MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • పొట్టేలు రక్తం, మ్యాన్షన్ హౌస్ మద్యంతో వీరసింహారెడ్డి కటౌట్ కి అభిషేకం.. ఫ్యాన్స్ ఇలా కూడా ఉంటారా భయ్యా

పొట్టేలు రక్తం, మ్యాన్షన్ హౌస్ మద్యంతో వీరసింహారెడ్డి కటౌట్ కి అభిషేకం.. ఫ్యాన్స్ ఇలా కూడా ఉంటారా భయ్యా

నందమూరి బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డి చిత్ర సందడి మొదలైయింది. ఈ తెల్లవారు జాము నుంచి తెలుగు రాష్ట్రాల్లో ప్రీమియర్ షోలు మొదలయ్యాయి.  రెగ్యులర్ షోలు కూడా జరుగుతుండడంతో భారీ హంగామా నెలకొంది. 

1 Min read
Author : Sreeharsha Gopagani
Published : Jan 12 2023, 02:56 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

నందమూరి బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డి చిత్ర సందడి మొదలైయింది. ఈ తెల్లవారు జాము నుంచి తెలుగు రాష్ట్రాల్లో ప్రీమియర్ షోలు మొదలయ్యాయి.  రెగ్యులర్ షోలు కూడా జరుగుతుండడంతో భారీ హంగామా నెలకొంది. నెమ్మదిగా వీరసింహారెడ్డి చిత్రానికి టాక్, రివ్యూలు వస్తున్నాయి. 

26

ఫస్ట్ హాఫ్ లో బాలయ్య చెలరేగిపోయాడని.. సెకండాఫ్ కాస్త నెమ్మదించినట్లు ప్రేక్షకులు చెబుతున్నారు. ఓవరాల్ గా బాలయ్య అభిమానులకు మాత్రం ఈ చిత్రం ఫుల్ మీల్స్ అని అంటున్నారు. థియేటర్ల వద్ద బాలయ్య అభిమానుల హంగామా ఒక రేంజ్ లో ఉంది. 

36

నందమూరి ఫ్యాన్స్ అంటే ఇక చెప్పేది ఏముంది.. బాలయ్య కటౌట్స్ కి పాలాభిషేకాలు చేస్తూ, పూలమాలలు వేస్తూ డప్పులు, వాయిద్యాలతో రచ్చ చేస్తున్నారు. పాలాభిషేకాలలో కొత్తేముంది అనుకున్నారో ఏమో కానీ.. అనంతపురం జిల్లా తాడిపత్రిలో కొందరు అభిమానులు అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తారు. 

46

బాలయ్య కటౌట్ కి ఏకంగా మ్యాన్షన్ హౌస్ మద్యంతో అభిషేకం చేశారు. ఈ సంఘటన స్థానికులని ఆశ్చర్యంలో ముంచెత్తింది. సోషల్ మీడియాలో కూడా తెగ వైరల్ అవుతోంది. ప్రకాశం జిల్లాలో కొందరు అభిమానులు బాలయ్య కటౌట్ కి పొట్టేలు బలి ఇచ్చి ఆ రక్తంతో అభిషేకం చేశారు. 

56

స్టార్ హీరోల కటౌట్స్ కి పాలాభిషేకాలు చేయడం చూస్తూనే ఉన్నాం. అలాగే జంతు బలులు కూడా జరుగుతున్నాయి. కానీ ఏకంగా మద్యంతో అభిషేకం చేయడం మాత్రం  ఊహించలేని షాక్ భయ్యా అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. 

66

గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో శృతి హాసన్, హానీ రోజ్ హీరోయిన్లుగా నటించారు. దునియా విజయ్ విలన్ గా కనిపించగా.. వరలక్ష్మి శరత్ కుమార్ నెగిటివ్ రోల్ ప్లే చేసింది. ఫస్ట్ హాఫ్ అద్భుతంగా ఉన్నప్పటికీ, సెకండ్ హాఫ్  మిక్స్డ్ రెస్పాన్స్ వస్తుండడంతో వసూళ్లు ఎలా ఉంటాయో చూడాలి. 

About the Author

SG
Sreeharsha Gopagani
నందమూరి బాలకృష్ణ
Latest Videos
Recommended Stories
Recommended image1
ఇది కదా రాజమౌళి విజన్, వారణాసిలో 25 నిమిషాల ఎపిసోడ్..చరిత్రలో నిలిచిపోయేలా చిత్రీకరణ, ఆ సెట్లు చూశారా
Recommended image2
Monalisa Controversy: షూటింగ్‌లో దారుణం.. డైరెక్టర్ అసభ్యంగా తాకడంతో కన్నీళ్లు పెట్టుకున్న నటి మోనాలిసా
Recommended image3
చిరంజీవి సపోర్ట్ తో సోషల్ మీడియాలోకి పవన్ భార్య.. 1800 కోట్ల ఆస్తి వదిలేసి ఇండియాకి ఎందుకు వచ్చిందో తెలుసా ?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved