- Home
- Entertainment
- నా ఆత్మగౌరవాన్ని దెబ్బ తీశాడు, పుష్ప 2 సెట్స్ లో కూడా గొడవ.. తొలిసారి జానీ మాస్టర్ పై శ్రష్టి వర్మ సంచలనం
నా ఆత్మగౌరవాన్ని దెబ్బ తీశాడు, పుష్ప 2 సెట్స్ లో కూడా గొడవ.. తొలిసారి జానీ మాస్టర్ పై శ్రష్టి వర్మ సంచలనం
లైంగిక వేధింపుల కేసులో కొన్ని నెలల క్రితం జానీ మాస్టర్ అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం జానీ మాస్టర్ బెయిల్ పై విడుదలయ్యారు. తన కలసి కొరియోగ్రాఫర్ గా వర్క్ చేసిన శ్రష్టి వర్మపై జానీ మాస్టర్ లైంగిక వేధింపులకు పాల్పడినట్లు పోక్సో కింద కేసు నమోదైంది.

Jani Master, Shrasti Verma
లైంగిక వేధింపుల కేసులో కొన్ని నెలల క్రితం జానీ మాస్టర్ అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం జానీ మాస్టర్ బెయిల్ పై విడుదలయ్యారు. తన కలసి కొరియోగ్రాఫర్ గా వర్క్ చేసిన శ్రష్టి వర్మపై జానీ మాస్టర్ లైంగిక వేధింపులకు పాల్పడినట్లు పోక్సో కింద కేసు నమోదైంది. ఇది టాలీవుడ్ లో పెద్ద సంచలన సంఘటన. ఈ వివాదంతో జానీ మాస్టర్ తన జాతీయ అవార్డు కూడా కోల్పోవలసి వచ్చింది.
బెయిల్ పై బయటకు వచ్చాక జానీ మాస్టర్, అతని భార్య తొలిసారి ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. తనవైపు నుంచి చెప్పుకోవాల్సినవి చెప్పుకున్నాడు. కన్నీళ్లు పెట్టుకుని ఎమోషనల్ అయ్యాడు. ఇంటర్వ్యూలో జానీ మాస్టర్ చెప్పిన విషయాలకి శ్రష్టి వర్మ కూడా కౌంటర్ ఇచ్చింది. తొలిసారి శ్రష్టి వర్మ మాట్లాడుతూ.. జానీ మాస్టర్ పై నేను కక్షతో కేసు పెట్టలేదు. అది నా ఆత్మగౌరవానికి సంబంధించినది. ఒక అమ్మాయిని శారీరకంగా మానసికంగా వాడుకుని.. ఆ తర్వాత మరో అమ్మాయితో ఉంటే సమర్ధించ దగిన విషయమా. నేను స్పందించకుండా సైలెంట్ గా ఉండాలా.. అది నా ఆత్మగౌరవానికి దెబ్బ కాదా అంటూ శ్రష్టి వర్మ సంచలన వ్యాఖ్యలు చేసింది.
నాకు ఆ టైం లో రెండు మార్గాలు మాత్రమే కనిపించాయి.. ఒకటి ధైర్యంగా ముందుకు వెళ్లడం లేదా ఈ జీవితాన్ని వదిలేయడం.. నేను మొదటిది ఎంచుకున్నా అని శ్రష్టి వర్మ తెలిపారు. పుష్ప 2 సెట్స్ లో జానీ మాస్టర్ తో జరిగిన గొడవ గురించి మాట్లాడడానికి ఆమె అంగీకరించలేదు. ఎందుకంటే కేసు కోర్టులో ఉంది కాబట్టి మాట్లాడకూడదు అని తెలిపింది. కానీ కొన్ని విషయాలు ప్రస్తావించింది.
పుష్ప 2 సెట్స్ లో జానీ మాస్టర్ నాతో గొడవ చేసి చేయి చేసుకున్నాడు. ఈ సంఘటనని కొంతమంది డ్యాన్సర్లు కూడా చూశారు. ఈ అంశం గురించి కోర్టులోనే మాట్లాడతా అని తెలిపారు. తన వెనుక పెద్ద హీరో ఉన్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని శ్రష్టి వర్మ ఖండించారు. అల్లు అర్జున్ శ్రష్టి వర్మ వెనుక ఉన్నట్లు రూమర్స్ వచ్చాయి. కానీ ఆమె తన వెనుక ఎవరూ లేరని ఒంటరి పోరాటం చేస్తున్నట్లు తెలిపింది.
జానీ మాస్టర్ జాతీయ అవార్డు కోల్పోవడం గురించి కూడా కొందరు నన్ను ప్రశ్నిస్తున్నారు. వ్యక్తిగత వివాదం వల్ల జాతీయ అవార్డు కోల్పోవడం ఏంటి అని అడుగుతున్నారు. అవార్డు అందుకే వ్యక్తికి ట్యాలెంట్ మాత్రమే ఉంటే సరిపోదు, క్యారెక్టర్ కూడా ఉండాలి అని కౌంటర్ ఇచ్చింది.