రామ్ చరణ్ చిత్రంలో శివరాజ్ కుమార్ పాత్ర ఇదే?
ఈ చిత్రంలో కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ కీలక పాత్రలో కనిపించనున్నారు. గ్రామీణ నేపధ్యంలో సాగే ఈ కథలో శివరాజ్ కుమార్ పాత్ర ...రామ్ చరణకు ప్రేరణ ఇచ్చేదిగా ఉంటుందని చెప్తున్నారు.
Ramcharan, #BuchiBabu, uppena,Shiva Rajkumar
రామ్ చరణ్ ,బుచ్చిబాబు కాంబినేషన్ సినిమా షూటింగ్ మొదలైంది. ఉప్పెన వంటి సూపర్ హిట్ సినిమా ఇచ్చి ఇంతకాలం వెయిట్ చేయటం అంటే మామూలు విషయం కాదు. దాదాపు మూడేళ్లు పాటు స్క్రిప్టు రాసుకుంటూ గడిపారు. బౌండ్ స్క్రిప్ట్ పట్టుకుని రామ్ చరణ్ తో చేద్దామని, డేట్స్ కోసం వేచి ఉన్నాడు. ఇప్పుడు చరణ్ గేమ్ ఛేంజర్ పూర్తి చేసుకురాగానే ఆలస్యం చేయకుండా సినిమా మొదలెట్టేసారు.
మైసూర్‌లో ఒక షెడ్యూల్ ముగించేసారు. మరో షెడ్యూల్ సిటీలో స్టార్ట్ చేసేశారు. చాలా స్పీడుగా ఈ సినిమా కంప్లీట్ చేసేసి రిలీజ్ చేస్తారని అంటున్నారు. స్క్రిప్టు పై పూర్తి క్లారిటీ ఉండటంతో బుచ్చిబాబు కు ఒక్క గంట కూడా గ్యాప్ ఇవ్వాల్సిన అవసరం ఉండటం లేదు. ఈ క్రమంలో సినిమా గురించి అప్డేట్స్, ఇంట్రస్టింగ్ విషయాలు బయిటకు వస్తున్నాయి. తాజాగా ఈ సినిమాలో చేస్తున్న శివరాజ్ కుమార్ క్యారక్టరైజేషన్ గురించి బయిటకు వచ్చింది.
Ramcharan, #BuchiBabu, uppena,Shiva Rajkumar
అందుతున్న సమాచారం మేరకు ఈ చిత్రంలో కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ కీలక పాత్రలో కనిపించనున్నారు. గ్రామీణ నేపధ్యంలో సాగే ఈ కథలో శివరాజ్ కుమార్ పాత్ర ...రామ్ చరణకు ప్రేరణ ఇచ్చేదిగా ఉంటుందని చెప్తున్నారు.
సినిమాలో చాలా సేపు ఉంటుందని అందుకే 40-50 రోజులు డేట్స్ తీసుకున్నారని సమాచారం. మొదట ఈ పాత్రకు గాను తమిళ నటుడు విజయ్ సేతుపతిని అనుకున్నారు. అయితే జైలర్ లో శివరాజ్ కుమార్ పాత్ర చూసాక అలాంటి పవర్ ఫుల్ పాత్ర చేసిన ఆయనే సెట్ అవుతారని భావించారు. అంతేకాకుండా కన్నడ మార్కెట్ లో కూడా శివరాజ్ కుమార్ ఉపయోగపడతారు.
Ramcharan, #BuchiBabu, uppena,Shiva Rajkumar
రామ్ చరణ్ సినిమాలో శివరాజ్ కుమార్ పాత్ర విషయానికి వస్తే జాన్వీ కపూర్ కు తండ్రిగా కనిపించబోతున్నట్లు వినికిడి. ఇక రామ్ చరణ్‌కి జోడీగా జాన్వీ కపూర్ అయితే బాగుంటుంది అంటూ ఆమెను భారీ పారితోషికం ఆఫర్ చేసి మరీ ఎంపిక చేశారు.
