- Home
- Entertainment
- చూపంతా ప్రైవేట్ పార్ట్స్ పైనే, నా ప్లేస్ ఒకటుంది అక్కడకి రా అని అసభ్యంగా.. వైరముత్తుపై మరో సింగర్ ఘాటుగా..
చూపంతా ప్రైవేట్ పార్ట్స్ పైనే, నా ప్లేస్ ఒకటుంది అక్కడకి రా అని అసభ్యంగా.. వైరముత్తుపై మరో సింగర్ ఘాటుగా..
వైరముత్తుపై చిన్మయి అలుపెరగని పోరాటం చేస్తూనే ఉంది. అయితే ఈ పోరాటంలో చిన్మయికి ఎలాంటి సపోర్ట్ లభించడం లేదు. అయితే ఎట్టకేలకు చిన్మయికి సపోర్ట్ లభించింది. వైరముత్తు బండారం బట్టబయలు చేస్తూ మరో లేడీ సింగర్ గళం విప్పింది.

గాయనిగా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా సింగర్ చిన్మయి సౌత్ లో గుర్తింపు సొంతం చేసుకుంది. అలాగే మహిళలపై జరిగే వేధింపుల విషయంలో చిన్మయి ఫైర్ బ్రాండ్ గా మారిపోయింది. మీటూ ఉద్యమంలో భాగంగా చిన్మయి తరచుగా తన గళం వినిపిస్తూ ఉంటుంది. మహిళలని అవమానించేలా చిన్న సంఘటన జరిగినా చిన్మయి ఊరుకోవడం లేదు.
మీటూ ఉద్యమం చెలరేగినప్పుడు చిన్మయి తమిళ లిరిసిస్ట్ వైరముత్తుపై తీవ్రమైన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. వైరాముత్తు తనని లైంగికంగా వేధించినట్లు చిన్మయి సంచలన ఆరోపణలు చేసింది. అప్పటి నుంచి ఈ వివాదం రగులుతూనే ఉంది. వైరముత్తుపై చిన్మయి అలుపెరగని పోరాటం చేస్తూనే ఉంది.
అయితే ఈ పోరాటంలో చిన్మయికి ఎలాంటి సపోర్ట్ లభించడం లేదు. ఆరోపణలు ఎదుర్కొంటున్న వైరముత్తు మాత్రం తమిళనాట బిగ్ స్టార్స్ నుంచి రాజకీయ నేతలు.. ముఖ్యమంత్రి వరకు అందరి నుంచి గౌరవ మర్యాదలు సత్కారాలు అందుకుంటున్నాడు. చిన్మయి సోషల్ మీడియాలో అతడి గురించి ఎంతలా గళం విప్పినా ఎవరూ పట్టించుకోవడం లేదు. పైగా చిన్మయే బహిష్కరణలు ఎదుర్కొంది.
అయితే ఎట్టకేలకు చిన్మయికి సపోర్ట్ లభించింది. వైరముత్తు బండారం బట్టబయలు చేస్తూ మరో లేడీ సింగర్ గళం విప్పింది. వైరముత్తు విషయంలో చిన్మయి చేస్తున్న ఆరోపణలు నిజమే అంటూ సింగర్ వినైతా సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇటీవల వినైతా ఓ ఇంటర్వ్యూలో చెప్పిన విషయాలని చిన్మయి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
ఈ వీడియోలో వినైతా మాట్లాడుతూ.. వైరముత్తు విషయంలో నేను చిన్మయికి సపోర్ట్ చేస్తున్నా. ఎందుకంటే చిన్మయి నిజమే చెబుతోంది. వైరముత్తు నుంచి నాకు కూడా అలాంటి అనుభవమే ఎదురైంది. వైరముత్తు మంచి వ్యక్తి కాదు. అతడిని కలిసాక నాకు తెలిసింది. ఆయన ముఖం చూసి మాట్లాడరు.. ఆయన దృష్టి మొత్తం అమ్మాయిల ప్రైవేట్ పార్ట్స్ పైనే. చాలా చీప్ గా బిహేవ్ చేస్తాడు.
నా ప్లేస్ ఒకటుంది.. అక్కడికి రా ప్రైవేట్ గా మాట్లాడుకోవచ్చు అని అసభ్యంగా పిలిచాడు. ఇదే విధంగా వైరముత్తు వల్ల చాలా మంది ఫీమేల్ సింగర్స్ ఇబ్బంది పడ్డారని నాకు తెలుసు. వాళ్ళు కూడా బయటకి వచ్చి మాట్లాడాలి అని వినైతా పేర్కొంది. వినీత కామెంట్స్ పై చిన్మయి స్పందిస్తూ నాతో పాటు మొత్తం నాలుగు సింగర్స్ ఇప్పటి వరకు వైరముత్తు లైంగిక వేధింపులు చేశారని ఆరోపిస్తున్నారు. ఇతని వల్ల ఇబ్బంది పడిన చాలా మంది మాతో కలసి గళం విప్పాలి. ఈ తమిళ రాజకీయ నాయకులకి వైరముత్తు గురించి ఇంకా ఏం ప్రూవ్ చేయాలో అర్థం కావడం లేదు. అంటూ చిన్మయి ట్వీట్ చేసింది.
రీసెంట్ గా వైరముత్తుని ముఖ్యమంత్రి తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ సత్కరించారు. లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తితో ఇలా అంటకాగడం ఏంటి అంటూ చిన్మయి ముఖ్యమంత్రిపై కూడా విమర్శలు చేసింది.