- Home
- Entertainment
- ప్రశాంత్ నీల్ కి బర్త్ డే విషెస్ చెప్పని తారక్.. షాకింగ్ రూమర్స్, ఎన్టీఆర్ 31పై అనుమానాలు ?
ప్రశాంత్ నీల్ కి బర్త్ డే విషెస్ చెప్పని తారక్.. షాకింగ్ రూమర్స్, ఎన్టీఆర్ 31పై అనుమానాలు ?
కెజిఎఫ్ సిరీస్ తో ప్రశాంత్ నీల్ పాన్ ఇండియా డైరెక్టర్ గా మారిపోయాడు. తిరుగులేని ఎలివేషన్స్ తో ప్రశాంత్ నీల్ హీరోలని అద్భుతంగా చూపించే దర్శకుడిగా గుర్తింపు సొంతం చేసుకున్నాడు

కెజిఎఫ్ సిరీస్ తో ప్రశాంత్ నీల్ పాన్ ఇండియా డైరెక్టర్ గా మారిపోయాడు. తిరుగులేని ఎలివేషన్స్ తో ప్రశాంత్ నీల్ హీరోలని అద్భుతంగా చూపించే దర్శకుడిగా గుర్తింపు సొంతం చేసుకున్నాడు ఇటీవల విడుదలైన కెజిఎఫ్2 చిత్రం ఇండియా బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటిగా నిలిచింది. ఇంతటి కీర్తి సొంతం చేసుకున్న ప్రశాంత్ నీల్ శనివారం రోజు తన 42వ జన్మదిన వేడుకలు సెలెబ్రేట్ చేసుకున్నాడు.
Junior NTR
దీనితో ప్రశాంత్ నీల్ కి సోషల్ మీడియాలో అభిమానుల నుంచి జన్మదిన శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. సెలెబ్రిటీలు కూడా చాలా మంది ప్రశాంత్ నీల్ కి విషెస్ తెలిపారు . ప్రభాస్, హీరో యష్, కెజిఎఫ్ చిత్ర యూనిట్ కొంతమంది ప్రశాంత్ నీల్ బర్త్ డే సెలెబ్రేషన్స్ లో పాల్గొన్నారు.
Prabhas
ప్రస్తుతం ప్రశాంత్ నీల్.. ప్రభాస్ తో సలార్ అనే మూవీ తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం తర్వాత ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ తో మూవీ చేయాల్సి ఉంది. ఈ చిత్రానికి ప్రకటన కూడా వచ్చింది. అయతే ప్రశాంత్ నీల్ బర్త్ డే సందర్భంగా ఎన్టీఆర్ సోషల్ మీడియాలో ఎలాంటి విషెస్ తెలియజేయలేదు. పర్సనల్ గా కాంటాక్ట్ అయ్యాడా అనేది క్లారిటీ లేదు.
Prabhas
ప్రశాంత్ నీల్ తన తదుపరి సినిమా దర్శకుడు... పైగా పాన్ ఇండియా క్రేజ్ ఉన్న వ్యక్తి.. అయినప్పటికీ ఎన్టీఆర్ బర్త్ డే విషెస్ తెలియజేయలేదు. దీనితో ఊహించని పుకార్లన్నీ మొదలయ్యాయి. ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ మధ్య ఎం జరిగింది.. ఎన్టీఆర్ 31 ఉంటుందా అనే రూమర్స్ వినిపిస్తున్నాయి.
ప్రశాంత్ నీల్ ఇంకా ఎన్టీఆర్ 31 స్క్రిప్ట్ రెడీ చేయలేదని, బేసిక్ ఐడియా పైనే వర్క్ చేస్తున్నాడు అని అంటున్నారు. అయితే ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ బర్త్ డే కి స్పందించకపోవడం ఆసక్తిగా మారింది. కానీ ఎన్టీఆర్ అభిమానులు ఈ రూమర్స్ ని ఖండిస్తున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ ఇండియాలో లేరని అంటున్నారు,
కొరటాల శివ చిత్రం పూర్తి కాగానే ఎన్టీఆర్ 31న తప్పకుండా ఉంటుందని అంటున్నారు. ఎన్టీఆర్ కూడా ఆర్ఆర్ఆర్ చిత్రంతో పాన్ ఇండియా స్టార్ గ గుర్తింపు పొందారు. కొమరం భీంగా ఎన్టీఆర్ అందరి హృదయాలు దోచుకున్నాడు.