MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • First Salary: రజినీకాంత్ నుంచి సూర్య వరకు.. స్టార్ హీరోల మొదటి రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?

First Salary: రజినీకాంత్ నుంచి సూర్య వరకు.. స్టార్ హీరోల మొదటి రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?

First Salary: సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో టాప్ హీరోలు రజినీకాంత్, కమల్ హాసన్, విజయ్, అజిత్, సూర్య, ధనుష్.. ఇప్పుడు కోట్లలో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. కానీ వాళ్ల మొదటి సంపాదన ఎంతో తెలిస్తే మీరు కచ్చితంగా షాక్ అవుతారు.

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Oct 02 2026, 10:24 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
స్టార్ హీరోల రెమ్యునరేషన్ 100 కోట్లు దాటేసింది
Image Credit : AI Image

స్టార్ హీరోల రెమ్యునరేషన్ 100 కోట్లు దాటేసింది

సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇప్పుడు స్టార్ హీరోల రెమ్యునరేషన్ 100 కోట్లు దాటేసింది. రజినీకాంత్, కమల్ హాసన్, విజయ్, అజిత్, ధనుష్ లాంటి హీరోలు ఒక్కో సినిమాకు వందల కోట్లు తీసుకుంటున్నారు. రాజకీయాల్లోకి వెళ్లకముందు విజయ్ అత్యధికంగా 200 కోట్లకు పైగా రెమ్యునరేషన్ తీసుకునేవారు. ఇప్పుడు రజినీకాంత్ ఆ స్థానంలో ఉన్నారు.

ఇప్పుడు కోట్లు సంపాదిస్తున్న ఈ స్టార్లు.. తమ కెరీర్ మొదట్లో ఎంత తీసుకున్నారో తెలుసా? కేవలం కొన్ని వందలు, వేల రూపాయలతో మొదలైన వీరి ప్రయాణం ఇప్పుడు వందల కోట్లకు చేరింది. ఆ టాప్ 6 హీరోల మొదటి సంపాదన ఎంతో ఇప్పుడు చూద్దాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
రజినీకాంత్ మొదటి సంపాదన
Image Credit : Asianet News

రజినీకాంత్ మొదటి సంపాదన

సౌత్ సినిమా సూపర్ స్టార్ రజినీకాంత్ తన స్టైల్, యాక్టింగ్ తో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారు. ఇప్పుడు ఒక్కో సినిమాకు వందల కోట్లు తీసుకుంటున్న రజినీ.. తన కెరీర్ మొదట్లో తీసుకున్న రెమ్యునరేషన్ కేవలం రూ.250 మాత్రమే. కె.బాలచందర్ దర్శకత్వంలో వచ్చిన 'అపూర్వ రాగంగళ్' సినిమాతో ఆయన పరిచయం అయ్యారు. ఆ తర్వాత హీరోగా చేసిన మొదటి సినిమాలకు ఆయన రూ.5,000 వరకు పారితోషికం తీసుకున్నారు.

37
కమల్ హాసన్  ఫస్ట్ రెమ్యునరేషన్..
Image Credit : X

కమల్ హాసన్ ఫస్ట్ రెమ్యునరేషన్..

లోకనాయకుడు కమల్ హాసన్ చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. చిన్న వయసులోనే తన నటనతో మెప్పించిన కమల్.. ఆ తర్వాత హీరోగా, దర్శకుడిగా, నిర్మాతగా తన సత్తా చాటారు. ప్రస్తుతం 100 కోట్లకు పైగా రెమ్యునరేషన్ తీసుకుంటున్న కమల్ హాసన్.. తన మొదటి సినిమాకు తీసుకున్న పారితోషికం కేవలం రూ.500 మాత్రమే. అంత చిన్న మొత్తంతో మొదలైన ఆయన ప్రయాణం.. ఇప్పుడు ఇండియన్ సినిమాలో ఒక లెజెండ్‌గా మార్చేసింది.

