Shilpa Shetty : శిల్పా శెట్టికి భారీగా ఆస్తులు రాసిచ్చేసిన రాజ్ కుంద్రా..

భార్య శిల్పా శెట్టికి భారీగా ఆస్తులు రాసిచ్చారు బాలీవుడ్ ప్రొడ్యూసర్ రాజ్ కుంద్రా. వరుసగా కేసులతో సతమంతం అవుతున్న ఆయన... శిల్ప శెట్టి కోసం ఆస్తులు బదలాయించారు.

Shilpa Shetty , Raj kundra Update

భార్య శిల్పా శెట్టికి భారీగా ఆస్తులు రాసిచ్చారు బాలీవుడ్ ప్రొడ్యూసర్ రాజ్ కుంద్రా. వరుసగా కేసులతో సతమంతం అవుతున్న ఆయన... శిల్ప శెట్టి కోసం ఆస్తులు బదలాయించారు.

పోర్నోగ్రఫీ మూవీస్ ను తెరకెక్కిస్తున్నట్టు ఆరోపణలు ఫేస్ చేస్తన్నారు.. బాలీవుడ్ ప్రొడ్యూసర్.. స్టార్ హీరోయిన్ శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా. ఈ కేసులో జైలుకు వెళ్లి బెయిల్ పై బయటకు వచ్చిన రాజ్ కుంద్రా కీలక నిర్ణయం ఒకటి తీసుకున్నారు. ముంబైలోని జుహూ సమీపంలో తన పేరిట ఉన్న ఖరీదైన ఆస్తులను.. తన భార్య..  బాలీవుడ్  స్టార్ యాక్ట్రస్  శిల్పాశెట్టి పేరు మీదకు మార్చేశారు. వీటి విలువ 38 కోట్లకు పైగా ఉంటుందని అంచన.

 ఈ లావాదేవీ వివరాలను జప్ కే డాట్ కామ్ జనవరి 21న వెలుగులోకి తీసుకొచ్చింది. జుహూలోని గాంధీగ్రామ్ రోడ్డులో సముద్ర తీరానికి 300 మీటర్ల దూరంలో ఈ అపార్ట్ మెంట్ ఉంది. శిల్పా శెట్టితో కలిసి  కుంద్రా  ప్రస్తుతం ఇక్కడే ఉంటున్నారు. ఇందులో మొదటి అంతుస్తులోని ఐదు ఫ్లాట్స్ రాజ్  కుంద్రా పేరుమీదే ఉన్నట్టు తెలుస్తోంది దాదాపు 5,995 చదరపు అడుగుల ఈ ప్లాట్స్ శిల్పా శెట్టి సొంతం అయినట్టు తెలుస్తోంది.

అత్యంత ఖరీదైన ఈ ప్రాంతంలో ప్రస్తుత మార్కెట్ విలువ ఒక్కో చదరపు అడుగు 65,000 వరకూ  ఉంది. ఈ లావాదేవీలో భాగంగా శిల్పాశెట్టి దాదాపు 1.9 కోట్ల స్టాంప్ డ్యూటీ చెల్లించారు. తన పేరిట ఉన్న  ఆస్తులను రాజ్ కుంద్రా భార్య పేరిట ఎందుకు మార్చారనే వివరాలు బయటకు రాలేదు. దీనికి సంబంధించి చాలా రూమర్లు బాలీవుడ్ లో చక్కర్లు కొడుతున్నాయి.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios