MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • నావల్ల నాన్న ప్రాణాలు ప్రమాదంలో పడ్డాయి, నేను నష్టజాతకురాలిని, స్టేజ్ పైనే ఏడ్చేసిన శివాని రాజశేఖర్

నావల్ల నాన్న ప్రాణాలు ప్రమాదంలో పడ్డాయి, నేను నష్టజాతకురాలిని, స్టేజ్ పైనే ఏడ్చేసిన శివాని రాజశేఖర్

శేఖర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. ఈ ఈవెంట్ లో స్పెషల్ స్పీచ్ తో అందరిని ఆశ్చర్య పరిచారు శివాని రాజశేఖర్. ఎమెషనల్ అయ్యి ఒక దశలో కన్నీళ్ళు పెట్టుకున్నారు. తన వల్లే తన తండ్రికి ఈ పరిస్థితి వచ్చిందన్నారు.  

2 Min read
Author : Mahesh Jujjuri
| Updated : May 18 2022, 09:25 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

రాజశేఖర్‌ హీరోగా, ముస్కాన్, ఆత్మీయ రాజన్‌ హీరోయిన్లుగా శివానీ రాజశేఖర్‌ ప్రధాన పాత్రలో నటించిన సినిమా శేఖర్‌.  జీవితా రాజశేఖర్‌ దర్శకత్వం వహించిన ఈమూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. ఇక ఈ ఈవెంట్ లో సెంట్రల్ అట్రాక్షన్ గా నిలిచారు రాజశేఖర్ తనయలు శివాని,శివాత్మిక అంతే కాదు ఈ ఈవెంటో శివాని స్పీచ్ అందరూ ఫిదా అయిపోయారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

అందరికి పేరు పేరున థ్యాంక్స్ చెప్పిన శివాని తన కుటుంబంపై బయట చాలా అపోహలు ఉన్నాయని.. రాజశేఖర్ గారి జీవితాన్ని జీవిత నాశనం చస్తోందంటూ చాలా మంది కామెంట్స్ చేస్తుంటారు. ఆమే తమన రూల్ చేస్తుందంటూ అంటుంటారు.. బట్ మేము అవేమి పట్టించుకోంఅన్నది శివాని, అంతే కాదు ఈసినిమాను అమ్మ అద్భుతంగా డైరెక్ట్ చేసిందని కితాబిచ్చింది శివాని

38

ఇక తన తండ్రి గురించి ఎంత చెప్పినా తక్కువే అన్నారు శివాని. తన వల్లే తన తండ్రి ప్రాణాలకు ప్రమాదం వచ్చిందంటూ ఎమోషనల్ అయ్యింది. ఈ మూవీ స్టార్ట్ చేద్దాం అనుకున్నప్పుడు తననుంచి తన తండ్రికి కోవిడ్ వచ్చిందని చెప్పింది శివాని. నాకు కోవిడ్ త్వరగా తగ్గిపోయింది. కాని నాన్నకు బాగా సీరియస్ అయ్యింది. డాక్టర్స్ ఒక దశలో 50‌-50 ఛాన్సెస్ అన్నారు మాకు ఏం చేయాలో అర్ధం కాలేదన్నారు శివాని.
 

48

నాన్నకు బాగా సీరియస్ అవ్వడంతో నా మీద నాకు కోపం వచ్చింది. నేను నష్ట జాతకురాలిని, అని బయట వారు అన్నారు. నాకు కూడా అదే అనిపించింది అంటూ శివాని ఆవేదన చెందారు. ఒక దశలో ఆయన ఆక్సిజన్ లెవల్స్ 58 వరకూ పడిపోయాయి.. దాంతో ఆయన కూడా తన పరిస్థితి ఏంటీ అని బాధపడ్డారు అంటూ శివాని అన్నారు. 
 

58

నాన్న మాట్లాడటానికి కూడా అవకాశం లేనంతగా సిక్ అయ్యారు.. నావల్లే కదా నాన్నా మీకు ఈ పరిస్థితి అని అంటే.. ఓపికలేకపోయినా.. ఆక్సిజన్ మాస్క్ తీసి.. అదేంటిరా.. నువ్వ కాకపోతే ఎవరివల్ల అయినా వచ్చేది. నీవల్లే వచ్చిదని బాధపడకు అంటూ.. ఓదార్చారు. దేవుడి దయ వల్ల నాన్నమళ్ళీ మాకు దక్కారు అంటూ శివాని అన్నారు. శివాని మాట్లాడుతుండగా.. శివాత్మిక కూడా ఎమోషన్ అయ్యారు. కన్నీళ్లు పెట్టుకున్నారు.
 

68

ఈసినిమా కోసం నాన్న చాలా రిస్క్ లు చేశారు. శేఖర్ మూవీలో క్యారెక్టర్ కోసం జిమ్ చేసి.. వెయిట్ పెరిగారు. అదే టైమ్ లో కరోనా రావడంతో ఆయన వెయిట్ 60కి పడిపోయింది. కాని ఆయన బెడ్ మీద నుంచి చిన్నగా లేవడం, నడవడం, మెట్లు ఎక్కడం, దిగడం, వాకింగ్,జాగింగ్.. ఇలా నెలన్నరలో ఆయన అన్ని పర్ఫెక్ట్ గా చేసి.. జిమ్ కు వెళ్ళి మళ్లీ 75 కేజీలకు వచ్చారు అంటూ ఆనందంగా చెప్పింది శివాని. 

78

అంతే కాదు ఈసినిమాలో క్యారెక్టర్ కు స్మోకింగ్ చేసే అలవాటు ఉంటంది. సిగార్ తాగాలి.. కాని నాన్నలంగ్స్ కోవిడ్ వల్ల దాదాపు 7‌0 శాతం ఎఫెక్ట్ అయ్యాయి. నేను వద్దు.. వేరే ఇంకేదైనా చూద్దాం.. అన్నాను. కాని నాన్న ఈపాత్రకు స్మోక్ ఉంటేనే బాగుంటుంది. కావాలంటే హెర్పల్ వి తెప్పిద్దాం.. నేను కూడా లోపలకు తీసుకోకుండా పై పైన సిగరెట్ కాలుస్తాను అంటూ సినిమా కోసం రిస్క్ చేశాడన్నారు శివాని. 

88

అంతే కాదు దగ్గు వస్తున్నా. పాత్రకోసం ఆయన ఇష్టం లేకున్నా సిగరెట్ కాల్చారంటూ గర్వంగా చెప్పారు శివాని రాజశేఖర్. తన తండ్రితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుటూ ఓ పాటను అద్భుతంగా పాడి వినిపించారు శివాని, తన తల్లి తండ్రులు, సోదరి తన బలం అంటూ ఎమోషనల్ అయ్యారు. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
Latest Videos
Recommended Stories
Recommended image1
ANR: తాగేసి హోటల్ లో గొడవ, స్టార్ హీరోని పిలిచి వార్నింగ్ ఇచ్చిన ఏఎన్నార్..అసలు ట్విస్ట్ ఏంటో తెలుసా
Recommended image2
ANR: సాంబార్ గాడు వచ్చాడురా.. అని అక్కినేని నాగేశ్వరరావు ను అవమానించింది ఎవరు? ఏఎన్నార్ ఏం చేశాడంటే?
Recommended image3
Chiranjeevi: నటించలేక చేతులెత్తేసిన రజినీ, మైండ్ బ్లాక్ చేసిన చిరంజీవి.. అది గుర్తు చేసుకుంటూ ఎమోషనల్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved