లిప్‌లాక్‌లు, బోల్డ్ కంటెంట్.. `ఉప్పెన` సినిమా అందుకే ఒదులుకున్నా.. రహస్యం బయటపెట్టిన శివానీ రాజశేఖర్
ఇటీవల `కోటబొమ్మాళి`తో హిట్ అందుకున్న స్టార్ కిడ్ శివానీ రాజశేఖర్.. ఒక బిగ్గెస్ట్ సీక్రెట్ బయటపెట్టింది. `ఉప్పెన` సినిమాని మొదట తానే చేయాల్సిందని, దాన్ని వదులుకున్నట్టు చెప్పి షాకిచ్చింది.
టాలీవుడ్‌లో ఉప్పెన సినిమా ఓ సంచలనం. అదొకి విభిన్నమైన లవ్ అండ్ యాక్షన్ మూవీ. అంతేకాదు ఒక ట్రెండ్ సెట్టింగ్ మూవీ అని చెప్పొచ్చు. ఈ ఒక్క సినిమాతో మెయిన్ కాస్టింగ్ అండ్ క్రూ మొత్తం పాపులర్ అయిపోయారు. ఈ సినిమాతో ప్రధానంగా దర్శకుడు బుచ్చిబాబు, హీరో వైష్ణవ్ తేజ్, హీరోయిన్ కృతి శెట్టి టాలీవుడ్‌కి పరిచయం అయ్యారు, తొలి చిత్రంతోనే స్టార్స్ అయిపోయారు.
ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన మూవీ ఇది. పాటలతో అందరి దృష్టిని ఆకర్షించింది. టీజర్, ట్రైలర్లతో సినిమాలో విషయం ఉందనే విషయాన్ని చాటి చెప్పింది. ఇక సినిమా సంచలనం సృష్టించింది. కనీసం పరిచయం లేని వారు చేసిన ఈ మూవీ ఏకంగా వంద కోట్లు వసూలు చేసింది. అదికూడా కరోనా సమయంలో, థియేటర్‌కి జనం రాలేని పరిస్థితుల్లో, ఆడియెన్స్ ని థియేటర్లో నింపింది. ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించింది.
ఇదిలా ఉంటే ఈ సినిమాతో కృతి శెట్టి హాట్ కేక్ అయిపోయింది. వరుసగా ఆరేడు సినిమాలు చేసింది. అయితే ముందుగా ఈ ఆఫర్ శివానీ రాజశేఖర్‌కి వచ్చిందట. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె ఈ విషయాన్ని వెల్లడించింది. మొదట `ఉప్పెన` సినిమా తానే చేయాల్సిందని, మంచి సినిమాని వదులుకున్నట్టు చెప్పింది.
`మొదట వీరీ గుడ్ కాల్ నాకు వచ్చిందేంటంటే `ఉప్పెన` మూవీ. మొదట్లో డ్రాఫ్ట్ స్టోరీ పూర్తిగా వేరేలా ఉంది. ఇప్పుడు తీసిన సినిమాకి, మొదటి వెర్షన్‌కి చాలా భిన్నంగా ఉంది. అది చాలా బోల్డ్ గా ఉంది. లిప్ లాక్‌లు, ఇంటిమెసీ సీన్లున్నాయి. అవి చేసేందుకు నాకు ఇబ్బందిగా అనిపించింది. ఒకరకమైన భయం అనిపించింది. ఏమో.. ఇప్పుడు కూడా ఆన్ స్క్రీన్ ఇంటిమెసీ చేస్తావా అంటే నన్ను కన్విన్స్ చేయాలి. లేకపోతే చేయగలుగుతానా లేదా అనేది తెలియదు. అంటే ఇంటిమెసీ చేస్తాను, కానీ లిప్ లాక్లు, బోల్డ్ సీన్లు, లవ్ మేకింగ్ సీన్లు ఎంత వరకు బాగా చేస్తాననేది తెలియదు` అని తెలిపింది.
మొత్తానికి శివానీ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ని మిస్ చేసుకుంది. ఒకవేళ అదే చేసి ఉంటే ఆమె నెక్ట్స్ పొజిషియన్‌లో ఉండేది. స్టార్ హీరోయిన్ గా రాణించేదని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇక శివానీ చిన్న చిన్న సినిమాలతో రాణిస్తుంది. ఆమె ఇటీవల `కోట బొమ్మాళి పీఎస్` చిత్రంతో హిట్ అందుకుంది. ఆమెకిది తొలి థియేట్రికల్ హిట్ అని చెప్పొచ్చు
. దీంతో శివానీ నేమ్ బాగా వినిపించింది. నటిగా ఆమె మరో మెట్టు ఎక్కిందని చెప్పొచ్చు. అయితే తనకు కంటెంట్ ఓరియెంటెడ్ మూవీస్‌తోపాటు కమర్షియల్ మూవీస్ కూడా చేస్తానని, గ్లామర్‌పాత్రలు కూడా చేసేందుకు సిద్ధమే అని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో శివానీ చెప్పిన విషయం తెలిసిందే.