- Home
- Entertainment
- Manamey Review:'మనమే' ట్విట్టర్ రివ్యూ..శర్వానంద్ మాత్రం ఇరగదీశాడు, సినిమా సూపర్ హిట్టా లేక ఫట్టా ?
Manamey Review:'మనమే' ట్విట్టర్ రివ్యూ..శర్వానంద్ మాత్రం ఇరగదీశాడు, సినిమా సూపర్ హిట్టా లేక ఫట్టా ?
శర్వానంద్, కృతి శెట్టి జంటగా నటించిన మనమే చిత్రం శుక్రవారం రోజు గ్రాండ్ గా రిలీజ్ అవుతోంది. ఆల్రెడీ ప్రీమియర్ షోలు ప్రారంభం అయ్యాయి. యుఎస్ నుంచి ఆడియన్స్ ట్విట్టర్ లో తమ రెస్పాన్స్ తెలియజేస్తున్నారు.

శర్వానంద్, కృతి శెట్టి జంటగా నటించిన మనమే చిత్రం శుక్రవారం రోజు గ్రాండ్ గా రిలీజ్ అవుతోంది. ఆల్రెడీ ప్రీమియర్ షోలు ప్రారంభం అయ్యాయి. యుఎస్ నుంచి ఆడియన్స్ ట్విట్టర్ లో తమ రెస్పాన్స్ తెలియజేస్తున్నారు. యూత్ ఫుల్ అండ్ ఫ్యామిలీ ఎంటెర్టైనర్ గా డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రంలో శర్వానంద్, కృతి శెట్టి చిన్న బాబుకి తల్లిదండ్రులుగా నటిస్తున్నారు.
కృతి శెట్టి లాంటి యంగ్ బ్యూటీ, శర్వానంద్ తల్లిదండ్రులుగా నటిస్తుండడంతో ఈ చిత్రంపై ఆసక్తి పెరిగింది. దీనితో తోడు ట్రైలర్ కూడా చాలా ఎంటర్టైనింగ్ గా కట్ చేశారు. సినిమాపై పాజిటివ్ బజ్ ఏర్పడింది. శర్వానంద్ సూపర్ హిట్ అందుకోబోతున్నాడు అంటూ అంచనాలు మొదలయ్యాయి. మరి అనుకున్నట్లుగానే శర్వానంద్ హిట్ కొట్టాడా.. ట్విట్టర్ లో ఆడియన్స్ ఎలాంటి రెస్పాన్స్ ఇస్తున్నారో ఇప్పుడు చూద్దాం.
లండన్ బ్యాక్ డ్రాప్ లో ఈ చిత్ర కథ మొదలవుతుంది. శర్వానంద్ ఎనెర్జిటిక్ గా కనిపిస్తూ తన కామెడీ టైమింగ్ తో అలరిస్తున్నాడు. ఫ్యామిలీ ఆడియన్స్ ని ఆకట్టుకునే ప్రయత్నంలో ఆ దిశగా కథ సాగింది. అయితే ఎంగేజ్ చేసే అంశాలు తక్కువ. అక్కడక్కడా శర్వానంద్ కామెడీ టైమింగ్ మెప్పిస్తుంది. కొన్ని ఫన్ సన్నివేశాలు బావున్నాయి.
ఫస్ట్ హాఫ్ డీసెంట్ అనిపించే విధంగా ఉంటుంది. ఎమోషనల్ కంటెంట్ డోస్ కూడానా లిమిటెడ్ గానే ఉంది. లండన్ బ్యాక్ డ్రాప్ కాబట్టి ప్రతి సన్నివేశం రిచ్ గా కనిపిస్తుంది. ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బావున్నాయి. శర్వానంద్ తన కొడుకుతో నటించే సీన్లు అలరిస్తాయి.
డీసెంట్ ఫస్ట్ హాఫ్ తర్వాత సెకండ్ హాఫ్ లో కూడా ఎమోషనల్ సీన్స్ పండలేదు. ఎమోషనల్ గా కథ ఆడియన్స్ కి కనెక్ట్ చేయడం లో డైరెక్టర్ తడబడ్డట్లు తెలుస్తోంది. కానీ శర్వానంద్ తన ఎనెర్జిటిక్ పెర్ఫామెన్స్ తో రెగ్యులర్ గా ఫన్ జనరేట్ చేస్తూనే ఉన్నాడు. కానీ అది సరిపోలేదు.
మధ్య మధ్యలో కొన్ని బోరింగ్ సన్నివేశాలు ఉండడంతో మనమే చిత్రానికి మైనస్. ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రాన్ని దర్శకుడు ప్రేక్షుకుల అందించాలనుకున్నారు. అలాంటప్పుడు ఎమోషనల్ గా మెప్పించడం చాలా కీలకం. అది ఈ చిత్రంలో మిస్ అయింది. ఫస్ట్ హాఫ్ ఒకే కానీ.. సెకండ్ హాఫ్ తో డైరెక్టర్ ఎలాంటి ఇంపాక్ట్ ఇవ్వలేకపోయారు.
మనమే చిత్రం ఆశించిన స్థాయిలో లేదని ట్విట్టర్ లో రెస్పాన్స్ వస్తోంది. ప్రభాస్ కల్కి వచ్చే వరకు మనమే చిత్రానికి అంతగా పోటీ లేకపోవడం కలిసొచ్చే అంశం. మరి బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం పర్వాలేదనిపిస్తుందా లేక డీలా పడుతుందా అనేది వేచి చూడాలి.