- Home
- Entertainment
- సమంత, విజయ్ లిప్ లాక్ సీన్ పై డైరెక్టర్ కామెంట్స్..అది కూడా లేకపోతే ఎలా, పద్ధతిగా ఉంటే ప్రాబ్లం లేదు
సమంత, విజయ్ లిప్ లాక్ సీన్ పై డైరెక్టర్ కామెంట్స్..అది కూడా లేకపోతే ఎలా, పద్ధతిగా ఉంటే ప్రాబ్లం లేదు
విజయ్ దేవరకొండ, సమంత జంటగా జంటగా నటించిన 'ఖుషి' చిత్రం శుక్రవారం రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విజయ్, సమంత రొమాన్స్ కి ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ అదిరిపోయింది అని కామెంట్స్ చేస్తున్నారు.

విజయ్ దేవరకొండ, సమంత జంటగా జంటగా నటించిన 'ఖుషి' చిత్రం శుక్రవారం రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విజయ్, సమంత రొమాన్స్ కి ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ అదిరిపోయింది అని కామెంట్స్ చేస్తున్నారు. సినిమాలో కొంత భాగం సాగదీతకు గురైందని, కొన్ని సన్నివేశాలు రొటీన్ గా ఉన్నాయని అంటున్నప్పటికీ ఓవరాల్ గా ఎంజాయ్ చేసే విధంగా ఉందని అంటున్నారు.
తొలి రోజే మూవీకి పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో చిత్ర యూనిట్ హ్యాపీగా ఉంది. సక్సెస్ ని సెలెబ్రేట్ చేస్తూ నిర్వహించిన మీడియా సమావేశంలో దర్శకుడు శివ నిర్వాణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఖుషి చిత్రంలో విజయ్, సమంత మధ్య రొమాన్స్ కాస్త ఘాటుగానే ఉంది.
ఓ సాంగ్ లో విజయ్, సమంత మధ్య లిప్ లాక్ సీన్స్ వస్తాయి. అలాంటి లిప్ లాక్ సీన్స్ అవసరమా అని మీడియా ప్రతినిధులు ప్రశించగా.. దర్శకుడు శివ నిర్వాణ ఆసక్తికర సమాధానం ఇచ్చారు. మీరు అక్కడ విజయ్ దేవరకొండ, సమంత మధ్య లిప్ లాక్ అని కాకుండా విప్లవ్, ఆరాధ్య పాత్రలని మాత్రమే చూడాలి అన్నారు.
వాళ్లిద్దరూ భార్య భర్తలు. పిల్లల కోసం ప్రయత్నిస్తున్నారు అనే ఎమోషన్ కూడా ఉంది. అలాంటి వారిమధ్య చిన్నపాటి ముచ్చట కూడా లేకుంటే ఎలా అని శివ నిర్వాణ ప్రశ్నించారు. వాళ్లిద్దరూ భార్య భర్తలు అనే ఫీలింగ్ రావడం కోసం, ఆడియన్స్ నమ్మడం కోడం లిప్ లాక్ సీన్ అవసరమే అని అన్నారు.
అది కూడా లైట్ హార్టెడ్ గా పెట్టాం. పద్దతిగా ఉన్నంతవరకు ఎలాంటి సమస్య లేదు కదా అని శివ నిర్వాణ అన్నారు. ఆ సీన్స్ ని విజయ్, సమంతతో ఎలా చేయించారు అని ఓ లేడీ జర్నలిస్ట్ ప్రశ్నించింది. యాక్షన్ అంటే చేశారు.. కట్ అంటే ఆపేశారు అంటూ శివ నిర్వాణ ఫన్నీగా సమాధానం ఇచ్చారు.
ఇదిలా ఉండగా ఖుషి చిత్ర రిలీజ్ కి కొన్ని వారాల ముందే సమంత యుఎస్ వెళ్ళింది. మయోసైటిస్ చికిత్స కోసం సామ్ అక్కడికి వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని పూర్తి చేయడానికి కూడా సమంత చాలా కష్టపడింది. సమంత మయో సైటిస్ కి గురి కావడంతో కొన్ని నెలల పాటు ఖుషి షూటింగ్ ఆగిపోయింది. ఆ సమయంలో కూడా సమంత.. తన జీవితంలో ఏం జరిగిన ఖుషి చిత్రం పూర్తయ్యాకే అని చిత్ర యూనిట్ కి మాట ఇచ్చినట్లు శివ నిర్వాణ గుర్తు చేసుకున్నారు.