- Home
- Entertainment
- బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి రెచ్చిపోయిన శృతి హాసన్.. కిర్రాక్ మిర్రర్ సెల్ఫీతో కొంటె పోజులు.. వైరల్
బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి రెచ్చిపోయిన శృతి హాసన్.. కిర్రాక్ మిర్రర్ సెల్ఫీతో కొంటె పోజులు.. వైరల్
శృతి హాసన్ జోరుమీదుంది. ఓ వైపు భారీ ప్రాజెక్ట్ లతో, మరోవైపు ప్రేమలో మునిగితేలుతుంది. ప్రియుడితో కలిసి ఎంజాయ్ చేస్తుంది. లేటెస్ట్ గా ఆమె బాయ్ ఫ్రెండ్‌తో కలిసి దిగిన సెల్ఫీ పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

శృతి హాసన్ రెండేళ్లుగా డూడుల్ ఆర్టిస్ట్ శాంతను హజారికాతో ప్రేమలో మునిగితేలుతుంది. కరోనా లాక్ డౌన్ సమయంలో ఈ ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. లాక్ డౌన్ సమయంలోనే ప్రేమ ముదిరి పాకాన పడింది. ఇద్దరు చాలా రోజులుగా కలిసే ఉన్నారు. ఇప్పటికీ కలిసే ఉంటున్నట్టు సమాచారం.
తాజాగా బాయ్ ఫ్రెండ్ శాంతనుతో కలిసి దిగిన ఫోటోని పంచుకుంది శృతి హాసన్. తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో ఈ పిక్‌ని షేర్ చేసింది. మిర్రర్‌లో దిగిన సెల్ఫీ పిక్ సోషల్ మీడియా ద్వారా పంచుకోగా అది ఇప్పుడు వైరల్ అవుతుంది. ఓ వైపు నెటిజన్లని కట్టిపడేస్తూ, మరోవైపు ఫ్యాన్స్ ని ఆకట్టుకుంటుంది.
ఇందులో శృతి హాసన్ బ్లాక్ టీషర్ట్, బ్లాక్ ప్యాంట్ ధరించింది. శాంతను గ్రీన్ టీషర్ట్, బ్లాక్ ప్యాంట్ ధరించి ఉన్నారు. ముఖానికి మాస్క్ ని పెట్టుకున్నారు. ఇద్దరు మిర్రర్ ముందు నిల్చొని కొంటెగా పోజులిచ్చారు. దీన్ని శృతి తన ఫోన్ ద్వారా కాప్చర్ చేసి, ఇన్‌స్టా స్టోరీస్‌లో దీన్ని షేర్ చేసింది.
మరోవైపు ఇందులో శృతి హాసన్ చేసిన ఓ విచిత్రమైన వీడియోని సైతం షేర్ చేసింది. అది ఫ్యాన్స్ ని ఆకట్టుకుంటుంది. దాన్ని తెగ వైరల్ చేస్తున్నారు నెటిజన్లు. శృతి బేసిక్ బ్లాక్ టోన్డ్ కలర్ ఫోటోలను పంచుకుంటుంది. క్యాట్‌తో ఆమె పంచుకునే పిక్స్ నెటిజన్లకి డిఫరెంట్ ఫీలింగ్‌నిస్తుంటాయి. మరికొందరికి ఇరిటేషన్‌గానూ ఉంటాయి. ఏదేమైనా తన స్టయిల్‌ని మాత్రం వదిలేది లేదంటోది శృతి.
శృతి హాసన్ సినిమాలు, ఈవెంట్లతోనే కాదు సోషల్ మీడియాలో బాగా యాక్టివ్‌గా ఉంటుంది. ఆమె ఫోటోలను, వీడియోలను పంచుకుంటుంది. అభిమానులను ఎంగేజ్ చేస్తుంది. అదే సమయంలో వారితో ఛాట్ కూడా చేస్తుంది. ఎలాంటి ప్రశ్నలనైనా ఫేస్ చేస్తూ వారిని ఖుషీ చేస్తుంది. అభ్యంతరకరమైన ప్రశ్నలకు అంతే ఘాటుగా సమాధానం చెబుతుంది శృతి.
కెరీర్ పరంగా తండ్రికి తగ్గ తనయగా రాణిస్తుంది. ఆమె నటిగా బిజీగా ఉంటూనే తన మ్యూజిక్ కాన్సర్ట్ లపై ఫోకస్ చేస్తుంది. పాటలు పాడుతుంది, రైటింగ్ సైడ్ కూడా తనలోని ప్రతిభని చాటుకుంటుంది. మల్టీటాలెంటెడ్‌గా రాణిస్తూ ఆదర్శంగా నిలుస్తుంది.
ఇక ప్రస్తుతం సినిమాల పరంగా ఫుల్ బిజీగా ఉంది. తెలుగులో ఆమె చిరంజీవితో `మెగా154` చిత్రంలో నటిస్తుంది. బాబీ దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. మరోవైపు బాలకృష్ణతో `ఎన్బీకే 107`లో నటిస్తుంది. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రమిది. అలాగే పాన్ ఇండియా మూవీ `సలార్`లో ప్రభాస్‌కి జోడీగా చేస్తుంది శృతి.