జబర్దస్త్ యాంకర్ సిరి ఊహించని ట్విస్ట్.. ఐయామ్ ఇన్ లవ్ విత్ యు అంటూ ఆ కమెడియన్ కి ప్రపోజ్
గతంలో సుధీర్, రష్మీ బుల్లితెరపై ఎలా అలరించారో తెలిసిందే. వీళ్లిద్దరి ప్రవర్తన చూసి ఈ జంట నిజంగానే రిలేషన్ లో ఉన్నారని ఆడియన్స్ అనుకున్నారు.సిరి కూడా అదే తరహా రూమర్స్ పెరిగేలా హంగామా షురూ చేసింది.
బిగ్ బాస్ సీజన్ 5లో గ్లామర్ బ్యూటీ, యూట్యూబ్ స్టార్ సిరి హనుమంత్ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఆ సీజన్ లో సన్నీ విజేతగా నిలిచాడు. ఆమె స్నేహితుడు షణ్ముఖ్ రన్నరప్ గా నిలిచాడు. సిరి టాప్ 5 కి చేరుకుంది.
బిగ్ బాస్ 5తో సిరి క్రేజ్ మరింతగా పెరిగింది. ప్రస్తుతం సిరి పలు షోలలో యాంకర్ గా అవకాశాలు అందుకుంటోంది. అలాగే నటిగా కూడా రాణిస్తోంది. ఇటీవల ముగిసిన బిగ్ బాస్ సీజన్ 6లో సిరి ప్రియుడు శ్రీహాన్ రన్నరప్ సాధించిన సంగతి తెలిసిందే. చాలా కాలంగా సిరి, శ్రీహాన్ ప్రేమలో ఉన్నారు. అయితే ఆమె బిగ్ బాస్ సీజన్ 5లో షణ్ముఖ్ తో క్లోజ్ గా మూవ్ కావడంతో అనేక రూమర్లు వినిపించాయి. సిరి.. షణ్ముఖ్ తో క్లోజ్ గా ఉండడం వల్లే దీప్తి సునైనా అతడికి బ్రేకప్ చెప్పింది అనే ప్రచారం కూడా జరిగింది.
ఇదంతా పక్కన పెడితే సిరి ప్రస్తుతం కెరీర్ లో ఒక్కో మెట్టు ఎదుగుతోంది. ప్రస్తుతం యాంకర్ గా పలు షోలు చేస్తోంది. అదిరిపోయే తన గ్లామర్ లుక్ తో నెటిజన్లని ఆకర్షిస్తోంది. ఇప్పుడు అందరిని ఆకర్షిస్తున్న విషయం ఏంటంటే సిరి హనుమంత్ జబర్దస్త్ యాంకర్ గా మారిపోయింది.
జబర్దస్త్ లో వరుసగా యాంకర్స్ మారుతూనే ఉన్నారు. గతంలో అనసూయ యాంకరింగ్ చేస్తుండగా ఆమె స్థానంలో సౌమ్య రావు వచ్చింది. ఆమె కూడా జబర్దస్త్ నుంచి తొలగింది. అంతే సౌమ్యరావు జబర్దస్త్ నుంచి ఎందుకుతప్పుకుంది అనేది స్పష్టంగా తెలియదు. ఇప్పుడు ఆమె స్థానంలో సిరి హనుమంత్ వచ్చింది.జబర్దస్త్ యాంకర్ గా ఎవరు వచ్చినా కామెడియన్స్ తో కలసి పోయి కామెడీ పండించాలి.
చిన్నపాటి రొమాన్స్ కూడా చూస్తూనే ఉన్నాం. గతంలో సుధీర్, రష్మీ బుల్లితెరపై ఎలా అలరించారో తెలిసిందే. వీళ్లిద్దరి ప్రవర్తన చూసి ఈ జంట నిజంగానే రిలేషన్ లో ఉన్నారని ఆడియన్స్ అనుకున్నారు. ఇప్పటికి వీరి బంధం గురించి రూమర్స్ వస్తూనే ఉంటాయి.
ఇక సిరి కూడా అదే తరహా రూమర్స్ పెరిగేలా హంగామా షురూ చేసింది. జబర్దస్త్ లేటెస్ట్ ప్రోమో చూస్తే సిరి ఊహించని ట్విస్ట్ ఇచ్చిందనే చెప్పాలి. ఎప్పటిలాగే కామెడీ పంచ్ లతో జబర్దస్త్ ప్రోమో ఆకట్టుకునే విధంగా ఉంది. చివర్లో సిరి.. కమెడియన్ నూకరాజుకి ఏకంగా లవ్ ప్రపోజ్ చేసింది. 'ఐయామ్ ఇన్ లవ్ విత్ యు.. నేను చచ్చిపోతే నువ్వు ఏడుస్తావో లేదో కానీ నువ్వు చచ్చిపోతే నేను ఏడుస్తా' అని చెప్పింది. దీనితో నూకరాజుకి ఏం చెప్పాలో అర్థం కాలేదు.