ప్రముఖ బాలీవుడ్ నటి శిల్పాశెట్టి (Shilpa Shetty) మరో వివాదంలో చిక్కుకున్నారు. రుణం ఎగవేత ఆరోపణలకు సంబంధించి.. శిల్పా శెట్టితో పాటు ఆమె సోదరి షమితా శెట్టి, తల్లి సునంద శెట్టిలకు కోర్టు సమన్లు జారీ చేసింది.
ప్రముఖ బాలీవుడ్ నటి శిల్పాశెట్టి (Shilpa Shetty) మరో వివాదంలో చిక్కుకున్నారు. రుణం ఎగవేత ఆరోపణలకు సంబంధించి.. శిల్పా శెట్టితో పాటు ఆమె సోదరి షమితా శెట్టి, తల్లి సునంద శెట్టిలకు కోర్టు సమన్లు జారీ చేసింది. ఈ నెల 28న ముగ్గురు తమ ఎదుట హాజరుకావాలని కోర్టు ఆదేశించింది. వివరాలు.. ఆటోమొబైల్ ఓనర్ పర్హాద్ అమ్రా రుణం ఎగవేతకు సంబంధించి శిల్పా శెట్టి కుటుంబంపై ఫిర్యాదు చేశారు. శిల్పా శెట్టి కుటుంబానికి చెందిన కంపెనీకి తాను 2015లో రూ. 21 లక్షలు రుణాన్ని ఇచ్చినట్టుగా వ్యాపారి ఆరోపించారు. ఈ మొత్తం 2017 జనవరిలో చెల్లించాల్సి ఉందని పేర్కొన్నారు. అయితే శిల్ప తండ్రి సురేంద్ర శెట్టి మరణించిన తర్వాత ఆమె కుటుంబం రుణం తిరిగి చెల్లించడానికి నిరాకరిస్తున్నారని తెలిపాడు.
ఈ క్రమంలోనే పర్హద్ అమ్రా.. Juhu police stationలో ఫిర్యాదు చేశారు. దీంతో అంధేరీ మేజిస్ట్రేట్ కోర్టు శుక్రవారం శిల్పా శెట్టి, ఆమె తల్లి Sunanda Shetty, సోదరి Shamita Shettyలకు సమన్లు జారీ చేసింది.
అయితే గతంలో Parhad Amra చేసిన ఆరోపణలను శిల్ప శెట్టి కుటుంబం ఖండించింది. ఆ సమయంలో శిల్ప మీడియాకు ఒక ప్రకటన కూడా విడుదల చేశారు. ‘నాకు మా నాన్న వ్యాపారంలో ఎప్పుడూ ప్రమేయం లేుద. కంపెనీ ఆర్థిక లావాదేవీల గురించి నాకు అసలు తెలియదు. ఆ పెద్ద మనిషి మీడియాను తప్పుదోవ పట్టిస్తున్నాడు. మా ఫ్యామిలీ కార్ మెకానిక్ హోదాలో మాత్రమే నాకు అతను తెలుసు’ అని శిల్ప తెలిపారు.
ఇక, శిల్పా శెట్టి పేరు గత కొంతకాలంగా తరుచూ వార్తల్లో ప్రముఖంగా వినిపిస్తోంది. గతేడాది ఆమె భర్త, ప్రముఖ వ్యాపారవేత్త రాజ్ కుంద్రా పోర్నోగ్రఫీ కేసులో అరెస్టయిన సంగతి తెలిసిందే. . సినిమా అవకాశం కోసం ముంబైకి వచ్చిన పలువురు యువతులను వంచించి రాజ్‌కుంద్రా భారీగా ఆర్జించినట్లు ఆయనపై ఆరోపణలు వచ్చాయి. దీంతో ఆయన రెండు నెలల పాటు జైలులోనే ఉండాల్సి వచ్చింది. ఈ వ్యాపారంలో శిల్ప హస్తం కూడా ఉందనే కోణంలో పోలీసులు విచారించారు. అయితే దాదాపు రెండు నెలల తర్వాత ఈ కేసులో రాజ్‌కుంద్రాకు బెయిల్ లభించింది. అయితే తనపై వచ్చిన ఆరోపణలను రాజ్ కుంద్రా ఖండించారు. తన జీవితంలో పోర్న్ వీడియోల ప్రొడక్షన్, పంపినీలో ఎప్పుడూ పాల్గొనలేదని చెప్పారు.
ముద్దు కేసులో శిల్పా శెట్టికి ఊరట..
2007 రాజస్తాన్‌లో జరిగిన ఎయిడ్స్‌పై అవగాహన కార్యక్రమంలో శిల్పా శెట్టితో పాటు హలీవుడ్ నటుడు రిచర్డ్ గెరె కూడా పాల్గొన్నారు. అయితే ఆ కార్యక్రమంలో రిచర్డ్ గెరె వేదికపైనే బహిరంగా శిల్పా శెట్టికి ముద్దు పెట్టారు. ఇది అప్పట్లో తీవ్ర దుమారం రేపింది. పలు ప్రజా సంఘాలు, పార్టీలు శిల్పాకు వ్యతిరేకంగా కోర్టుకు వెళ్లాయి. ఆ తర్వాత శిల్పాశెట్టి చేసిన అభర్థనపై సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు.. కేసులను 2017లో ముంబై మేజిస్ట్రేట్ కోర్టుకు బదిలీ చేశారు. తాజాగా ముంబై మేజిస్ట్రేట్ కోర్టు తీర్పు వెలువరించింది. రిచర్డ్ చర్యలకు శిల్పనే అసలు బాధితురాలు అని కోర్టు తీర్పునిచ్చింది. సహ నటుడు ముద్దు ఇస్తుంటే అడ్డుకోనందున ఆమెను కుట్రదారు, నేరస్థురాలు అని చెప్పడానికి లేదని పేర్కొంది.