47
విజయ్ మొదటి సంపాదన
Image Credit : Social Media

విజయ్ మొదటి సంపాదన

దళపతి విజయ్ కూడా చైల్డ్ ఆర్టిస్ట్‌గానే సినిమాల్లోకి వచ్చారు. 'వెట్రి' సినిమాలో బాలనటుడిగా చేసినప్పుడు ఆయనకు రూ.500 రెమ్యునరేషన్ ఇచ్చారు. ఆ తర్వాత హీరోగా ఎంట్రీ ఇచ్చి వరుస హిట్స్ తో టాప్ స్టార్ గా ఎదిగారు. సినిమాల్లో ఉన్నప్పుడు విజయ్ రూ.200 కోట్లకు పైగా పారితోషికం తీసుకునేవారు. ఇప్పుడు సినిమాలకు బ్రేక్ ఇచ్చి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు.

57
అజిత్ కుమార్ ఫస్ట్ శాలరీ..
Image Credit : x

అజిత్ కుమార్ ఫస్ట్ శాలరీ..

ఎలాంటి సినిమా బ్యాక్ గ్రౌండ్ లేకుండా తన కష్టంతో పైకొచ్చిన హీరో అజిత్ కుమార్. అభిమానులు ముద్దుగా తల అని పిలుచుకునే అజిత్.. ఇప్పుడు సినిమాకు 120 కోట్లకు పైగా తీసుకుంటున్నారు. కానీ ఆయన తన మొదటి సినిమాకు తీసుకున్న రెమ్యునరేషన్ రూ.2,500 మాత్రమే. లవర్ బాయ్ గా కెరీర్ మొదలుపెట్టి.. ఆ తర్వాత యాక్షన్ హీరోగా, రేసర్‌గా మారి కోలీవుడ్ టాప్ స్టార్లలో ఒకరిగా నిలిచారు.

67
ధనుష్ మొదటి సంపాదన
Image Credit : X

ధనుష్ మొదటి సంపాదన

హీరో ధనుష్ సినీ ప్రయాణం చాలా భిన్నంగా ఉంటుంది. మొదట్లో ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నా.. తన నటనతో అందరి దృష్టిని ఆకర్షించారు. కోలీవుడ్ తో పాటు టాలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్ వరకు వెళ్లి తన సత్తా చాటారు. ప్రస్తుతం ఒక్కో సినిమాకు 60 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకుంటున్న ధనుష్.. తన మొదటి సినిమా 'తుళ్లువదో ఇళమై' కోసం కేవలం రూ.5,000 తీసుకున్నారు.

77
సూర్య మొదటి సంపాదన
Image Credit : X

సూర్య మొదటి సంపాదన

కోలీవుడ్ టాప్ హీరోల్లో సూర్య ఒకరు. ఆయన నటనకు ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఇప్పుడు సూర్య రెమ్యునరేషన్ 100 కోట్లకు దగ్గరలో ఉంది. కానీ ఆయన మొదటి సంపాదన ఎంతో తెలిస్తే మీరు కచ్చితంగా ఆశ్చర్యపోతారు. సినిమాల్లోకి రాకముందు సూర్య ఒక గార్మెంట్స్ కంపెనీలో పనిచేశారు. అక్కడ ఆయనకు నెలకు రూ.736 జీతంగా ఇచ్చేవారట.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
వినోదం
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Raja Babu: 20 ఏళ్లలో 500కు పైగా సినిమాలు, కోట్ల ఆస్తి సంపాదించి 45 ఏళ్లకే మరణించిన స్టార్ కమెడియన్.. రాజబాబు జీవితంలో ఇంత విషాదం ఉందా?
Recommended image2
October Movie Releases: అక్టోబర్ బిగ్ బాక్స్ ఆఫీస్ వార్.. రజినీ, విజయ్ దేవరకొండ, అజయ్ దేవగన్ రేసులో నిలిచేది ఎవరు?
Recommended image3
Tatvam Movie Review: తత్వం మూవీ రివ్యూ.. నయా మర్డర్‌ మిస్టరీ థ్రిల్లర్‌ ఎలా ఉందంటే?
Related Stories
Recommended image1
Raja Babu: 20 ఏళ్లలో 500కు పైగా సినిమాలు, కోట్ల ఆస్తి సంపాదించి 45 ఏళ్లకే మరణించిన స్టార్ కమెడియన్.. రాజబాబు జీవితంలో ఇంత విషాదం ఉందా?
Recommended image2
Salary: అమెరికాలో అడుక్కునేవారు రోజుకు ఎంత సంపాదిస్తారో తెలుసా? సాఫ్ట్‌వేర్ జీతాల కంటే ఎక్కువేనా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved