- Home
- Entertainment
- 4 కోట్ల రెమ్యునరేషన్, 3 కోట్ల విలువైన కార్లు, 80 కోట్ల ఆస్తి, హ్యాపీగా ఫ్యామిలీ లైఫ్ గడుపుతోన్న హీరోయిన్ ?
4 కోట్ల రెమ్యునరేషన్, 3 కోట్ల విలువైన కార్లు, 80 కోట్ల ఆస్తి, హ్యాపీగా ఫ్యామిలీ లైఫ్ గడుపుతోన్న హీరోయిన్ ?
4 కోట్ల రెమ్యునరేషన్, 3 కోట్ల విలువైన కార్లు, 80 కోట్ల ఆస్తి, చాలామంది హీరోయిన్లు తమ రెమ్యునరేషన్ తో కెరీర్ ను అద్భుతంగా మలుచుకుంటారు. మరికొంత మంది రాంగ్ స్టెప్స్ వల్ల ఇబ్బందుల్లో పడతారు. కాని 40 ఏళ్లు దాటిని ఈ హీరోయిన్ మాత్రం

టాలీవుడ్ ను ఏలిన హీరోయిన్
ప్రముఖ నటి శ్రియా శరణ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి, తన ప్రత్యేకమైన నటనతో ప్రేక్షకులను మెప్పించిన ఈ నటి ఇప్పటికీ తన గ్లామర్‌తో అభిమానుల మనసులు దోచుకుంటోంది.1982లో జన్మించిన శ్రియా శరణ్, తన సినీ ప్రయాణాన్ని 2001లో 'ఇష్టం' అనే తెలుగు సినిమాతో ప్రారంభించింది. తరువాత సంతోషం, నేనున్నాను, శివాజీ: ది బాస్ వంటి హిట్ సినిమాల్లో నటించి స్టార్ హిరోయిన్‌గా ఎదిగింది శ్రీయా. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ భాషల్లోనూ సూపర్ హిట్ సినిమాల్లో శ్రియా నటించి మెప్పించింది.
నటి మాత్రమే కాదు
శ్రియా కేవలం మంచి నటి మాత్రమే కాదు. ఆమె శిక్షణ పొందిన కథక్ నృత్యకారిణి. ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రతిష్టాత్మక వేదికలపై నృత్య ప్రదర్శనలు ఇచ్చారు. ఈ బహుముఖ ప్రతిభావంతురాలు తన అందం, అభినయం, నాట్యంతో అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది. 2024 నాటికి, శ్రియా శరణ్ దక్షిణ భారత సినిమాలలో అత్యధిక పారితోషికం తీసుకునే నటిలలో ఒకరిగా నిలిచారు. ఓ సినిమాకు ఆమె తీసుకునే పారితోషికం .4 కోట్ల వరకు ఉంటుందని సమాచారం. అంతేకాక, ఆమె బ్రాండ్ ఎండార్స్‌మెంట్‌ల ద్వారా కూడా మంచి ఆదాయం పొందుతున్నారు.
కార్లంటే ఎంతో ఇష్టం
పెళ్లి తరువాత శ్రియా శరణ్ తన భర్త ఆండ్రీ కోస్చీవ్ (రష్యన్ టెన్నిస్ క్రీడాకారుడు ,వ్యాపారవేత్త), కుమార్తె రాధతో కలిసి ముంబైలో నివాసం ఉంటున్నారు. ఫ్యామిలీకి సబంధించిన ప్రతీ విశేషాన్ని ఆమె తన సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటుంది. శ్రియ శరణ్ కు కార్లంటే చాలా ఇష్టం. ఆమె గ్యారేజీలో విలాసవంతమైన కార్ల కలెక్షన్ ఉంది. వాటిలో ఆడి A6 – విలువ రూ. 65 లక్షలు, మెర్సిడెస్-బెంజ్ GLE – విలువ రూ. 1 కోటి, ఫోర్డ్ ఎకోస్పోర్ట్ – విలువ రూ. 12 లక్షలు, BMW 7 సిరీస్ – విలువ రూ. 1.7 కోట్లు, ఆస్తుల పరంగా, ప్రముఖ ఆర్థిక వెబ్‌సైట్ల ప్రకారం శ్రియ శరణ్‌కు రూ.80 కోట్లకు పైగా ఆస్తులు ఉన్నట్లు సమాచారం.
మిరాయ్ సినిమాతో
తాజాగా 'మిరాయ్' సినిమాలో శ్రియా శరణ్ ముఖ్యపాత్రలో నటించి మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. వయసు 43 వచ్చినా ఇప్పటికీ శ్రియకు క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. సోషల్ మీడియాలో ఆమె పోస్ట్ చేసే గ్లామర్ ఫోటోలు విపరీతంగా వైరల్ అవుతుంటాయి.

