- Home
- Entertainment
- స్నేహ రెడ్డిని వద్దనుకుని వెళ్లిపోయిన అల్లు అర్జున్..ప్రేమలో ఉన్నప్పుడు సంచలన సంఘటన, పెళ్లి జరిగేది కాదేమో
స్నేహ రెడ్డిని వద్దనుకుని వెళ్లిపోయిన అల్లు అర్జున్..ప్రేమలో ఉన్నప్పుడు సంచలన సంఘటన, పెళ్లి జరిగేది కాదేమో
ప్రస్తుతం బన్నీ, అల్లు స్నేహ దంపతులు పిల్లాపాలపతో అన్యోన్యంగా జీవిస్తున్నారు. అయితే వీళ్ల ప్రేమ వ్యవహారం చాలా డ్రమాటిక్ గా జరిగింది.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పాన్ ఇండియా హీరోగా దూసుకుపోతున్నాడు. ఈ ఏడాది బన్నీ పుష్ప 2 చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఆగష్టు లోనే పుష్ప 2 రావాల్సి ఉన్నా షూటింగ్ ఆలస్యం కారణంగా రిలీజ్ వాయిదా పడింది. అల్లు అర్జున్ రియల్ లైఫ్ లో ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.
ప్రస్తుతం బన్నీ, అల్లు స్నేహ దంపతులు పిల్లాపాలపతో అన్యోన్యంగా జీవిస్తున్నారు. అయితే వీళ్ల ప్రేమ వ్యవహారం చాలా డ్రమాటిక్ గా జరిగింది. స్నేహని బన్నీ పబ్ లో చూసి ప్రేమించాడట. కొంతకాలం ప్రేమించుకుని ఆ తర్వాత పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు.
అల్లు అర్జున్.. స్నేహ రెడ్డి తో ప్రేమలో ఉన్నప్పుడు ఒక సందర్భంలో సంచలన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందట. బద్రీనాథ్ చిత్ర మీడియా సమావేశంలో అల్లు అర్జున్ స్వయంగా ఈ విషయాన్ని చెప్పారు. బద్రీనాథ్ షూటింగ్ ముగిసిన తర్వాత అల్లు అర్జున్, స్నేహ వివాహం జరిగింది.
Sneha Reddy
అల్లు అర్జున్ మాట్లాడుతూ.. ఈ విషయం నేను యువత కోసం చెబుతున్నా. అది ఎలాంటి సిట్యువేషన్ అంటే.. సినిమాని వదులుకుని వెళ్లి స్నేహని కలవాలి. స్నేహ కావాలా లేక సినిమా కావాలా ? స్నేహ దగ్గరకి వెళితే సినిమాఉండదు .. సినిమా కోసం వెళితే స్నేహ లాంటి మంచి అమ్మాయిని మిస్ అవుతా.
ఆ టైంలో నేను సినిమా వైపే వెళ్లాను. నా వృత్తి కోసం నిజాయతీగా నిలబడ్డా. బద్రీనాథ్ షూటింగ్ కోసం మనాలి వెళ్లాం. తప్పలేదు. నేను నిజాయతీగా తీసుకున్న డెసిషన్ వల్ల నా సినిమా తో పాటు స్నేహ కూడా నాకు దక్కింది అని బన్నీ తెలిపాడు.
బహుశా స్నేహ పెళ్ళికి బలవంతం చేసి ఉంటే బన్నీ సినిమా పూర్తయ్యాక చేసుకుందాం అని చెప్పి ఉండొచ్చు. కానీ అల్లు అర్జున్ సినిమానే ముఖ్యం అని అనుకున్నాడు. బన్నీ నిజాయతీకి మెచ్చి స్నేహ అతడినే జీవిత భాగస్వామిగా ఎంచుకుంది. ఒక వేళ స్నేహ సీరియస్ గా తీసుకుని ఉంటే బన్నీ, స్నేహ పెళ్లి జరిగేది కాదేమో అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.