడు. ఈ విషయం దీప్తి సునైనా(ప్రస్తుత లవర్‌)కి కూడా తెలుసని పేర్కొన్నాడు షణ్ముఖ్‌. 
 

312

సిరి తన ఫస్ట్ లవ్‌ చెబుతూ కన్నీళ్లు పెట్టించింది. తనకు ఎదురింటి అబ్బాయి విష్ణు, తాను ప్రేమించుకున్నామని, తన ఎంగేజ్‌మెంట్‌కి ముందురోజు వచ్చి ప్రేమ విషయాన్ని చెప్పాడని, `నేను లేకపోతే ఉండలేనని, నా కాళ్లు పట్టుకుని బ్రతిమాలాడు. దీంతో ఆ రోజు రాత్రి ఇద్దరం కలిసి పారిపోయాం. కొన్ని రోజులకు ఇంట్లో వాళ్లు మాట్లాడి తీసుకొచ్చారు. అబ్బాయి గురించి చెప్పాం. పెళ్లికి ఒప్పుకున్నారు. మధ్యలో కొన్ని రోజులు రిలేషన్స్ లో ఉన్నాం. ఆ టైమ్‌లో కొంత గ్యాప్‌ వచ్చింది. ఓ రోజు రాత్రి మూడు, నాలుగు గంటలకు మెల్కువ వచ్చింది. మళ్లీ పడుకుని ఉదయం ఎనిమిది గంటలకు లేస్తే అతను చనిపోయినట్టు  న్యూస్‌ వచ్చింది` అని చెప్పి కన్నీళ్లు పెట్టింది సిరి. అందరిచేత కన్నీళ్లు పెట్టించింది. 

412

విశ్వ తన ఫస్ట్ లవ్‌ గురించి చెబుతూ, చిన్నప్పుడు తాను సుమలత అనే అమ్మాయిని ఇష్టపడ్డానని తెలిపాడు. ఆమె తనకు భార్య అయ్యే వరుస కాదని తెలిసిందని, అయినా ట్రై చేశానని చెప్పాడు. ఆ తర్వాత దూరంగా ఉన్నామని, ఆమెకి పెళ్లి అయి పాప పుట్టిందని, ఆ తర్వాత ఆమె చనిపోయిందని తెలిపారు. అయితే ఓ సిస్టర్‌ని కోల్పోయానని, ఇప్పుడు హౌజ్‌లో స్వేత ద్వారా తనకు ఓ సిస్టర్‌ దొరికిందన్నారు. 

512

ప్రియాంక సింగ్‌.. ఫస్ట్ లవ్‌ మరింత ఎమోషనల్‌కి గురి చేసింది. అందరి హృదయాలను పిండేసింది. ఫంక్షన్‌లో రవి అనే అబ్బాయి పరిచయం అయ్యాడని ప్రేమించుకున్నామని, తను ఎంతో సపోర్ట్ చేశాడని తెలిపింది. `బ్యాక్ బోన్‌గా ఉండి, పెళ్లి కూడా చేసుకుంటానన్నాడు. అప్పుడే అతనికి పెళ్లి సంబంధాలు వచ్చాయి. ఆ విషయం చెప్పినప్పుడు చేసుకో అన్నా. కానీ తనని పెళ్లి చేసుకుంటావని చెప్పావుగా అని అడగ్గా.. `నువ్వు అసలు అమ్మాయివేనా, నిన్ను ఎలా పెళ్లి చేసుకుంటా` అని ముఖం మీదే చెప్పాడ`ని తెలిపి కన్నీళ్లు పెట్టుకుంది ప్రియాంక. అతన్ని బాగా ప్రేమించానని, ఎలాగైన పెళ్లి చేసుకుందామని కాళ్ల మీద పడ్డానని, చివరికి బండిపై వెళ్తుంటే కూడా చాలా దూరం పరిగెత్తానని, కానీ అతను తన స్వార్థం చూసుకున్నాడని తెలిపింది. పది రోజుల తర్వాత కలిసినప్పుడు కూడా `నువ్వు ఎవరో తెలుసా` అంటూ తన జెండర్‌ గురించి వందల సార్లు అన్నాడని, అది తనని ఎంతో కలచివేసిందని తెలిపింది ప్రియాంక. తన విషాదకరమైన ఫస్ట్ లవ్‌ జ్ఞాపకాలను పంచుకుని అందరి చేత కన్నీళ్లు పెట్టించింది. అయితే ఇప్పుడు అతను ఎక్కడ ఉన్నా సంతోషంగా ఉండాలని, ఏ ఆపద వచ్చిన తాను ఉన్నానని తెలిపింది. కాక దయజేసి ఇంకెప్పుడు తన లైఫ్‌లోకి రావద్దని తెలిపింది. 

