MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • చిరంజీవి గారి ఫ్యామిలీతో గొడవలు నిజమే.. ఏం జరిగినా నాన్న రాజశేఖర్ గారికే ఫుల్ సపోర్ట్: శివాని

చిరంజీవి గారి ఫ్యామిలీతో గొడవలు నిజమే.. ఏం జరిగినా నాన్న రాజశేఖర్ గారికే ఫుల్ సపోర్ట్: శివాని

టాలీవుడ్ సీనియర్ స్టార్ కపుల్ రాజశేఖర్, జీవిత దంపతులు కుమార్తె శివాని రాజశేఖర్ కూడా టాలీవుడ్ లో నటిగా మారింది. హద్దులు దాటకుండా గ్లామర్ గా కనిపిస్తూ హీరోయిన్ గా రాణిస్తోంది. 

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Nov 15 2023, 04:13 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19

టాలీవుడ్ సీనియర్ స్టార్ కపుల్ రాజశేఖర్, జీవిత దంపతులు కుమార్తె శివాని రాజశేఖర్ కూడా టాలీవుడ్ లో నటిగా మారింది. హద్దులు దాటకుండా గ్లామర్ గా కనిపిస్తూ హీరోయిన్ గా రాణిస్తోంది. స్టార్ బ్యూటీగా మారేందుకు గట్టి ప్రయత్నాలే చేస్తోంది. అయితే అవసరం అయినప్పుడు హీరోయిన్ గా మాత్రమే కాకుండా కీలక పాత్రల్లో సైతం రాణిస్తోంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
29

శివాని రాజశేఖర్ నటించిన లేటెస్ట్ మూవీ కోట బొమ్మాళి పీఎస్ అనే చిత్రంలో నటించింది. నవంబర్ 24న రిలీజ్ అవుతున్న కోట బొమ్మాళి చిత్ర ప్రచార కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. శ్రీకాంత్, వరలక్ష్మి శరత్ కుమార్, శివాని రాజశేఖర్, రాహుల్ విజయ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. 

 

39

ఈ చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా శివాని రాజశేఖర్ ఇంటర్వ్యూలో అనేక ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. అయితే రాజశేఖర్ కుటుంబానికి, మెగా ఫ్యామిలీకి చాలా కాలంగా వివాదాలు జరుగుతున్నాయి. 

49

బహిరంగంగా చిరు, రాజశేఖర్ మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తిన సందర్భాలు ఉన్నాయి. దీని గురించి మీడియా ప్రతినిధులు ప్రశ్నించినప్పుడు శివాని ఆసక్తికర సమాధానం ఇచ్చింది. 

 

59

నవ్వుతూ మాట్లాడుతూ.. లోపల బియ్యం గింజ అంత జరిగితే బయటకి బిర్యానీ అంత కనిపిస్తుంది. నిజమే కొన్ని వివాదాలు నడిచాయి. పాలిటిక్స్ అన్నప్పుడు వాగ్వాదాలు జరుగుతూ ఉంటాయి.

69

 కానీ అవసరం అయినప్పుడు అంతా కలిసిపోతారు. మేం అంతా ఒకే ఇండస్ట్రీలో ఉన్నాం కదా. ప్రొఫెషనల్ గా వేరు.. పర్సనల్ గా వేరుగా ఉంటుంది. నిజమే చిరంజీవి గారి ఫ్యామిలీకి మా ఫ్యామిలీకి కొంత డిస్ట్రబెన్స్ వచ్చింది. 

79

కానీ ఆ వివాదాలు అన్ని ఆ హీట్ మూమెంట్ లో మాత్రమే జరిగాయి. ఆ గొడవల గురించి బయట వాళ్ళు ఎందుకు ఇంకా ఎక్కువగా గొడవ పడడం ? ట్రోలింగ్ ఎందుకు చేయడం ? అని శివాని ప్రశ్నించింది. 

89

గతంలో ఎప్పుడో చిన్న చిన్న వివాదాలు జరిగినంత మాత్రాన వాళ్ళ ప్రొడక్షన్ లో నేను నటించకూడదు అని ఏమీ లేదు.. మా ప్రొడక్షన్ లో వాళ్ళు నటించకూడదు అని ఏమీ లేదు. ఎందుకంటే సినిమాల పరంగా వాళ్ళు కానీ మేము కానీ ప్రొఫెషనల్ గానే ఆలోచిస్తాం అని శివాని పేర్కొంది. తాజాగా శివాని నటించిన కోట బొమ్మాళి పీఎస్ చిత్రం గీతా ఆర్ట్స్ బ్యానర్ లో తెరకెక్కిన సంగతి తెలిసిందే. 

99

అయితే పర్సనల్ గా ఎలాంటి వివాదాలు జరిగినా నా ఫుల్ సపోర్ట్ ఫ్యామిలీకే ఉంటుంది అని శివాని తేల్చి చెప్పింది. ఎలాంటి వివాదం జరిగినా తన తండ్రి రాజశేఖర్ కే ఫుల్ సపోర్ట్ ఉంటుందని శివాని చెప్పకనే చెప్పింది. 

About the Author

SG
Sreeharsha Gopagani
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Serial Killer Movies: లాస్ట్ మినిట్ వరకు ఉత్కంఠ రేపే టాప్ 5 సీరియల్ కిల్లర్ మూవీస్ ఇవే!
Recommended image2
సెకనుకు 10 లక్షలు.. 50 సెకన్ల యాడ్ కోసం 5 కోట్లు తీసుకున్న హీరోయిన్ ఎవరో తెలుసా?
Recommended image3
Suman: శంకరాభరణం చేసిన నిర్మాతని, వీడితో సినిమా చేసి తప్పు చేశా.. సుమన్ మూవీపై కామెంట్స్, కట్ చేస్తే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved