MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Silk Smitha: బాలకృష్ణను ఇడియట్, రాస్కెల్ అంటూ పిచ్చిపిచ్చిగా తిట్టిన సిల్క్ స్మిత, సెట్ లో అంతా షాక్, అసలేమయ్యిందంటే?

Silk Smitha: బాలకృష్ణను ఇడియట్, రాస్కెల్ అంటూ పిచ్చిపిచ్చిగా తిట్టిన సిల్క్ స్మిత, సెట్ లో అంతా షాక్, అసలేమయ్యిందంటే?

Silk Smitha: షూటింగ్ చాలా సీరియస్ గా జరుగుతుంది.. బాలకృష్ణ, సిల్క్ స్మితకు మధ్య సన్నివేశం. కానీ సడెన్ గా బాలయ్యను సిల్క్ తిట్టడం స్టార్ట్ చేసింది. చెడా మడా తిట్టేస్తోంది. సెట్ లో అంతా షాక్.. డైరెక్టర్ వెంటనే బ్రేక్ ఇచ్చి ఏం చేశాడంటే?  

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Jul 10 2026, 08:09 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
పాత జ్జాపకాలు పంచుకున్న బాలయ్య..
Image Credit : Asianet News

పాత జ్జాపకాలు పంచుకున్న బాలయ్య..

ఫిల్మ్ ఇండస్ట్రీ సముద్రం లాంటిది.. అదొక సెపరేట్ వరల్డ్.. ఎన్నో సినిమాలు, షూటింగ్ లో,మర్చిపోలేని సంఘటను.. తవ్వినా కొద్ది వస్తూనే ఉంటాయి. కొన్ని సంఘటనలు మాత్రం ఎప్పటికీ అలా గుర్తుండిపోతాయి. అలాంటి ఒక ఆసక్తికరమైన సంఘటనను నందమూరి బాలకృష్ణ ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నారు. 'ఆదిత్య 369' సినిమా షూటింగ్ సమయంలో నటి సిల్క్ స్మిత, బాలకృష్ణను ఇంగ్లీషులో ఘాటుగా తిట్టిన విషయాన్ని బాలయ్య బయటపెట్టారు. ఆ సమయంలో సెట్‌లో ఉన్నవారంతా షాక్‌కు గురైన సంఘటన గురించి ఆయన వివరించారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
తెలుగు సరిగ్గా రాక సిల్క్ స్మితకు ఇబ్బందులు..
Image Credit : Asianet News

తెలుగు సరిగ్గా రాక సిల్క్ స్మితకు ఇబ్బందులు..

బాలకృష్ణ వెల్లడించిన వివరాలు ప్రకారం.. ఆదిత్య 369 సినిమాలో సిల్క్ స్మిత కేవలం ఒక ఐటమ్ సాంగ్‌కే పరిమితం కాకుండా, సింహనందిని అనే ఒక పూర్తి స్థాయి పాత్రను పోషించారు. ఆ సినిమాలో ఆమెకు ఒక కీలకమైన సీన్ ఉంది. అందులో బాలకృష్ణ పోషించిన కృష్ణ కుమార్ పాత్రను ఉద్దేశించి ఆమె "ఈ నీచుడు, ఈ దుర్మార్గుడు, ఈ నికృష్టుడు" అంటూ తెలుగులో పెద్ద డైలాగ్ చెప్పాల్సి ఉంది. అయితే ఆ సమయంలో సిల్క్ స్మితకు తెలుగు అంతగా రాదు . పైగా ఆ డైలాగ్‌లో ఉన్నది తెలుగు మాత్రమే కాదు కాస్త గ్రాంథికం భాష కూడా కావడంతో ఆమెకు పలకడం చాలా కష్టంగా అనిపించింది

34
బాలయ్యను చెడామడా తిట్టేసిన సిల్క్..
Image Credit : Asianet News

బాలయ్యను చెడామడా తిట్టేసిన సిల్క్..

షూటింగ్ టేక్ ప్రారంభం కాగానే, సిల్క్ స్మిత ఆ తెలుగు డైలాగ్‌ను పూర్తిగా మర్చిపోయింది. భావోద్వేగంతో డైలాగ్ చెప్పాల్సిన ఆ సీన్ లో, ఆమె తెలుగుకు బదులుగా ఇంగ్లీషులోకి మారిపోయి.. బాలకృష్ణను చూపిస్తూ.. "దిస్ ఫూల్, దిస్ ఇడియట్, దిస్ బాస్టర్డ్, దిస్ రాస్కల్" (This fool, This idiot, This bastard, This rascal) అంటూ చాలా కోపంగా తిట్టేసింది. ఆవేశంతో అలా తిట్టేసి, ఆ తర్వాత డైరెక్టర్‌ వైపు తిరిగి "డైరెక్టర్ గారు.. ఓకేనా అండి?" అని చాలా సాదాసీదాగా అడిగింది.

44
వెంటనే డైరెక్టర్ ఏం చేశారంటే?
Image Credit : Asianet News

వెంటనే డైరెక్టర్ ఏం చేశారంటే?

సిల్క్ స్మిత నోటి వెంట బాలకృష్ణ లాంటి స్టార్ హీరోపై ఆ రేంజ్ ఇంగ్లీష్ తిట్లు వినేసరికి సెట్‌లో ఉన్నవారంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఏం మాట్లాడాలో తెలియక అందరూ కాసేపు నిశ్శబ్దంగా ఉండిపోయారు. అప్పుడు డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు గారు స్పందిస్తూ, నవ్వుతూ "ఓకే ఏంటమ్మా.. నువ్వు మాట్లాడిందంతా ఇంగ్లీషు, పైగా అన్ని తిట్లే తిట్టావు" అని చెప్పారు. ఆ తర్వాత సెట్‌లో అందరూ నవ్వుకున్నారు. ఈ విషయాన్ని బాలకృష్ణ గుర్తుచేసుకుంటూ ఆ సమయంలో ఆ సీన్ చాలా సరదాగా సాగిందని నవ్వేశారు .

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
నందమూరి బాలకృష్ణ
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
తెలుగు సినిమా
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Pawan-Singeetam Movie: జీసస్‌ కథతో పవన్‌ కళ్యాణ్‌ మూవీ.. సింగీతంతో చేయాల్సిన సినిమా ఎలా ఆగిపోయింది?
Recommended image2
Singeetham Top 10 Movies: సినిమా సైంటిస్ట్.. సింగీతం శ్రీనివాసరావు టాప్ 10 క్లాసిక్ మూవీస్, మయూరి నుంచి భైరవ ద్వీపం వరకు..
Recommended image3
Motivational Song: జీవితం అంటే కేవలం బతకడం కాదు.. జీవిత స‌త్యాన్ని చాటే సిరివెన్నెల పాట
Related Stories
Recommended image1
Krishna: ఎన్టీఆర్ మాటను ఎదిరించి, పోటీగా కృష్ణ తెరకెక్కించిన భారీ బడ్జెట్ సినిమా, కురుక్షేత్రం రివ్యూ...
Recommended image2
Facts: ఎడారిలో పాత్రలను ఎలా శుభ్రం చేస్తారో తెలుసా? నీళ్లు లేకుండానే అంట్లు ఎలా క్లీన్ అవుతాయి?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved