MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • సింగర్ సునీతకి ఫస్ట్ క్రష్ ఎవరో తెలుసా, ఆ హీరో షాకింగ్ బ్యాగ్రౌండ్ బయటపెట్టిన కమెడియన్ అలీ

సింగర్ సునీతకి ఫస్ట్ క్రష్ ఎవరో తెలుసా, ఆ హీరో షాకింగ్ బ్యాగ్రౌండ్ బయటపెట్టిన కమెడియన్ అలీ

సునీత కేవలం గాయని మాత్రమే కాదు, యాంకర్ గా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కూడా పాపులర్ అయ్యారు. సౌందర్య, రాశి, త్రిష, కత్రినా కైఫ్, స్నేహ, కమలినీ ముఖర్జీ లాంటి క్రేజీ హీరోయిన్లందరికీ సునీత డబ్బింగ్ చెప్పారు. 

2 Min read
Author : Tirumala Dornala
Published : Apr 23 2025, 04:26 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Sunitha

Sunitha

పాడుతా తీయగా షోలో ప్రవస్తి వివాదం కారణంగా సింగర్ సునీత గత కొన్ని రోజులుగా వార్తల్లో ఉంటున్నారు. తనపై సింగర్ సునీత వివక్ష చూపారని, బాడీ షేమింగ్ కి గురిచేశారంటూ ప్రవస్తి అనేక సంచలన ఆరోపణలు చేశారు. ప్రవస్తి ఆరోపణలపై సింగర్ సునీత కౌంటర్ కూడా ఇచ్చారు. ఇదిలా ఉండగా సింగర్ సునీత గురించి అనేక విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

25

సునీత కేవలం గాయని మాత్రమే కాదు, యాంకర్ గా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కూడా పాపులర్ అయ్యారు. సౌందర్య, రాశి, త్రిష, కత్రినా కైఫ్, స్నేహ, కమలినీ ముఖర్జీ లాంటి క్రేజీ హీరోయిన్లందరికీ సునీత డబ్బింగ్ చెప్పారు. సునీత టాలీవుడ్ లోకి గులాబీ చిత్రంతో సింగర్ గా అడుగుపెట్టారు. ఆ చిత్రంలో సునీత పాడిన 'ఈ వేళలో నీవు' అనే సాంగ్ సూపర్ హిట్ అయింది. దీనితో ఒక్కసారిగా సునీత క్రేజీ సింగర్ గా మారిపోయారు. 

35

ఆ తర్వాత తమ్ముడు, బద్రి, యువరాజు, మురారి లాంటి చిత్రాల్లో ఆమె పాడిన పాటలు సూపర్ డూపర్ హిట్స్ అయ్యాయి. దీనితో సునీత స్టార్ సింగర్ గా మారిపోయారు. గోదావరి, అతడే ఓకే సైన్యం చిత్రాలకు ఆమె ఉత్తమ గాయనిగా నంది అవార్డు సొంతం చేసుకున్నారు. కమెడియన్ అలీతో పాల్గొన్న అలీతో సరదాగా అనే షోలో సునీత తన గురించి అనేక విషయాలు బయట పెట్టారు. 

45

మీకు ఫస్ట్ క్రష్ ఎవరు అని అలీ ప్రశ్నించగా.. సునీత సమాధానం ఇచ్చారు. ఎవరైనా టాలీవుడ్ లో హీరో పేరుచెబుతారు అనుకుంటే సునీత ఊహించని షాక్ ఇచ్చారు. తనకి బాలీవుడ్ సీనియర్ నటుడు జాకీ ష్రాఫ్ పై అప్పట్లో క్రష్ ఉండేది అని సునీత తెలిపారు. ఆయనతో ఏజ్ గ్యాప్ ఉంది అని నాకు తెలుసు. కానీ చూడగానే ఎందుకో నాకు నచ్చేశారు అని సునీత తెలిపింది. 

55

వెంటనే అలీ మాట్లాడుతూ.. జాకీ ష్రాఫ్ గారితో తాను నటించాను అని అన్నారు. ఆయన తనని పక్కన కూర్చోబెట్టుకుని తన బ్యాగ్రౌండ్ గురించి చెప్పారట. సినిమాల్లోకి రాకముందు జాకీ ష్రాఫ్ డబ్బు కోసం వీధి రౌడీగా పనిచేసినట్లు తెలిపారట. కానీ సినిమాల్లోకి వచ్చాక జాకీ ష్రాఫ్ లైఫ్ టర్న్ అయింది అని అలీ తెలిపారు. సునీత రియాక్ట్ అవుతూ.. అయితే ఏంటి ఆయన నా మనసు దోచుకున్నారు కదా అని సరదాగా అన్నారు. 

Also Read: మోసగత్తెవి అని నన్ను తిట్టావు, అంత నీఛమైన క్యారెక్టర్ నాది కాదు.. ప్రవస్తికి సునీత ఎమోషనల్ కౌంటర్

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా

Latest Videos
Recommended Stories
Recommended image1
Chiru-Charan: టాలీవుడ్‌లో అరుదైన రికార్డులు సెట్‌ చేసిన చిరంజీవి, రామ్‌ చరణ్‌.. పవన్‌, అల్లు అర్జున్‌ కూడా తర్వాతే
Recommended image2
Ustaad Bhagat Singh Business: పవన్‌ కళ్యాణ్‌ `ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌` కలెక్షన్ల టార్గెట్‌.. `ఓజీ` జోరు మిస్‌ అయ్యిందా?
Recommended image3
ఒక్క హీరో, ఆరుగురు హీరోయిన్లతో లవ్ ఎఫైర్.. ఎవరిని ఎక్కువగా ప్రేమించాడో తెలుసా ?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved