Shruthi Hasan: ప్రియుడితో కలిసి అత్తారింటికి అస్సాం వెళ్ళిన శృతి హాసన్
కోలీవుడ్ భామ శృతి హాస్ ఏం చేసినా కొంచెం కొత్తగా ఆలోచిస్తుంది. ఈమధ్య కొత్త ప్రియుడితో చెట్టాపట్టాలు వేసుకుని తిరుగుతున్న తమిళ భామ, ప్రియుడితో కలిసి అత్తారింటికి వెళ్తుందట.

ఏవిషయానైన ఓపెన్ గా చెప్పడం.. తన లైఫ్ లో జరిగేవి ఓపెన్ గా చెప్పడం హీరోయిన్ శృతి హాసన్ కు అలవాటు. ఇక లవ్ లైఫ్ ను కూడా ఓపెన్ గానే ఉంచుతుంది స్టార్ హీరోయిన్ శృతి హాసన్. ఈమధ్య ఎక్కువగా ముంబైలోనే ఉంటోంది శ్రుతి. తన ప్రియుడితో కలిస టైమ్ ఎక్కువగా స్పెండ్ చేస్తోంది.
ముంబైలో ఉన్నా, చెన్నైలో ఉన్నా.. విదేశాలకు వెళ్లినా.. దాపరికం లేకుండా ప్రియుడితో కలిసున్న సరదా సందర్భాలన్నీ సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటుంది శ్రుతి హాసన్. స్పెషల్ ఈవెంట్స్ వేటినీ మిస్ అవదు. ప్రత మూమెంట్ ను సోషల్ మీడియాలో పంచుకుంటుంది బ్యూటీ.
తన కొత్త ప్రియుడు శంతను తో కలిసి ఉన్న రొమాంటిక్ మూమెంట్స్ తో పాటు.. వర్కౌట్ వీడియోస్, ఇంకా ఇప్పటి వరకూ ఎన్నో విషయాలు, తన పర్సనల్స్ ను నెట్టింట్లో అభిమానులతో పంచుకుంది శృతీ హాసన్. ఇక ఇప్పుడు మరోకొత్త విషయం బయటకు వచ్చింది.
ఓ వేడుకలో పాల్గొనేందుకు శృతీ హాసన్ అస్సాం వెళ్తున్నట్లు సమాచారం. ఇది ఆమె ప్రియుడు శంతను హజారికా సొంత రాష్ట్రం. అంటే శృతీ హాసన్ అత్తారింటికి వెళ్ళిందని టాక్. అక్కడ ప్రియుడితో కలిసి సందడి చేయడానికి రెడీ అవుతుందట.
అస్సాంలో రొంగాలీ బిహు అతి పెద్ద ఉత్సవం. ఏటా ఏప్రిల్ రెండో వారంలో ఈ ఉత్సవం ఘనంగా జరుపుతుంటారు. అక్కడి రాష్ట్ర పండుగైన రొంగాలీ బిహు వేడుకల్లో ఈ సారి శృతీ హాసన్ పాల్గొనబోతున్నది. వచ్చేవారం శంతను హజారికా సొంతూరు అస్సాంలోని గహువాటికి వెళ్లేందుకు రెడీ అవుతుంది.
ఇక శృతీ హాసన్ చిన్నా పెద్దా సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటుంది. ప్రస్తుతం ప్రభాస్ తో కలిసి సలార్ సినిమాలో నటిస్తున్నశృతి. బాలయ్య బాబుతో కలిసి మలీనేని గోపించంద్ మూవీలో కూడా నటిస్తోంది.
గతంలో ఫారెన్ ప్రియుడితో చెట్టా పట్టాలు వేసుకుని తిరిగిన శ్రుతి, సినిమాలు తగ్గించి లైవ్ ప్రోగ్రామ్స్ ఇస్తూ గడిపేసింది. ఫారెన్ ప్రియుడితో విడిపోయిన తరువాత మళ్లీ సినిమాల పై దృష్టి పెట్టింది శ్రుతి హాసన్.