MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • 60 కోట్ల మోసం.. దెబ్బకు బిజినెస్ మూసేసిన స్టార్‌ హీరోయిన్‌

60 కోట్ల మోసం.. దెబ్బకు బిజినెస్ మూసేసిన స్టార్‌ హీరోయిన్‌

Shilpa Shetty: బాలీవుడ్ నటి శిల్పా శెట్టి- రాజ్ కుంద్రా దంపతులు వరుసగా వార్తల్లో నిలుస్తున్నారు. ముంబయి బాంద్రాలో ఉన్న తమ ప్రముఖ రెస్టారెంట్ ‘బాస్టియన్‌’ మూసివేయనున్నట్లు శిల్పా శెట్టి స్వయంగా ప్రకటించారు. 

2 Min read
Author : Rajesh K
Published : Sep 03 2025, 01:34 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
కేసులతో బిజినెస్ షాక్
Image Credit : instagram

కేసులతో బిజినెస్ షాక్

Shilpa Shetty-Raj Kundra:ప్రముఖ బాలీవుడ్ నటి శిల్పా శెట్టి, రాజ్ కుంద్రా దంపతులు వరుసగా వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా వీరిపై రూ. 60 కోట్లకు పైగా పెట్టుబడులను మోసం చేశారనే ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఈ స్టార్ కపుల్స్ పై కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈ వివాదాల మధ్య మరో వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశమవుతోంది. ఇంతకీ ఆ వార్తేంటీ?

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
25
శిల్పా శెట్టి సంచలన నిర్ణయం
Image Credit : instagram

శిల్పా శెట్టి సంచలన నిర్ణయం

పెట్టుబడి ఒప్పందం పేరుతో రూ.60 కోట్ల మోసం కేసు బాలీవుడ్ ను షేక్ చేసున్న నేపథ్యంతో నటి శిల్పా శెట్టి సంచలన ప్రకటన చేసింది. ముంబయి బాంద్రాలో ఉన్న తమ ప్రముఖ రెస్టారెంట్ ‘బాస్టియన్‌’ మూసివేయనున్నట్లు శిల్పా శెట్టి స్వయంగా ప్రకటించారు. సినీ కెరీర్‌తో పాటు వ్యాపార రంగంలో కూడా అడుగుపెట్టిన శిల్పా, ముంబయిలో పలు ప్రాంతాల్లో ‘బాస్టియన్‌’కి ఆరు బ్రాంచ్‌లు ప్రారంభించారు. కానీ తాజా ఆరోపణలు, కేసుల నడుమ ఈ నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశమైంది.

Related Articles

Related image1
మరో వివాదంలో Shilpa Shetty.. సమన్లు జారీ చేసిన కోర్టు.. అసలేం జరిగిందంటే..
Related image2
Shilpa Shetty : శిల్పా శెట్టికి భారీగా ఆస్తులు రాసిచ్చేసిన రాజ్ కుంద్రా..
35
శిల్పా శెట్టి ఎమోషనల్ పోస్ట్
Image Credit : Instagram

శిల్పా శెట్టి ఎమోషనల్ పోస్ట్

శిల్పా శెట్టి తన సోషల్ మీడియా పోస్ట్ లో రెస్టారెంట్ ‘బాస్టియన్‌’మూసివేత విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. “ముంబయిలో ఎంతో గుర్తింపు తెచ్చుకున్న మా రెస్టారెంట్ ‘బాస్టియన్’గురువారం తన చివరి సేవను అందిస్తుంది. ఈ ప్రదేశం అనేక మధుర జ్ఞాపకాలను అందించింది, ముంబయి నైట్ లైఫ్‌కి కొత్త గుర్తింపు నిచ్చింది. చివరిసారి ప్రత్యేక వేడుకను నిర్వహిస్తున్నాం. ఈ వేదికకు వీడ్కోలు పలకాల్సి రావడం బాధగా ఉంది. త్వరలోనే కొత్త అనుభవాలతో మీ ముందుకు వస్తాం”అని ఆమె పేర్కొన్నారు. అయితే, ఇది పూర్తిగా ముగింపు కాదని కూడా శిల్పా స్పష్టం చేశారు.

