సిద్ధార్థ్ - అదితి రావు హైదరి మధ్య ఇంత ఏజ్ గ్యాప్ ఉందా..?
మొత్తానికి ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నట్టుగా.. సిద్ధార్థ్ - అదితి రావు హైదరి వివాహ బంధంలో అడుగుపెట్టారు. ఎట్టకేలకు పెళ్లితో ఒక్కటయ్యారు. కాని చిత్రం ఏంటంటే.. వీరు రహస్యంగా పెళ్లి చేసుకోవడం ఆసక్తికరం అయితే.. వీరి మధ్య ఏజ్ గ్యాప్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
ఎట్టకేలకు పెళ్లితో ఒక్కటయ్యారు సిద్ధార్థ్ - అదితి రావు హైదరి. అయితే వీరు రహస్యంగా పెళ్లి చేసుకోవడం ఆసక్తికరంగా మారింది.తెలంగాణలోని వనపర్తి జిల్లా శ్రీరంగాపూర్‌లోని రంగనాథ స్వామి ఆలయ మండపంలో అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యులతో వీరి వివాహ వేడుక జరిగింది. హిందూ సంప్రదాయం ప్రకారం మూడుముళ్ల బంధంలోకి అడుగుపెట్టారు.
Image: Siddharth/Instagram
ఇక వీరిద్దరూ కూడా తమ పెళ్లి వార్తలపై ఏ మాత్రం స్పందించలేదు. తమిళనాడు కి చెందిన పురోహితులు వీరిద్దరి వివాహాన్ని హిందూ ఆలయాల ప్రకారం జరిపించినట్లుగా సమాచారం. ఇక వీరిద్దరికీ సంబంధించిన పెళ్లి ఫొటోస్ సైతం బయటికి రాలేదు.ప్రస్తుతం వీరి పెళ్లి వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో వీరిద్దరిపై ఆరా తీయడం మొదలుపెట్టారు.
అయితే ప్రస్తుతం వీరికి సబంధించిన ఓ న్యూస్ వైరల్ అవుతుంది. వీరిద్దరి వయసు ఎంత అనేది హాట్ టాపిక్ గా మారింది. అదితి కంటే సిద్ధార్థ్ దాదాపు 7 సంవత్సరాలు పెద్దవాడు. అదితి 1986న అక్టోబర్ 28న హైదరాబాద్‌లో జన్మించింది. ఇక సిద్ధార్థ్ 1979 ఫిబ్రవరి 17న చెన్నైలో జన్మించాడు. అలా వీరిద్దరికీ ఏడు సంవత్సరాలు ఏజ్ గ్యాప్ వచ్చింది. ఇక గతంలో వీరిద్దరికీ కూడా విడివిడిగా వివాహాలు అయ్యాయి. విడాకులు కూడా అయ్యాయి.
అవ్వడానికి తమిళ హీరో అయినా.. తెలుగు స్పస్టంగా మాట్లాడుతూ.. తెలుగు కుర్రాడే అనిపించుకున్నాడు సిద్దార్ధ్. టాలీవుడ్ ప్రేక్షకులకు బొమ్మరిల్లు సిద్దు గా తెలిసిన ఈ హీరో.. టాలీవుడ్ లో చాలా హిట్ సినిమాలు చేశాడు. అందుకే సిద్దు గురించి పెద్దగా ఇంట్రడక్షన్ అవసరం లేదు. . బొమ్మరిల్లు తో మొదలు పెట్టి.. నువ్వొస్తానంటే నేనొద్దంటానా, చుక్కల్లో చంద్రుడు, బావా లాంటి సినిమాలతో తెలుగులో సూపర్ పాపులారిటీ సంపాదించుకున్నాడు.
బొమ్మరిల్లు హీరోగా తెలుగు ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్రవేసుకున్న సిద్దార్థ్ టాలీవుడ్ పై చేసిన కొన్నివ్యాఖ్యల కారణంగా ఇక్కడ ఇమేజ్ ను డామేజ్ చేసుకున్నాడు. టాలీవుడ్ లో ఫామ్ నుకోల్పోయాడు. ఇక ఇఫ్పుడిప్పుడే తెలుగులో సినిమాలు మొదలు పెట్టాడుసిద్దు. కాని ఏం లాభం లేదు.. ఏ సినిమా చేసినా.. బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొడుతున్నాయి. ఈక్రమంలో సిద్దు రీ ఎంట్రీలో.. మహా సముద్రం లాంటి మూవీస్ తో ముందుకు వచ్చాడు.
ఈసినిమా డిజాస్టర్ అయినా.. సిద్దుకు టాలీవుడ్ లోకి రూట్ క్లియర్ చేసింది. ఈసినిమాలో శర్వానంద్ తో కలసి నటించాడు సిద్దార్ధ్. ఇక ఈసినిమాలో హీరోయిన్ గా నటించిన అదితీరావ్ హైదరి తో ప్రేమాయణం మొదలు పెట్టాడు హీరో. ఏం మాయ చేశాడో కాని.. ప్రస్తుతం ఈ హైదరాబాదీ ముద్దుగుమ్మ సిద్దార్థ్‌తో కలిసి చక్కర్లు కొడుతూ.. నెట్టింట టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలుస్తుంది. కాని ఈ విషయాన్ని మాత్రం ఇద్దరు బయట పెట్టలేదు. ..ఒప్పకోలేదు.
గత కొన్నాళ్లుగా వీళ్ళు ప్రేమలో ఉన్నారు, డేటింగ్ లో ఉన్నారు అని వార్తలు వస్తూనే ఉన్నాయి. ముంబై వీధుల్లో ఇద్దరూ చెట్టాపట్టాలేసుకొని తిరిగేస్తున్నారు, కలిసి డిన్నర్స్, లంచ్, పార్టీలకు వెళ్తూనే ఉన్నారు. సినిమా ఈవెంట్స్ కి కలిసే వెళ్తున్నారు. కలిసి రీల్స్ కూడా చేస్తున్నారు. ఇక అందరికి తెలిసిపోయిందిలే అనుకున్నారో ఏమో.. ఇంకాస్త అడ్వాన్స్ అయ్యారు స్టార్ కపుల్. ఈమధ్య ఇద్దరు కలిసి ఓపెన్ గానే తిరిగేస్తున్నారు.
కాని తమ మధ్య ఏమీ లేదు అన్నట్టే బిహేవ్ చేస్తున్నారు. అసలు విషయం ఒప్పుకోవడంలేదు. రీసెంట్ గా సిద్దార్థ చిన్నా సినిమా బాలీవుడ్ ప్రీమియర్ కి అదితి దగ్గరుండి అన్ని చూసుకుంది. పుట్టిన రోజులకు ఒకరికొకరు తమ సోషల్ మీడియాలో స్పెషల్ విషెష్ చెప్తున్నారు. ఇక ఇప్పుడు వారు పెళ్లి కూడా చేసేసుకున్నారు అని టాక్ గట్టిగా నడుస్తోంది. ఈక్రమంలోనే వీరి గురించి మర న్యూ్ వైరల్ అవుతోంది. అదేంటంటే..