612

అనీ మాస్టర్‌ చెబుతూ, ప్రియుడి పేరు ప్రమోద్‌ అని, ప్రేమించి పెళ్లి చేసుకున్నామని, `ఏ రోజూ ఆయన ఐ లవ్యూ చెప్పలేదు, కానీ నన్ను బాగా చూసుకున్నాడు. ఈ రోజు నేనీ స్థానంలో ఉండటానికి తనే కారణం. కెరీర్‌కి ఎంతో సపోర్ట్ చేశాడని, తనకి ఏ ఇబ్బంది కలిగినా ఆయనే చూసుకున్నాడ`ని తెలిపింది అనీ మాస్టర్‌
 

712

యాంకర్‌ రవి.. చెబతూ, తన ఫస్ట్ లవ్‌ నిత్యా అని, తనని ముందే ఓ ఫ్రెండ్‌ ప్రేమించాడని, కానీ తాను ఆమెని వదలకుండా ప్రేమించానని, ఆమె పరిచయం తనలో కాన్ఫిడెన్స్ ని  నింపిందని పేర్కొన్నాడు. నాలుగేళ్ల క్రితం ఆమెకి పెళ్లి అయ్యిందని, ఆమెకి ఓ పాప కూడా పుట్టిందని, లక్కీగా ఆ పాపకి తనే తండ్రి అని చెప్పి షాక్‌ ఇచ్చాడు రవి. 

812

నటరాజ్‌ మాస్టర్‌ చెబుతూ, తన ఫస్ట్ లవ్‌ తన భర్యే అని, ఆమె తన వెంటపడిందని, కానీ తాను పట్టించుకోలేదని, కొన్ని రోజుల తర్వాత క్యాండిల్‌ లైట్‌తో ప్రపోజ్‌ చేశానని, ఈ హౌజ్‌లోకి రావడానికి తనే కారణం అని, ప్రస్తుతం ఆమె ప్రెగ్నెంట్‌ అని తెలిపాడు.

912

జెస్సీ చెబుతూ, తన ఫస్ట్ లవ్‌ చిన్ని అని, ఆమెని ఇష్టపడ్డానని, సైకిల్‌పై ఫాలో అయ్యేవాడినని, ఓ రోజు ఛాక్లెట్‌ ఇచ్చి ప్రపోజ్‌ చేశానని, తల ఊపి వెళ్లిపోయిందని, ఆ తర్వాత నెంబర్‌ కనుక్కుని ఫోన్‌ చేస్తే మాట్లాడి తన ఫోన్‌ని బ్లాక్ చేసిందని చెప్పాడు. `ఆ తర్వాత రీసెంట్‌గా మళ్లీ మెసేజ్‌ చేస్తే రిప్లై ఇచ్చింది. రెండు రోజులు కంటిన్యూగా మెసేజ్‌ చేసి, తాను చెప్పాలనుకున్న విషయాలన్నీ చెప్పి మళ్లీ బ్లాక్‌ చేసింద`న్నారు. తను ఇప్పు సింగిల్‌ అయితే తాను మింగిల్‌ అవడానికి రెడీగా ఉన్నట్టు చెప్పాడు జెస్సీ. 
 

