- Home
- Entertainment
- ఆ హీరోతో నటించడం వల్ల 2 సినిమాలు ఫ్లాప్, అయినా నన్నే ఐరన్ లెగ్ అన్నారు.. బ్రేకప్ అయితే నంబర్ ఎంత అంటూ
ఆ హీరోతో నటించడం వల్ల 2 సినిమాలు ఫ్లాప్, అయినా నన్నే ఐరన్ లెగ్ అన్నారు.. బ్రేకప్ అయితే నంబర్ ఎంత అంటూ
స్టార్ హీరోయిన్ శృతి హాసన్ తరచుగా ఏదో ఒక విషయంలో వార్తల్లో ఉంటారు. తెలుగులో ఆమె చివరగా ప్రభాస్ సరసన సలార్ చిత్రంలో నటించింది. ప్రస్తుతం తమిళంలో కొన్ని చిత్రాల్లో నటిస్తోంది. తెలుగులో కొత్త చిత్రాలకు సైన్ చేయలేదు.

Shruti Haasan
స్టార్ హీరోయిన్ శృతి హాసన్ తరచుగా ఏదో ఒక విషయంలో వార్తల్లో ఉంటారు. తెలుగులో ఆమె చివరగా ప్రభాస్ సరసన సలార్ చిత్రంలో నటించింది. ప్రస్తుతం తమిళంలో కొన్ని చిత్రాల్లో నటిస్తోంది. తెలుగులో కొత్త చిత్రాలకు సైన్ చేయలేదు. శృతి హాసన్ ప్రేమ వ్యవహారాలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. గతంలో శృతి హాసన్ కొందరిని ప్రేమించింది. కానీ వారితో బ్రేకప్ చేసుకుంది.
Shruti Haasan
తన లవ్ ఫెయిల్యూర్ ని అడ్డు పెట్టుకుని కొందరు తనని నెగిటివ్ గా కామెంట్స్ చేస్తున్నారు అంటూ శృతి హాసన్ లేటెస్ట్ ఇంటర్వ్యూలో ఆవేదన వ్యక్తం చేసింది. ఈ క్రమంలో తన పర్సనల్ లైఫ్, కెరీర్ గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది. సినిమాలు ఫ్లాప్ అయితే ఐరన్ లెగ్ అంటున్నారు. లవ్ ఫెయిల్ అయితే ఎన్నో నంబర్ అంటూ అసభ్యంగా అడుగుతున్నారు.
Shruti Haasan
శృతి హాసన్ మాట్లాడుతూ.. జీవితంలో కొన్నిసార్లు ఇలా ఎందుకు చేశాను అని బాధపడిన సందర్భాలు ఉన్నాయి. చాలా మందికి లవ్ ఫెయిల్యూర్స్ ఉంటాయి. నాకు కూడా బ్రేకప్ స్టోరీలు ఉన్నాయి. నా బ్రేకప్ స్టోరీల గురించి కామెంట్స్ చేస్తుంటారు. కొత్త బాయ్ ఫ్రెండా.. ఇతడి నంబర్ ఎంత అని అడుగుతారు. నన్ను విమర్శించే వారికి నంబర్ మాత్రమే కనిపిస్తుంది. కానీ నేను కోరుకున్న ప్రేమని పొందలేకపోయాను అని అర్థం చేసుకోరు అంటూ శృతి హాసన్ ఆవేదన వ్యక్తం చేసింది.
Shruti Haasan
కెరీర్ విషయంలో కూడా అంతే. గబ్బర్ సింగ్ కి ముందు నేను నటించిన చిత్రాలు ఫ్లాప్ అయ్యాయి. హీరో సిద్దార్థ్ తో రెండు సినిమాల్లో నటించా. ఆ రెండు ఫ్లాప్ అయ్యాయి. సిద్ధార్థ్ ని ఎవ్వరూ ఒక్క మాట కూడా అనలేదు. అంతా నన్నే ఐరన్ లెగ్ అని అన్నారు. గబ్బర్ సింగ్ తర్వాత నాకు అద్భుతమైన ఛాన్సులు వచ్చాయి. నా కెరీర్ ని మార్చింది డైరెక్టర్ హరీష్ శంకర్ అని శృతి హాసన్ తెలిపింది.
Shruti Haasan
చివరగా శృతి హాసన్ శంతను అనే బాయ్ ఫ్రెండ్ నుంచి విడిపోయింది. వీళ్ళిద్దరూ చాలా కాలం డేటింగ్ లో ఉన్నారు. కానీ అతడితో శృతి హాసన్ పెళ్లి వరకు వెళ్ళలేదు. కమల్ హాసన్ కుమార్తెగా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన శృతి హాసన్.. గ్లామర్, నటనతో స్టార్ గా ఎదిగారు.