MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Entertainment
  • Rukmini Vasanth Deepfake Case: ఎన్టీఆర్ హీరోయిన్ డీప్‌ఫేక్ కేసు..ముగ్గురు అరెస్ట్, ఎలా దొరికిపోయారో తెలుసా ?

Rukmini Vasanth Deepfake Case: ఎన్టీఆర్ హీరోయిన్ డీప్‌ఫేక్ కేసు..ముగ్గురు అరెస్ట్, ఎలా దొరికిపోయారో తెలుసా ?

నటి రుక్మిణి వసంత్ ఏఐ (AI) డీప్‌ఫేక్ అశ్లీల వీడియోను వైరల్ చేసిన కేసులో బెంగళూరు సైబర్ క్రైమ్ పోలీసులు ముగ్గురు యువకులను అరెస్ట్ చేశారు. కర్ణాటకలోని వేర్వేరు జిల్లాలకు చెందిన ఈ నిందితులను పోలీసులు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. 

2 Min read
Author : Tirumala Dornala
Published : Jun 20 2026, 03:54 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
నటి రుక్మిణి వసంత్
Image Credit : insta

నటి రుక్మిణి వసంత్

కన్నడ సినీ పరిశ్రమకు చెందిన టాలెంటెడ్ నటి రుక్మిణి వసంత్ పేరుతో ఏఐ టెక్నాలజీ వాడి అశ్లీల వీడియోలు, ఫోటోలు సృష్టించి వైరల్ చేసిన కేసును బెంగళూరు సైబర్ క్రైమ్ పోలీసులు ఛేదించారు. ఈ దుశ్చర్యకు పాల్పడిన ముగ్గురు యువకులను అరెస్ట్ చేసి, వారి నుంచి మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ముగ్గురు అరెస్ట్
Image Credit : Asianet News

ముగ్గురు అరెస్ట్

అరెస్ట్ అయిన వారిని రవికుమార్ (24), చంద్రకాంత్ (33), రంజిత్ (25)గా పోలీసులు గుర్తించారు. రవికుమార్ బాగల్‌కోట్ జిల్లా వాసి కాగా, రంజిత్ బెంగళూరు నగరానికి చెందినవాడు. మూడో నిందితుడు చంద్రకాంత్ స్వస్థలం శివమొగ్గలోని తీర్థహళ్లి. ప్రస్తుతం బెంగళూరులో నివసిస్తున్నాడని పోలీసులు తెలిపారు. ఈ నేరానికి ఉపయోగించిన మూడు ఖరీదైన స్మార్ట్‌ఫోన్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Related Articles

Related image1
Maa Inti Bangaram: పెద్దికి దెబ్బేసిన సమంత, మా ఇంటి బంగారం డే 1 కలెక్షన్స్.. అనుష్క, రష్మికలకు చుక్కలు
Related image2
Naga Durga: బంపర్ ఆఫర్ కొట్టేసిన యూట్యూబర్, క్రేజీ హీరోతో రొమాన్స్.. సుకుమార్ సెట్ చేసిన కాంబో
35
సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు
Image Credit : Asianet News

సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు

కొన్ని రోజుల క్రితం ఇన్‌స్టాగ్రామ్, ఎక్స్ (ట్విట్టర్), ఫేస్‌బుక్‌లో నటి రుక్మిణి వసంత్ ముఖంతో ఉన్న ఒక అశ్లీల వీడియో వైరల్ అయింది. ఇది ఏఐ డీప్‌ఫేక్ టెక్నాలజీతో సృష్టించిన వీడియో. ఈ ఘటనతో తీవ్ర ఆవేదనకు గురైన రుక్మిణి, 'నేను అలాంటి దృశ్యాల్లో నటించలేదు, ఇది ఆకతాయిల పని' అని స్పష్టం చేస్తూ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
45
ఐపీ అడ్రస్‌ల ఆధారంగా దర్యాప్తు
Image Credit : Instagram: Rukmini Vasanth

ఐపీ అడ్రస్‌ల ఆధారంగా దర్యాప్తు

ఈ కేసును సీసీబీ సైబర్ క్రైమ్ పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. వీడియో అప్‌లోడ్ అయిన ఖాతాల ఐపీ అడ్రస్‌ల ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. మొదట ఈ వీడియోలను వేరే రాష్ట్రం వాళ్లు షేర్ చేశారని అనుమానించారు. కానీ టెక్నికల్ ఇన్వెస్టిగేషన్‌లో కర్ణాటకకు చెందిన ఆకతాయిలే ఈ పని చేశారని తేలింది. కేసు నమోదు కాగానే నిందితులు సోషల్ మీడియా ఖాతాలు డిలీట్ చేసి పారిపోవడానికి ప్రయత్నించారు. కానీ సైబర్ పోలీసులు వారిని చాకచక్యంగా పట్టుకున్నారు.
55
వీరి వెనుక ఇంకా ఎవరైనా ఉన్నారా?
Image Credit : Instagram

వీరి వెనుక ఇంకా ఎవరైనా ఉన్నారా?

అరెస్ట్ అయిన నిందితులను కోర్టులో హాజరుపరిచి, తదుపరి విచారణ కోసం పోలీస్ కస్టడీకి తీసుకున్నారు. వీరి వెనుక ఇంకా ఎవరైనా ఉన్నారా? లేదా వీళ్లు ఇతర నటీమణుల వీడియోలను కూడా ఇలాగే మార్ఫింగ్ చేశారా? అనే కోణంలో దర్యాప్తు ముమ్మరం చేశారు. ఏఐ టెక్నాలజీని దుర్వినియోగం చేసి మహిళల గౌరవానికి భంగం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీస్ శాఖ హెచ్చరించింది.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
Ankit Balyan: 471 మిలియన్ వ్యూస్ సాధించిన సింగర్ దారుణ హత్య.. ఎవరీ అంకిత్ బాలియాన్?
Recommended image2
Shakeela : వాళ్లు ప్రేమించింది నన్ను కాదు... జీవితంలోని చీకటి నిజాలు చెప్పిన షకీలా
Recommended image3
Ranabaali Release Date: రణబాలి మూవీ కొత్త రిలీజ్‌ డేట్‌.. విజయ్‌ దేవరకొండ, రష్మికకి అసలైన పండగ
Related Stories
Recommended image1
Maa Inti Bangaram: పెద్దికి దెబ్బేసిన సమంత, మా ఇంటి బంగారం డే 1 కలెక్షన్స్.. అనుష్క, రష్మికలకు చుక్కలు
Recommended image2
Naga Durga: బంపర్ ఆఫర్ కొట్టేసిన యూట్యూబర్, క్రేజీ హీరోతో రొమాన్స్.. సుకుమార్ సెట్ చేసిన కాంబో
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved