- Home
- Entertainment
- Karthika Deepam: నీ మొగుడు కాదు.. కార్తీక్ నా ప్రియుడు నా ప్రాణం.. వంటలక్కకు షాకిచ్చిన మోనిత!
Karthika Deepam: నీ మొగుడు కాదు.. కార్తీక్ నా ప్రియుడు నా ప్రాణం.. వంటలక్కకు షాకిచ్చిన మోనిత!
Karthika Deepam: బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ మంచి రేటింగ్ తో దూసుకెళ్తుంది. ఒకటే కథతో నిత్యం ట్విస్ట్ ల మీద ట్విస్టులతో ప్రసారమవుతున్న ఈ సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఇక ఈరోజు నవంబర్ 12వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలో.. శౌర్య ఇంధ్రుడు చంద్రమ్మను అనుమానిస్తుంది. ఒకప్పుడులా లేరు నా ఫంక్షన్ తర్వాత మీరు చాలా మారిపోయారు అంటుంది. అలా ఎం లేదు జ్వాలమ్మ ఆటో నడపడం డాక్టర్ ఆరోగ్యానికి మంచిది కాదని చెప్పారు అంటూ చెప్పుకొస్తే ఏమో బాబాయ్ నాకు ఏం అర్థం కావడం లేదు అంటూ శౌర్య అక్కడ నుంచి వెళ్ళిపోతుంది.. మనం తప్పు చేస్తున్నాం ఏమో చంద్రమ్మ అని ఇంధ్రుడు అంటే మనం ఇంతకుముందు దొంగతనాలు చేసేవాళ్ళం కానీ ఇప్పుడు జ్వాలా వచ్చాక బాగా బతుకుతున్నాం.. జ్వాలను మన దగ్గరే పెట్టుకుందాం అని చంద్రమ్మ అంటుంది.
మరోవైపు వంటలక్క కార్తీకదీపం వెలిగిస్తూ ఉంటుంది. అప్పుడే మోనిత కార్తీక్ తో కార్తీకదీపం వెలిగించేందుకు వస్తుంది. కానీ మోనిత దగ్గర నుంచి గుడిలోకి వెళ్తాడు. నన్ను వదిలేసి వచ్చావ్ ఏంటి కార్తీక్ అని మౌనిత అడిగితే.. గుడి చూస్తున్నాను అని చెప్తాడు. ఇప్పుడు నాతో పాటు కూడా ఉంది చూడొచ్చు అని అంటే సరే సరే అంటాడు. చెప్పాను కదా కార్తీక్ దీపం మనిద్దరం కలిసి వెలిగించాలని భర్తతో పూజ చేస్తే మంచిది అని అంటే.. అలా అని రూల్ ఉందా అని కార్తీక్ అంటే అవును ఉంది అని మోనిత అంటుంది. మరి ఇక్కడ ఏంటి ఏ ఆడవాళ్లు వాళ్ళ భర్తలతో రాలేదంటూ మోనితను ప్రశ్నిస్తాడు. వాళ్లతో నాకు సంబంధం లేదు నువ్వు నాతోనే ఉండి దీపం వెలిగించాలి అంటే తన కర్చీఫ్ ఇచ్చి నా కర్చీఫ్ నీతో ఉందంటే నేను నీతో ఉన్నట్టే అని చెప్పి వెళ్ళిపోతాడు.
వంటలక్క ఒక్కటే కూర్చొని దీపాలు వెలిగిస్తూ తన కష్టాలు దేవుడికు చెప్తూ ఉంటుంది. నా బిడ్డను నా దగ్గరకు వచ్చేలా చెయ్యు నా భర్తను నా దగ్గరకు చేర్చు అని అడిగితే అప్పుడే వంటలక్క అంటూ డాక్టర్ బాబు వస్తాడు. ఇద్దరు కలిసి కార్తీకదీపం వెలిగిస్తారు అది చూసిన మోనిత కోపంతో రగిలిపోతుంది. నాతో గుడికి వస్తా అని చెప్పినప్పుడే డౌట్ వచ్చింది.. దీని కోసం వచ్చావా అని సీరియస్ అవుతూ ఆ దీపంతోనే దాన్ని కాల్చి చంపుతా అంటూ సీరియస్ అవుతుంది. అప్పుడే శివలత మోనితను తీసుకు వెళ్తుంది.. ఎందుకు తీసుకోచ్చావ్ నన్ను అంటూ సీరియస్ అవుతే ఇది గుడి మేడం మీరు ఏం చెయ్యకుండా ఉండేందుకు అంటుంది.
కార్తీక్ తో వంటలక్క కార్తీకదీపం వెలిగించకూడదు.. అది వెలిగిస్తే నాకు నా కార్తీక్ దూరం అవుతాడు అని ఫీల్ అవుతుంది.. వంటలక్క వెలిగించకూడదు.. అడ్డు కోవాలి అని నిర్ణయించుకుంటుంది. కానీ శివలత వల్ల ఏం చెయ్యలేకపోతుంది. మరోవైపు కార్తీక్ దీపం వెలిగిస్తే ఆ దీపాలు తీసుకోని ఒకవైపు వంటలక్క మరోవైపు మోనిత ఆమె వెలిగించిన దీపాలు పట్టుకొని వస్తుంది. ఇద్దరు ఎదురుపడినప్పుడు దీపం అరకపోవడం కాదు నీ దీపం ఆరిపోతుంది అని మోనిత సీరియస్ అవుతుంది. మోనితకు కూడా దీప నువ్వు మధ్యలో వచ్చావ్ మధ్యలోనే కొట్టుకుపోతావు అంటూ మోనితకు దీప షాకిస్తుంది.
నేను డాక్టర్ బాబు దూరం ఉన్నప్పుడే నువ్వు మమ్మల్ని విడదీయలేకపోయావ్ మధ్యలోకి రాలేకపోయావ్.. ఇప్పుడు మాత్రం ఏం చేస్తావ్.. డాక్టర్ బాబు ఇప్పుడు నాకు రక్షణగా ఉన్నాడు.. అలాంటి డాక్టర్ బాబుని నువ్వు దాటి రాలేవు అని దీపా మౌనితకు వార్నింగ్ ఇస్తుంది.. ఆ రక్షణ రేఖనే కూల్చేస్తాను.. నాకు నచ్చింది ఏదైనా సరే ఎలాగైనా సరే నేను దక్కించుకోవాలని అనుకుంటాను.. దానికోసం ఎంత పోరాటమైనా చేస్తాను అది దక్కలేదు ఇంకెవరికి అది దక్కనివ్వను అని మోనిత అంటుంది.. ఆ మాటలు విన్న వంటలక్క ఏం మాట్లాడుతున్నావ్ మోనిత అంటే జరగబోయేదే మాట్లాడుతున్నాను అని మోనిత అంటుంది.. అంతటితో ఎపిసోడ్ పూర్తయిపోతుంది.