దేవర సినిమా విడుదలకు ముందే చరణ్ మూవీలో జాన్వీ కపూర్ ఎంపిక అయింది. అలానే త శివ రాజ్ కుమార్‌తో పాటు ఇంకా పలువురు స్టార్స్ ఈ సినిమాలో కనిపించబోతున్నట్లు టాక్. పాత్ర ఏదైనా, కథలో ఉన్న ప్రాముఖ్యత నేపథ్యంలో స్టార్స్‌ను, సూపర్ స్టార్స్‌ను ఈ సినిమాలో నటింపజేసి సినిమా స్థాయిని పెంచాలని బుచ్చిబాబు భావిస్తున్నారు.
#Shankar, #GameChanger, #RamCharan, #KiaraAdvani
షూటింగ్ ప్రారంభం కాకముందే రెహమాన్‌తో మూడో పాటలు రెడీ చేసేశారు బుచ్చిబాబు. పాటలు షూట్ కి లేటు ఉండదు. టాకీని చకచకా పూర్తిచేస్తే, సీజీ వర్క్స్‌కు పంపిస్తారు. ఇవన్ని చూస్తూంటే ఈ సినిమా 2025లో రిలీజ్ అయ్యే అవకాసం ఉందనిపిస్తోంది.
యేడాది ప్రారంభంలో గేమ్ ఛేంజర్, ఏడాది చివర్లో ఈ సినిమా రిలీజ్ అవుతాయని అంటున్నారు. ఈ సినిమాను సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. ఆయన బ్యానర్‌కు ఇది తొలి సినిమా. గేమ్ ఛేంజర్ తర్వాత రామ్ చరణ్ చేస్తున్న పాన్ ఇండియా సినిమా ఇది. స్పోర్ట్స్ డ్రామా మిక్స్ అయిన ఈ సినిమా గ్రౌండ్ లెవెల్‌లో ఉండటంతో పాటు, చాలా ఎమోషనల్ కంటెంట్‌తో ఉంటుందని తెలుస్తోంది.
#Shankar, #GameChanger, #RamCharan, #KiaraAdvani
అలాగే సుకుమార్ ఈ స్క్రిప్టుకు కొన్ని టిప్స్ చెప్పారని, ముఖ్యంగా ఇంటర్వెల్ బ్లాక్ పై చాలా రోజులు వర్క్ చేసారని తెలుస్తోంది. స్క్రిప్టుని రామ్ చరణ్, చిరంజీవి కూడా విన్నారని, చిరంజీవికు బాగా నచ్చిందని ఆయన కూడా కొన్ని సూచనలు ఇచ్చారని కూడా వినిపిస్తోంది.
ఈ మాస్ ఎంటర్‌టైనర్‌కు ‘పెద్ది’ (#RC16) అనే పేరును ఖరారు చేసినట్లు తెలుస్తోంది. గతంలో ఈ టైటిల్‌ను ఎన్టీఆర్ సినిమా కోసం బుచ్చిబాబు రిజిస్టర్ చేశారని.. ఇప్పుడు అదే పేరును రామ్ చరణ్ సినిమాకు పెడుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
#Shankar, #GameChanger, #RamCharan, #KiaraAdvani
ఉప్పెన ఓ లవ్ స్టోరీ. కానీ ఇప్పుడు రామ్ చరణ్ తో చేస్తున్న ఈ కథ హార్ట్ హిట్టింగ్ యాక్షన్ తో కూడిన కథనం అంటున్నారు. కాబట్టి ఇండస్ట్రీలో కొందరు సీనియర్ రచయితలు, బుచ్చిబాబుతో జర్నీ చేస్తున్న టీమ్, సుకుమార్ రైటింగ్ డిపార్టమెంట్ లో కొందరు కలిసి ఈ స్క్రిప్టుపై రోజూ కూర్చుంటున్నారట. సెకండాఫ్ లో వచ్చే కొన్ని ఎపిసోడ్స్ అద్బుతంగా డిజైన్ చేస్తున్నారని అంటున్నారు. రామ్ చరణ్ ఈ స్క్రిప్టు వర్క్ కూడా బడ్జెట్ లో భాగమే అని నిర్మాతలను ఒప్పించి రైటర్స్ కు మంచి ఎమౌంట్స్ ఇప్పించారని చెప్పుకుంటున్నారు.