45
శిల్పా శెట్టి వ్యాపారాలు
Image Credit : instagram

శిల్పా శెట్టి వ్యాపారాలు

బాలీవుడ్ హీరోయిన్ శిల్పా శెట్టి సినీ కెరీర్‌తో పాటు వ్యాపార రంగంలో కూడా తనదైన గుర్తింపును తెచ్చుకుంది. ఆమె ‘సింపుల్ సోల్‌ఫుల్’ యాప్ ద్వారా యోగా, డైట్ ప్లాన్లు, ఫిట్‌నెస్ టిప్స్‌ను అందిస్తోంది. 

అంతేకాకుండా, ‘ఐయోసిస్ వెల్‌నెస్’ సెలూన్ చైన్‌కు కో పార్టనర్ కూడా. అలాగే.. మామాఎర్త్, వికెడ్‌గుడ్ వంటి స్టార్టప్‌లలో కూడా పెట్టుబడులు పెట్టింది. అంతేకాక, ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహిస్తూ ‘ది గ్రేట్ ఇండియన్ డైట్’ అనే పుస్తకాన్ని రచించింది.

55
రాజ్ కుంద్రా బిజినెస్ వెంచర్స్
Image Credit : social media

రాజ్ కుంద్రా బిజినెస్ వెంచర్స్

శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా కూడా విభిన్న రంగాల్లో వ్యాపారాలను విస్తరించారు. ఆయన మొదట పష్మినా షాల్స్ వ్యాపారంతో కెరీర్‌ను ప్రారంభించి, తర్వాత రియల్ ఎస్టేట్, మైనింగ్, రిన్యూవబుల్ ఎనర్జీ రంగాల్లో పెట్టుబడులు పెట్టారు. 2009లో ఐపీఎల్ జట్టు రాజస్థాన్ రాయల్స్ లోవాటా కొనుగోలు చేసి క్రీడా రంగంలో కూడా అడుగుపెట్టారు. అదేవిధంగా.. భారతదేశపు మొట్టమొదటి మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్ (MMA) ఫైటింగ్ లీగ్ కు సహ వ్యవస్థాపకుడు కూడా. అలాగే, వియాన్ ఇండస్ట్రీస్, పోకర్ రాజ్ వంటి టెక్నాలజీ అండ్ గేమింగ్ వ్యాపారాలతో కూడా సంబంధాలున్నాయి. అంతేకాదు, బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్‌తో కలిసి ‘బెస్ట్ డీల్ టీవీ’ షాపింగ్ ఛానల్ కు సహ-ప్రమోటర్‌గా వ్యవహరించారు.

About the Author

RK
Rajesh K
రాజేశ్ కారంపూరి: ఆరు సంవత్సరాలుగా ప్రముఖ ప్రింట్, డిజిటల్, వెబ్ మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రధానంగా పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, సినిమా, స్పోర్ట్స్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. ప్రస్తుతం ఏసియానెట్‌ తెలుగులో ఫ్రీలాన్సర్ గా పని చేస్తున్నారు.
వినోదం
ఏషియానెట్ న్యూస్
బాలీవుడ్

Latest Videos
Recommended Stories
Recommended image1
NTR CM: ఎన్టీఆర్‌ సీఎం అవడం పక్కా, ఆయన పార్టీలో చేరతాం.. దువ్వాడ శ్రీనివాస్‌, దివ్వెల మాధురి బోల్డ్ స్టేట్‌మెంట్‌
Recommended image2
Chiru-Venky: చిరంజీవి మూవీని కాపీ కొట్టి బ్లాక్‌ బస్టర్‌ అందుకున్న వెంకటేష్‌.. నిజాలు బయటపెట్టిన నిర్మాత
Recommended image3
Rashmika Mandanna: స్టేజ్‌పై ఆ పదం వాడిన రష్మిక, కృతికి ఫ్యూజులు ఔట్.. హీరో చేసిన పనికి నేషనల్‌ క్రష్‌ ఇబ్బంది
Related Stories
Recommended image1
మరో వివాదంలో Shilpa Shetty.. సమన్లు జారీ చేసిన కోర్టు.. అసలేం జరిగిందంటే..
Recommended image2
Shilpa Shetty : శిల్పా శెట్టికి భారీగా ఆస్తులు రాసిచ్చేసిన రాజ్ కుంద్రా..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved