MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Peddi: పెద్ది కథ మామూలుగా ఉండదు.. సినిమాపై కన్నడ స్టార్‌ సెన్సేషనల్‌ కామెంట్స్‌!

Peddi: పెద్ది కథ మామూలుగా ఉండదు.. సినిమాపై కన్నడ స్టార్‌ సెన్సేషనల్‌ కామెంట్స్‌!

Peddi: గ్లోబల్‌ స్టార్‌ రాంచరణ్‌ నటిస్తున్న పెద్ది సినిమా గురించి ఏ చిన్న లీక్‌ వచ్చినా ఫ్యాన్స్‌ పండగ చేసుకుంటున్నారు. రీసెంట్‌గా చరణ్‌ పుట్టినరోజు సందర్బంగా సినిమా గింప్స్‌ను విడుదల చేశారు. దీనిలో చరణ్‌ మాస్‌ లుక్‌లో కనిపించారు. ఈ గెటప్‌ చూసిన అభిమానులు రంగస్థలం కంటే పెద్ది సినిమా ప్యాన్‌ ఇండియా లెవల్‌లో బ్లాక్‌ బాస్టర్ అవుతుందని ఫిక్స్‌ అయిపోయారు. ఇక తాజాగా ఈ సినిమా కధ గురించి కన్నడ సూపర్‌ స్టార్‌ ఒకరు ఆసక్తికర అంశాలు చెప్పారు. ప్రస్తుతం అవి వైరల్‌గా మారాయి. 

1 Min read
Bala Raju Telika
Published : Apr 16 2025, 11:55 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
14
actor ram charan movie Peddi Release Date Glimpse

actor ram charan movie Peddi Release Date Glimpse

పుష్ప-2 దర్శకుడు సుకుమార్‌ శిష్యుడు బుచ్చిబాబు సాన దర్శకత్వంలో పెద్ది సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా కోసం ప్యాన్‌ ఇండియా నటులు, ఇతర టెక్నీషియన్లు పనిచేస్తున్నారు. స్పోర్ట్స్ బ్యాగ్రౌండ్‌లో సాగే ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్‌ సంగీతం అందిస్తున్నారు. దీంతో సినిమాపై అంచనాలు మరింత పెంచాశారు దర్శకుడు బుచ్చిబాబు.

 

24
Peddi makers got 25 crore in audio rights from t series ram charan ar rahman Buchi Babu Sana

Peddi makers got 25 crore in audio rights from t series ram charan ar rahman Buchi Babu Sana

రీసెంట్‌గా విడుదల చేసిన గ్లింప్స్‌లో కూడా చరణ్‌ లుక్స్‌, గెటప్‌ చూసిన అభిమానులు ఊరమాస్‌గా ఉన్నాయని పండగ చేసుకుంటున్నారు. గ్లింప్స్‌తో సినిమా ఎప్పుడు విడుదలవుతుందనే ఆసక్తిని ప్రేక్షకుల్లో దర్శకుడు పెంచేశాడని చెప్పవచ్చు. 

34
Ram Charan Peddi Movie

Ram Charan Peddi Movie

పెద్ది సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. అయితే ఈ సినిమాలో కన్నడ సూపర్‌ స్టార్‌ శివ రాజ్‌కుమార్ ఓ కీలకపాత్రలో నటిస్తున్నారు. ఇటీవల దీనికి సంబంధించిన వివరాలను ఆయన పంచుకున్నారు. ఈ సందర్బంగా శివరాజ్‌కుమార్‌ పెద్ది కథకు సంబంధించి ఆసక్తికర కామెంట్లు చేశారు. పెద్ది సినిమా కథ అద్బుతంగా ఉందని ఆయన చెప్పుకొచ్చారు. ముఖ్యంగా తన పాత్ర ప్రత్యేకంగా ఉండబోతున్నట్లు తెలిపారు. కన్నడ స్టార్‌ కామెంట్లతో మూవీపై అంచనాలు మరింత పెరిగాయి. ఇక సినిమాలో రాంచరణ్‌ క్యారెక్టర్ అల్టిమేట్‌గా ఉండబోతుందని అంటున్నారు. 

 

44
peddi, ram charan

peddi, ram charan

పెద్ది సినిమాలో రాంచరణ్‌ సరసన అందాల తార జాన్వీ కపూర్ హీరోయిన్‌గా తొలిసారి నటిస్తోంది. తెలుగుతోపాటు ఇతర భాషల్లో కూడా పెద్ది విడుదల కానుంది. వచ్చే ఏడాది సినిమాను విడుదల చేయనున్నట్లు చిత్రయూనిట్‌ ఇప్పటికే ప్రకటించింది. అయితే.. మొదటి సినిమాతోనే గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు బుచ్చిబాబు.. రెండో సినిమాకే రాంచరణ్‌ను ఒప్పించడం, ప్యాన్‌ ఇండియా స్టార్లు చిత్రం నటించడం చూస్తే కథ చాలా బలంగా ఉందని ఇండస్ట్రీలో చర్చ నడుస్తోంది. 

About the Author

BR
Bala Raju Telika
తెలిక బాలరాజు ఈనాడు పత్రికలో 8 సంవత్సరాలు సబ్ ఎడిటర్ రిపోర్టర్‌గా పని చేశారు. అనంతరం News X తదిర వెబ్ సైట్లలో నూ ఫీచర్, న్యూస్, స్పోర్ట్స్ కంటెంట్ క్రియేటర్ గా పని చేశారు. మొత్తం 10 సంవత్సరాల జర్నలిజం అనుభం ఉంది. ఫీచర్స్, స్పోర్ట్స్, రాజకీయాలు, ఎంటర్‌‌టైన్మెంట్ ఇలా ఏ రంగానికి సంబంధించిన వార్తలైనా, ఫీచర్లైనా రాయడం బాలరాజు ప్రత్యేకత.
తెలుగు సినిమా
రామ్ చరణ్ కొణిదెల
 
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Andriod_icon
  • IOS_icon
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved