- Home
- Entertainment
- Anushka Shetty: అనుష్క గురించి షాకింగ్ రూమర్స్.. ఆందోళనలో అభిమానులు, అంత రిస్క్ ఎందుకు ?
Anushka Shetty: అనుష్క గురించి షాకింగ్ రూమర్స్.. ఆందోళనలో అభిమానులు, అంత రిస్క్ ఎందుకు ?
లేడీ సూపర్ స్టార్ గా ఫ్యాన్స్ ని అలరించిన అనుష్క శెట్టి ప్రస్తుతం సినిమాల విషయంలో ఆచి తూచి అడుగులు వేస్తోంది. బాహుబలి 2 తర్వాత అనుష్క కేవలం భాగమతి, నిశ్శబ్దం రెండు చిత్రాలు మాత్రమే చేసింది.

లేడీ సూపర్ స్టార్ గా ఫ్యాన్స్ ని అలరించిన అనుష్క శెట్టి ప్రస్తుతం సినిమాల విషయంలో ఆచి తూచి అడుగులు వేస్తోంది. బాహుబలి 2 తర్వాత అనుష్క కేవలం భాగమతి, నిశ్శబ్దం రెండు చిత్రాలు మాత్రమే చేసింది. అనుష్క బరువుకి సంబంధించిన సమస్యలు ఎదుర్కొంటోంది. దీనితో అనుష్క ఎక్కువ చిత్రాల్లో నటించేందుకు వీలు కావడం లేదు.
ప్రస్తుతం అనుష్క్ శెట్టి యువీ క్రియేషన్స్ బ్యానర్ లో నవీన్ పోలిశెట్టి సరసన ఓ చిత్రంలో నటిస్తోంది. అనుష్క ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 17 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా ఇటీవల యువి క్రియేషన్స్ సెలెబ్రేషన్స్ కూడా నిర్వహించారు. కానీ అనుష్క ఫొటోస్ మాత్రం బయటకి రాలేదు. దీనితో అనుష్క గురించి షాకింగ్ రూమర్ వైరల్ గా మారింది.
అనుష్క గతంలో అధిక బరువు పెరిగి 'సైజ్ జీరో' అనే చిత్రంలో నటించింది. ఆ చిత్రం తీవ్రంగా నిరాశపరిచింది. గ్లామర్ లుక్ లో అలరించే అనుష్క అలా బొద్దుగా ప్రయోగం చేయడంతో ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోయారు. పాత్ర కోసం ఎలాంటి సాహసం అయినా అనుష్క చేస్తుంది అనే ప్రశంసలు మాత్రం దక్కించుకుంది.
అలాగే యూవీక్రియేషన్స్, నవీన్ పోలిశెట్టి చిత్రంలో కూడా అనుష్క కథ డిమాండ్ చేయడంతో బరువు పెరిగి బొద్దుగా కనిపించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అందుకే అనుష్క లుక్ ని రివీల్ చేయడం లేదు అంటూ ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
దీనితో అభిమానుల్లో ఆందోళన పెరిగింది. ఎప్పటి నుంచి బరువు సమస్యతో స్వీటీ ఇబ్బంది పడుతోంది. బరువు తగ్గేందుకు ప్రయత్నిస్తోంది. ఇలాంటి టైంలో సినిమా కోసం ఇంత రిస్క్ చేయడం ఏంటి అని ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు. ఈ మేరకు జాతీయ ఆంగ్ల పత్రికల్లో కూడా వార్తలు వచ్చాయి. దీనిపై యువీ క్రియేషన్స్ కానీ, అనుష్క టీం కానీ ఇంకా క్లారిటీ ఇవ్వలేదు.
సైజు జీరో తరహాలో బరువు పెరగడం అంటే ఆరోగ్యంతో రిస్క్ చేయడమే అవుతుంది. పైగా అల అనుష్కని ఫ్యాన్స్ చూసేందుకు ఇష్టపడరు. ఎప్పటిలాగే అనుష్క అందంగా కనిపించాలని ఇలాంటి రిస్క్ తో కూడిన సినిమాలు వద్దని ఫ్యాన్స్ అంటున్నారు. మరి ఈ వార్తల్లో ఎంత వరకు వాస్తవం ఉందో చిత్ర యూనిట్ స్పందించాలి. పి మహేష్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.