- Home
- Entertainment
- Brahmamudi: టెన్షన్ తో వణికిపోతున్న కృష్ణమూర్తి.. అవమాన భారంతో రగిలిపోతున్న స్వప్న!
Brahmamudi: టెన్షన్ తో వణికిపోతున్న కృష్ణమూర్తి.. అవమాన భారంతో రగిలిపోతున్న స్వప్న!
Brahmamudi: స్టార్ మాలో ప్రసారం అవుతున్న బ్రహ్మముడి సీరియల్ మంచి కంటెంట్ తో ప్రేక్షకుల హృదయాలని గెలుచుకుంది. అత్తింట్లో తన మాటకి విలువ లేదని కోపంతో రగిలిపోతున్న ఓ కోడలి కథ ఈ సీరియల్. ఇక ఈరోజు ఏప్రిల్ 12 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.

ఎప్పుడు ప్రారంభంలో మీకు ఏ ఏ వంటలు కావాలి అంటూ హడావిడి చేస్తుంది మీనాక్షి. నాకు ఏమీ వద్దు అని బయటికి వెళ్ళిపోతుంటే రాజుని ఆపి మీరు మాటిమాటికి అలాగా బయటకి వెళ్తానంటే మా పరువు ఏం కావాలి. మీ మంచితనం గురించి మీ విశాల హృదయం గురించి వీళ్ళందరికీ చెప్పటానికే వీళ్ళని ఇక్కడకు తీసుకువచ్చాను. బలవంతంగా పెళ్లి చేశారు అత్తారింట్లో మీ పిల్లని నానా కష్టాలు పెడతారేమో అన్నారు కదా చూడండి నా అల్లుడిది ఎంత విశాల హృదయమో, పెళ్లయిన మూడు రోజులకే పెళ్ళాం వెనకాతల వచ్చాడు అంటూ గొప్పలు పోతుంది మీనాక్షి.
మీరేమీ టెన్షన్ పడకండి మీరు ఉండే మూడు రోజులు మర్యాదల్లో ముంచేస్తాము అంటుంది. భార్య దగ్గరికి వెళ్లి వెళ్ళిపోతాము అని చెప్పు ఈవిడ మూడు రోజులకి కమిట్ చేసేస్తుంది అంటాడు రాజ్. అలాగే అంటూ భర్తతో చెప్పిన కావ్య మూడు రోజులు ఏంటి నాలుగు రోజులు ఉంటానంటున్నారు అంటూ రాజ్ ని బుక్ చేసేస్తుంది. ఒకసారి గా షాక్ అవుతాడు రాజ్. నువ్వు లోపలికి రా నీతో మాట్లాడాలి అంటాడు.
మూడు నిమిషాలు కూడా ఉండలేను అంటుంటే మూడు రోజులకు ఈ బుక్ చేసేస్తావా నాటకాలు ఆడుతున్నావా అంటూ కేకలు వేస్తాడు రాజ్. భోజనం చేసి వెళ్దామని నేను బ్రతిమాలితే వినలేదు కదా అందుకే నేను మీ మాట వినలేదు అంటుంది కావ్య. ఈ వేడిలో ఈ ఉక్కపోతలో నేను ఎలా చావాలి ఇప్పుడే వెళ్లిపోతాను అని మీ అమ్మకి చెప్తాను అంటాడు. వెళ్లండి మా అమ్మని, పెద్దమ్మని దాటుకొని వెళ్లగలరా అంటుంది కావ్య. వాళ్ళిద్దరు ఓవరాక్షన్ భరించ కంటే ఇక్కడ ఉండడమే బెటర్ అనుకుంటాడు రాజ్.
మరోవైపు దుగ్గిరాల ఫ్యామిలీ అంతా డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని అపర్ణ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. అంతలోనే అక్కడికి వచ్చిన అపర్ణ వడ్డించమంటారా అని అడుగుతుంది. వడ్డించటానికి నిన్ను రమ్మనలేదు మాతో కలిసి కూర్చొని భోజనం చేయడానికి పిలిచాము అంటాడు సుభాష్. ఇంట్లోంచి వెళ్ళొద్దన్నారు అది మీ హక్కు కానీ నాకు కూడా వ్యక్తిగత స్వేచ్ఛ ఉంది కదా నా కడుపు మంట నన్ను భోజనం చేయటం లేదు అంటూ కోపంగా చెప్తుంది అపర్ణ. నీ కోపాన్ని నీ భర్త మీద, కొడుకు మీద చూపించు భోజనం మీద చూపించి అన్నాన్ని అవమానించొద్దు అంటాడు సీతారామయ్య.
