షారుఖ్ పక్కన ఛాన్స్ తో పాటు.. సిరి హనుమంత్ కు జవాన్ సినిమా కోసం రెమ్యునరేషన్ ఎంతిచ్చారంటే..?
సిరి హనుమంత్.. సోషల్ మీడియా స్టార్.. బుల్లితెరకే పరిమితం అయ్యి.. వెండితెర ప్రయత్నాలు చేస్తున్న ఆమెకు.. ఏకంగా బంపర్ ఆఫర్ వచ్చింది. షారుఖ్ సరసన నటించే అవకాశం రావడం.. బాలీవుడ్ తెరపైమెరిసిన సిరి హనుమంత్ ఈసినిమాకు ఎంత తీసుకుందో తెలుసా..?
టిక్ టాక్ వీడియోలు.. షార్ట్ ఫిల్మ్స్ .. ఇన్ స్టా రీల్స్ తో సూపర్ రెస్పాన్స్ సాధించింది సిరీ హీనుమంత్. సోషల్ మీడియాలో ఆమెకు ఉన్న క్రేజ్ బిగ్ బాస్ హౌస్ లో స్థానం సంపాదించేలా చేసింది. హౌస్ లో తన మార్క్ చూపించి సిరి టాప్ 5 లో నిలిచింది.
బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తరువాత సిరి క్రేజ్ కాస్త పెరిగింది. అవకాశాలు కూడా బాగానే వస్తున్నాయి. సోషల్ మీడియాలో అయితే ఇక చెప్పనక్కర్లేదు. ఇన్ స్టాలో ఆమె అందాల విందుకు ఫ్యాన్స్ ఫిదా అవుతూ వస్తున్నారు. ఇక తాజాగా ఆమె బాలీవుడ్ మూవీలో కనిపించి షాక్ ఇచ్చింది. అదికూడా షారుఖ్ సినిమాలో.
ఆడియన్స్ నుంచి, క్రిటిక్స్ నుంచి స్టన్నింగ్ రెస్పాన్స్ వస్తోంది. నయనతార హీరోయిన్ గా నటించగా.. దీపికా పదుకొనె కీలక పాత్రలో మెరిసింది. పక్కా మాస్ మసాలా ఎంటర్టైన్మెంట్ తో జవాన్ చిత్రం సూపర్ పాజిటివ్ రెస్పాన్స్ దక్కించుకుంది. ఈ చిత్రంలో టాలీవుడ్ నుంచి ఎవరూ లేరే అనే లోటుని ఈ క్రేజీ బ్యూటీ తీర్చేసింది. అయితే సిరి పాత్రకు ఎలాంటి డైలాగులు లేవు. కానీ షారుఖ్ పక్కనే నటించడం మామూలు విషయం కాదు.
పోలీస్ ఆఫీసర్ పాత్రలో షారుఖ్ నటించగా ఆయనకి సబ్ ఆర్డినేట్ పాత్రలో సిరి మెరిసింది. దీనితో జవాన్ చిత్రంలో సిరిని చూస్తున్న ఫ్యాన్స్ అంతా సర్ప్రైజ్ కి గురవుతున్నారు. ఆమె దృశ్యాలని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. షారుఖ్ ఖాన్ ని దగ్గర నుండే చూసే అదృష్టం కలిగితే చాలు అనుకునే సిరి కి ఏకంగా జవాన్ చిత్రం లో నటించే ఛాన్స్ దక్కడం మామూలు విషయం కాదు.
అయితే ఈ సినిమాలో ఆమె నటించినందుకు గాను షారుఖ్ ఖాన్ ఆమెకి 20 లక్షల రూపాయిల చెక్ ని ఇచ్చాడట. ఆమె పోషించిన ఆ చిన్న పాత్రకి ఇంత మొత్తం డబ్బులు రావడం గొప్పే అని అంటున్నారు నెటిజెన్స్. షారుఖ్ తో నటిచడమే చాలా పెద్ద విషయం.. అది కూడా 20 లక్షలు రెమ్యూనరేషన్ తీసుకున్నదని న్యూస్ వైరల్ అవుతుండటంతో.. ఫ్యాన్స్ దిల్ ఖుష్ అవుతున్నారు.