- Home
- Entertainment
- నరేష్ ఆస్తుల చిట్టా, దిమ్మతిరిగిపోద్ది.. వందల కోట్లకు అధిపతి అని తెలుసా, ఎవరి నుంచి వచ్చాయంటే..
నరేష్ ఆస్తుల చిట్టా, దిమ్మతిరిగిపోద్ది.. వందల కోట్లకు అధిపతి అని తెలుసా, ఎవరి నుంచి వచ్చాయంటే..
గత కొన్ని రోజులుగా మీడియాలో నరేష్ పేరు నానుతోంది. సీనియర్ నటి పవిత్ర లోకేష్ తో ఎఫైర్.. తన మూడో భార్య రమ్య రఘుపతితో విభేదాలే అందుకు కారణం. కొంత కాలంగా నరేష్.. పవిత్ర లోకేష్ తో రిలేషన్ షిప్ లో ఉంటున్నాడు.

గత కొన్ని రోజులుగా మీడియాలో నరేష్ పేరు నానుతోంది. సీనియర్ నటి పవిత్ర లోకేష్ తో ఎఫైర్.. తన మూడో భార్య రమ్య రఘుపతితో విభేదాలే అందుకు కారణం. కొంత కాలంగా నరేష్.. పవిత్ర లోకేష్ తో రిలేషన్ షిప్ లో ఉంటున్నాడు. త్వరలో వీరిద్దరూ వివాహానికి సిద్ధం అవుతున్నారు అనే న్యూస్ రావడం.. ఈ తరుణంలో రమ్య ఎంటర్ కావడంతో వివాదం బాగా ముదిరింది.
మైసూర్ లోని ఓ హోటల్ లో నరేష్, పవిత్ర లోకేష్ ఒంటరిగా ఉండడంతో అక్కడికి వెళ్లి వాళ్ళిద్దరి రిలేషన్ ని రమ్య బహిర్గతం చేసింది. దీనితో సోషల్ మీడియాలో నరేష్, పవిత్రపై తీవ్రంగా విమర్శలు వెల్లువెత్తాయి. దీనితో నరేష్ గురించి ప్రతి ఒక్కరూ చర్చించుకుంటున్నారు.
నరేష్ ఒకప్పుడు టాలీవుడ్ లో క్రేజీ హీరో. ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయ్యారు. దివంగత నటి విజయ నిర్మలకి ఏకైక వారసుడు నరేష్. నరేష్ ఆస్తుల చిట్టా గురించి తెలిస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో నరేష్ కి ఏకంగా మూడు నాలుగు ఫామ్ హౌస్ లు ఉన్నాయట. గచ్చిబౌలిలో 5 ఎకరాల ఫార్మ్ హౌస్ అత్యంత ఖరీదైనదిగా చెబుతారు. అలాగే మొయినాబాద్, శంకర్ పల్లిలో కూడా నరేష్ కి ఫామ్ హౌస్ లు ఉన్నాయి.
ఇక చెన్నైలో కూడానా నరేష్ కి సొంత నివాసం ఉంది. వీటిలో ఎక్కువ భాగం నరేష్ కి అతడి తల్లి విజయ నిర్మల నుంచి వారసత్వంగా వచ్చినవే అని చెబుతారు. విజయనిర్మల ఆభరణాలు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. వాటి విలువ కూడా భారీగానే ఉంటుంది. టాలీవుడ్ లో క్యారవ్యాన్ మైంటైన్ చేసే క్యారెక్టర్ ఆర్టిస్ట్ నరేష్.
విజయ నిర్మల నటి, దర్శకురాలు, నిర్మాత కూడా. కృష్ణతో కలసి నటించడమే కాదు.. అనేక చిత్రాలు నిర్మించారు కూడా. ఆ ఆదాయంతో హైదరాబాద్, చెన్నైలో ఆస్తులు కొన్నారు. కాల క్రమంలో సహజంగానే ఆ ఆస్తుల విలువ వందల కోట్లకు చేరింది. కేవలం విజయ నిర్మల సంపాదించిన ఆస్తులే 300 కోట్ల వరకు ఉంటాయని అంటున్నారు.
ఇక నరేష్ సినిమాలో తన పాత్రని బట్టి రూ. 20 లక్షల వరకు పారితోషికం అందుకుంటారు. ఆయన ఇంట్లో ఎప్పుడూ నాలుగైదు కాస్ట్లీ కార్లు ఉంటాయి. 90 దశకంలో హీరోగా నరేష్ కూడా బాగానే సంపాదించారు. ఈ విధంగా నరేష్ టాలీవుడ్ లో కుబేరుడనే చెప్పాలి.
Vijaya nirmala
ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోలలో చాలా మంది కంటే ఎక్కువనే నరేష్ ఆస్తులు ఉన్నట్లు తెలుస్తోంది. ఒక వైపు మనీ, మరోవైపు బిజీ స్టార్ గా నరేష్.. రాయల్ లైఫ్ ని లీడ్ చేస్తున్నారు అనే చెప్పాలి. కానీ వ్యక్తిగత వ్యవహారాలే అతడిని మీడియాలో నిలబెట్టాయి.