భోజనం ముందు కూర్చొని కూరలు వడ్డించుకోకుండా ఆవకాయతో భోజనం చేస్తూ కన్నీరు పెట్టుకుంటుంది అపర్ణ. నీ ఆత్మ గౌరవం దెబ్బతింది మేము అర్థం చేసుకోగలం అలాగే నువ్వు కూడా నీ కొడుకుని అర్థం చేసుకో అంటాడు సీతారామయ్య. మరోవైపు ఇంట్లో డబ్బులు లేకపోతే అప్పుకి బయలుదేరుతుంది అప్పు. అదే విషయాన్ని తండ్రితో చెప్తుంటే కావ్య వింటుంది.ఏం మాట్లాడుతున్నావ్ అని చెల్లెల్ని అడిగితే మాట దాటేస్తుంది అప్పు. గట్టిగా నిలదీయడంతో డబ్బులు చాలటం లేదంటూ నిజం చెప్తుంది. ఇవన్నీ అక్కకు చెప్పడం అవసరమా అంటూ కూతుర్ని మందలించి అక్కడి నుంచి పంపించేస్తాడు కృష్ణమూర్తి.
అప్పు చదువు పూర్తయితే మీకు కూడా మంచి రోజులు వస్తాయి నాన్న అంటుంది కావ్య. నీకు తెలియకుండానే నీ కుటుంబం అనేసావు చూసావా ఆడబిడ్డ ఎప్పటికైనా ఆడబిడ్డే. నీ అత్తగారింట్లో నువ్వు సంతోషంగానే ఉన్నావా అని అడుగుతాడు కృష్ణమూర్తి. చాలా సంతోషంగా ఉన్నాము అందుకే నేను అడగ్గానే ఇక్కడికి తీసుకువచ్చారు అంటుంది కావ్య.అయోధ్య నుంచి పర్ణశాల చూడటానికి వచ్చారా లేకపోతే ఇక్కడ వదిలేయటానికి వచ్చారా గుండె గుప్పిట్లో పెట్టుకుని ఈ పేద తండ్రి అడగలేక అడుగుతున్నాడు అంటూ కన్నీరు పెట్టుకుంటాడు కృష్ణమూర్తి.
భోజనం చేస్తున్న స్వప్న ని మోసపోయావా అని అడుగుతుంది ఆమె ఫ్రెండ్. స్వప్న నోట్లో ముద్దు పెట్టుకుని సమయానికి ఆ ఫ్రెండ్ తల్లి వచ్చి నీకు బుద్ధి ఉందా అంటూ కూతుర్ని మందలిస్తుంది. మీ ఫ్రెండ్ మీద నీకు ఉన్న ప్రేమ ఈ కాలనీ వాళ్ళకి మనమీద ఉండదు ఇప్పుడు నేను నోరు మూసుకుంటే ఆ కనకానికి పట్టిన గతే నాకు పడుతుంది. కన్న వల్లే వదిలేసారు అలాంటి దరిద్రం మనకెందుకు అంటుంది మా ఫ్రెండ్ తల్లి. ఆ అవమానాన్ని భరించలేక భోజనం చేయకుండానే అక్కడ నుంచి వెళ్ళిపోతుంది స్వప్న. మరోవైపు కనకం బట్టలు తీసుకొని వచ్చి ఇస్తుంది. నాకు ఏమీ వద్దండి అంటాడు రాజ్.
అంతలోనే కావ్య రావడంతో అల్లుడు మొహమాటపడుతున్నాడు నువ్వే ఈ బట్టలు వేయించి బయటికి తీసుకురా అని బయటికి వెళ్ళిపోతారు కనకం, మీనాక్షి. బట్టలు తీసుకోండి అంటూ రిక్వెస్ట్ చేస్తుంది కావ్య. ఆ బట్టల్ని విసిరేస్తాడు రాజ్. అది చూసిన అప్పు నువ్వు ఈ బట్టలు ఎలా కట్టుకోవో నేను చూస్తానుఅనుకుంటుంది. బయటికి వచ్చిన స్వప్న ఈ అవమానానికి కారణం రాహుల్ అనుకుంటూ అతనికి ఫోన్ చేస్తుంది. ఇప్పుడు దీన్ని కెలికితే ఫుడ్డు, హోటల్ అంటూ బోల్డు ఖర్చు పెట్టాలి అనుకుంటాడు రాహుల్. తరువాయి భాగంలో రాజ్ కి భోజనం పెట్టి ఉక్కిరి బిక్కిరి చేసేస్తూ ఉంటారు కనకం, మీనాక్షి.