1012

ప్రియా.. తన ఫస్ట్ లవ్‌ కిశోర్‌ అని, అతన్నే పెళ్లి చేసుకున్నట్టు తెలిపింది. అతను ఎంఎల్‌టీ పూర్తి చేసి హీరో అవ్వాలని ఇండస్ట్రీకి వచ్చి తనకు పరిచయం అయ్యాడని, ఇద్దరి మధ్య ఇష్టం పెరిగిందని, ఓ రోజు ఇంటికొచ్చి ప్రేమని వ్యక్తం చేశాడని తెలిపింది. ఆ సమయంలో డాడీ లాస్‌లో ఉన్నాడని, తను కూడా జాబ్‌ చేయాల్సిన పరిస్థితి. పేరెంట్స్ ఒప్పుకోలేదు. కొన్నాళ్ల తర్వాత తన పేరెంట్సే ఒప్పుకున్నారని, వాళ్ల పేరెంట్స్ నో చెప్పారని, కానీ తన పేరెంట్సే పెళ్లి చేశారని తెలిపింది. ఇప్పటికీ తనని ప్రేమిస్తున్నానని, కానీ సెల్ఫ్‌ రెస్పెక్ట్ మిస్‌ అయితే ఎలా ఉంటుందో తెలుసుకున్నానని, ఇప్పుడు తనది మ్యారేజా? సపరేటా? డైవోర్స్ ఏంటో తనకే అర్థం కావడం లేదని తెలిపింది. కానీ అతనే తన ఫస్ట్ లవ్‌ అని, ఇప్పటికీ ప్రేమిస్తున్నానని చెప్పింది ప్రియా.

1112

కాజల్‌ చెబుతూ, తనది సక్సెస్‌ఫుల్‌ లవ్‌ స్టోరీ అని పేర్కొంది. ఓ ఫంక్షన్‌ లో చూసి ఇష్టపడ్డామని, ఫోన్‌ చేసి అతన్ని కలిశామని, ప్రేమకి ఇంట్లో వాళ్లు నో చెప్పారని, దీంతో డయల్‌ 100కి ఫోన్‌ చేసి తనని హింసిస్తున్నారని ఫిర్యాదు చేసినట్టు తెలిపింది. పోలీసులు వచ్చి తనని తీసుకునిపోయారని, కానీ ఇప్పుడు పాప పుట్టాక.. తాను ఆ సమయంలో పేరెంట్స్ గురించి ఎంత తక్కువగా ఆలోచించానో అర్థమవుతుందని, బిగ్‌బాస్‌లోకి వచ్చాక తన పాపని వాళ్లే చూసుకుంటున్నారని తెలిపి కన్నీళ్లు పెట్టుకుంది కాజల్‌.

1212

లోబో చెబుతూ, తనది 14ఏళ్ల ప్రేమ అని, ఆమె తాగిన ప్లాస్టిక్‌ గ్లాసులు, టిష్యూలు, మేకప్‌ కిట్‌లు కూడా దాచుకున్నానని, 22 మే మధ్యాహ్నం 1.30కి ఆమెకి ప్రపోజ్‌ చేశానని తెలిపాడు. దాన్ని తన కాలుపై కూడా టాటూ వేయించుకున్నాడు లోబో. ప్రస్తుతం తాను ఓ బాధ్యతగల స్థానంలో ఉన్నానని, ఎమోషనల్‌ కాలేనని తెలిపాడు. ఆమె పేరు శృతి అని పేర్
 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
Allu Arjun: పాన్ ఇండియా రేంజ్ లో రీ- రిలీజ్ కాబోతున్న అల్లు అర్జున్ 22 ఏళ్ల పాత సినిమా
Recommended image2
Rukmini Vasanth Deepfake Case: ఎన్టీఆర్ హీరోయిన్ డీప్‌ఫేక్ కేసు..ముగ్గురు అరెస్ట్, ఎలా దొరికిపోయారో తెలుసా ?
Recommended image3
Naga Durga: బంపర్ ఆఫర్ కొట్టేసిన యూట్యూబర్, క్రేజీ హీరోతో రొమాన్స్.. సుకుమార్ సెట్ చేసిన కాంబో
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved