- Home
- Entertainment
- వెక్కి వెక్కి ఏడ్చా.. చైతన్య మాస్టర్ ఆత్మహత్యపై శ్రద్దా దాస్ తీవ్ర భావోద్వేగం, రీసెంట్ గానే హుషారుగా
వెక్కి వెక్కి ఏడ్చా.. చైతన్య మాస్టర్ ఆత్మహత్యపై శ్రద్దా దాస్ తీవ్ర భావోద్వేగం, రీసెంట్ గానే హుషారుగా
ప్రముఖ కొరియోగ్రాఫర్ చైతన్య మాస్టర్ బలవన్మరణంతో టాలీవుడ్ ఒక్కరిగా ఉలిక్కి పడింది. ఎంతో ప్రతిభావంతుడు, ఎంతో భవిష్యత్తు ఉన్న చైతన్య మాస్టర్ ఇలా ఆత్మహత్య చేసుకోవడం జీర్ణించుకోలేని అంశంగా మారింది.

ప్రముఖ కొరియోగ్రాఫర్ చైతన్య మాస్టర్ బలవన్మరణంతో టాలీవుడ్ ఒక్కరిగా ఉలిక్కి పడింది. ఎంతో ప్రతిభావంతుడు, ఎంతో భవిష్యత్తు ఉన్న చైతన్య మాస్టర్ ఇలా ఆత్మహత్య చేసుకోవడం జీర్ణించుకోలేని అంశంగా మారింది. ఆదివారం రోజు చైతన్య మాస్టర్ నెల్లూరులోని ఓ హోటల్ లో ఆత్మహత్య చేసుకున్నారు.
మరణించే ముందు సెల్ఫీ వీడియో కూడా రిలీజ్ చేశారు. ఈ వీడియో ద్వారా చైతన్య మాస్టర్ తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది. తీసుకున్న అప్పులు తిరిగి చెల్లించలేక పోతున్నాననే మానసిక ఒత్తిడిలో ఆయన ఆత్మహత్యకి పాల్పడ్డారు.
చైతన్య మాస్టర్ ఢీ లాంటి డ్యాన్స్ షోలతో మంచి గుర్తింపు పొందారు. కొన్ని రోజుల క్రితం ఏప్రిల్ 26న ప్రసారం అయిన ఢీ 15 షోలో తన డ్యాన్స్ తో అలరించి సందడి చేశారు. ఆయన డ్యాన్స్ పెర్ఫామెన్స్ చూసి శ్రద్దా దాస్ ప్రశంసలు కురిపించింది. చైతన్య మాస్టర్ ఇది మీ కోసం అంటూ పేపర్లు చించి గాల్లోకి విసిరింది.
చైతన్య మాస్టర్ మరణవార్త తెలియడంతో శ్రద్దాదాస్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఢీ షోలో చైతన్య మాస్టర్ తో కలసి డ్యాన్స్ చేసిన వీడియో పంచుకుంటూ ఎమోషనల్ అయ్యారు. పుట్టుక, మరణం మనిషికి అర్థంకాని అంశాలు. కానీ ఈ మధ్యలో మనం ఎలా జీవించాం అనే విషయమే అతడి గొప్పతనాన్ని నిర్ణయిస్తుంది.
నిజాయతీగా చెబుతున్నా.. చైతన్య మాస్టర్ ఎంతో గొప్ప హృదయంతో, విలువలతో జీవించారు. మీతో గడిపిన క్షణాలు గుర్తుకు వస్తున్నాయి. మీరు మీ జర్నీ పూర్తి చేశారు. మీరు కోరుకున్న విధంగా ఫైనల్ డెస్టినేషన్ ఐ చేరారు అని భావిస్తున్నా. మీ చిరునవ్వు ఇతరులని కూడా నవ్వించేది. కానీ ఈరోజు నేను వెక్కి వెక్కి ఏడ్చా. నీ చిరునవ్వుని గుర్తు పెట్టుకుంటా అంటూ శ్రద్దా దాస్ ఎమోషనల్ అయింది.
శేఖర్ మాస్టర్ కూడా చైతన్య మృతికి సంతాపం తెలిపారు. ఈ వార్త తెలిసినప్పటి నుంచి తాను చాలా డిస్ట్రబ్ గా ఉన్నట్లు తెలిపారు. నీ లాంటి టాలెంటెడ్ కొరియోగ్రాఫర్ ని కోల్పోయినందుకు చాలా బాధగా ఉంది. నిన్ను ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటాం అని శేఖర్ మాస్టర్ పోస్ట్ చేశారు.