- Home
- Entertainment
- ఆ డైరెక్టర్ తో నేను రిలేషన్ లో ఉన్నా, దుప్పటి కూడా కప్పుతా.. డీజే టిల్లు హీరో కామెంట్స్, అనుపమతో గొడవ..
ఆ డైరెక్టర్ తో నేను రిలేషన్ లో ఉన్నా, దుప్పటి కూడా కప్పుతా.. డీజే టిల్లు హీరో కామెంట్స్, అనుపమతో గొడవ..
హీరో సిద్దు జొన్నలగడ్డ డీజే టిల్లు చిత్రంతో సరికొత్త క్రేజ్ సొంతం చేసుకున్నాడు. డీజే టిల్లు చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించింది. దీనితో సిద్దు ప్రస్తుతం ఆ చిత్రానికి సీక్వెల్ తెరకెక్కించే పనిలో ఉన్నారు.

హీరో సిద్దు జొన్నలగడ్డ డీజే టిల్లు చిత్రంతో సరికొత్త క్రేజ్ సొంతం చేసుకున్నాడు. డీజే టిల్లు చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించింది. దీనితో సిద్దు ప్రస్తుతం ఆ చిత్రానికి సీక్వెల్ తెరకెక్కించే పనిలో ఉన్నారు. ఆల్రెడీ టిల్లు స్క్వేర్ అని టైటిల్ కూడా అనౌన్స్ చేశారు.
అయితే సీక్వెల్ విషయంలో మొదటి నుంచి వివాదాలు, రూమర్స్ తెరపైకి వస్తూనే ఉన్నాయి. డీజే టిల్లు చిత్రం విమల్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కింది. అయితే ఇప్పుడు సీక్వెల్ కి అతడు డైరెక్టర్ కాదు. మాలిక్ రామ్ అనే దర్శకుడు సీక్వెల్ లోకి ఎంటర్ అయ్యారు. దీనితో సిద్ధుకి, విమల్ కృష్ణ కి విభేదాలు ఉన్నట్లు ప్రచారం జరిగింది.
మరోవైపు ఈ చిత్ర విషయంలో కూడా కొన్ని వచ్చాయి. చాలా మంది హీరోయిన్ల పేర్లు తెరపైకి వచ్చాక అనుపమని ఫైనల్ చేసారు. కానీ సిద్ధూతో గొడవ కారణంగా ఈ ప్రాజెక్టు నుంచి ఆమె తప్పుకున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ రూమర్స్ కి సిద్ధూ జొన్నలగడ్డ తాజా ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు.
విమల్ కృష్ణతో గొడవ గురించి ప్రస్తావించగా.. లైవ్ లోనే సిద్ధూ అతడికి కాల్ చేసి మాట్లాడారు. మా మధ్య ఎలాంటి వివాదాలు లేవని తెలిపారు. ఇక అనుపమ పరమేశ్వరన్ గురించి మాట్లాడుతూ మొదట ఈ చిత్రంలో ఫీమేల్ లీడ్ కోసం సంప్రదించింది ఆమెనే అని సిద్ధూ క్లారిటీ ఇచ్చారు.
అలాగే టిల్లు స్క్వేర్ డైరెక్టర్ మాలిక్ రామ్ గురించి సిద్దు ఫన్నీ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం నేను మాలిక్ రామ్ తో రిలేషన్ లో ఉన్నా. అతడు మా ఇంట్లోనే ఉంటాడు. తినేది పడుకునేది అంతా మా ఇంట్లోనే. అతడికి బెడ్ షీట్ కూడా నేనే కప్పుతా అంటూ సరదాగా వ్యాఖ్యానించారు. తన డైరెక్టర్స్ తో మంచి రాపో మైంటైన్ చేస్తాను అని సిద్దు తెలిపాడు. సక్సెస్ ఫెల్యూర్ తో సంబంధం ఉండదు.
కృష్ణ అండ్ హిస్ లీలా డైరెక్టర్ రవికాంత్ కి అయితే తాను ముద్దు కూడా పెట్టినట్లు సిద్దు ఫన్నీ కామెంట్స్ చేశాడు. డీజే టిల్లుతో యువతని నవ్వుల్లో ముంచెత్తిన సిద్దు టిల్లు స్క్వేర్ తో ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో చూడాలి.