- Home
- Entertainment
- శర్వానంద్ వెడ్డింగ్ రిసెప్షన్ లో తారల సందడి.. సతీసమేతంగా రాంచరణ్, నితిన్, నిఖిల్.. బ్యూటిఫుల్ పిక్స్ వైరల్
శర్వానంద్ వెడ్డింగ్ రిసెప్షన్ లో తారల సందడి.. సతీసమేతంగా రాంచరణ్, నితిన్, నిఖిల్.. బ్యూటిఫుల్ పిక్స్ వైరల్
ఎంతో గ్రాండ్ గా జరిగిన ఈ వెడ్డింగ్ రిసెప్షన్ లో శర్వానంద్, రక్షిత జంట స్టైలిష్ గా చూడ ముచ్చటగా కనిపించారు.వెడ్డింగ్ రిసెప్షన్ లో టాలీవుడ్ తారలంతా మెరిశారు. చాలా మంది హీరోలు సతీసమేతంగా హాజరయ్యారు.
- FB
- TW
- Linkdin
Follow Us
)
టాలీవుడ్ లో శర్వానంద్ నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్నాడు. ఎలాంటి ఎమోషన్ అయినా పండించగల నటుడిగా శర్వానంద్ కి గుర్తింపు ఉంది.
శర్వానంద్ చివరగా ఒకే ఒక జీవితం అనే టైం ట్రావెల్ మూవీలో నటించిన సంగతి తెలిసిందే. టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా ఉన్న శర్వానంద్ ఇటీవల జైపూర్ లో జరిగిన వివాహ వేడుకలో రక్షిత రెడ్డిని పెళ్లి చేసుకున్నారు.
మూడుముళ్ల బంధంతో ఈ జంట ఒక్కటయ్యారు. శర్వానంద్ పెళ్ళికి టాలీవుడ్ నుంచి కొందరు ప్రముఖులు, రాజకీయ నేతలు హాజరై ఆశీర్వదించారు. శర్వా బెస్ట్ ఫ్రెండ్ మెగా పవర్ స్టార్ రాంచరణ్ కూడా పెళ్లి వేడుకలో సందడి చేసిన సంగతి తెలిసిందే.
అయితే హైదరాబాద్ లో లాస్ట్ నైట్ జూన్ 9న శర్వానంద్, రక్షిత రెడ్డి రిసెప్షన్ వేడుక గ్రాండ్ గా జరిగింది. శర్వానంద్ తన రిసెప్షన్ కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ని కూడా ఆహ్వానించిన సంగతి తెలిసిందే.
ఎంతో గ్రాండ్ గా జరిగిన ఈ వెడ్డింగ్ రిసెప్షన్ లో శర్వానంద్, రక్షిత జంట స్టైలిష్ గా చూడ ముచ్చటగా కనిపించారు. శర్వానంద్ వెస్ట్రన్ స్టైల్ లో వైట్ షర్ట్, బ్లాక్ ప్యాంట్ ధరించగా.. రక్షిత రెడ్డి పింక్ కలర్ డిజైనర్ శారీలో మెరిసింది.
ఇక వెడ్డింగ్ రిసెప్షన్ లో టాలీవుడ్ తారలంతా మెరిశారు. చాలా మంది హీరోలు సతీసమేతంగా హాజరయ్యారు. రాజకీయ ప్రముఖులు కూడా శర్వా వెడ్డింగ్ రిసెప్షన్ కి హాజరు కావడం విశేషం.
హీరోలు, నిర్మాతలు, దర్శకులు, నటీమణులు ఇలా టాలీవుడ్ ప్రముఖులు శర్వా వెడ్డింగ్ రిసెప్షన్ లో సందడి చేశారు. దీనితో శర్వా, రక్షిత వెడ్డింగ్ రిసెప్షన్ కనుల పండుగలా సాగింది.
మెగా పవర్ స్టార్ రాంచరణ్ ఉపాసనతో కలసి ఈ వేడుకకి హాజరయ్యారు. ఉపాసన నిండు గర్భిణి కావడంతో ఆమెని జాగ్రత్తగా చేయి పట్టుకుని చరణ్ నడిపించుకుని వస్తున్న దృశ్యాలు ఫ్యాన్స్ ని ఎంతగానో ఆకట్టుకున్నాయి.
ఇక యంగ్ హీరోలు నితిన్, నిఖిల్, అల్లరి నరేష్ వారి వారి సతీమణులతో మెరిశారు. అలాగే స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు తన భార్య తేజస్వినితో కలసి వచ్చారు. అలాగే నందమూరి బాలకృష్ణ కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
ఇక తెలంగాణ మంత్రి కేటీఆర్ శర్వా వెడ్డింగ్ రిసెప్షన్ కి హాజరు కావడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అక్కడున్న వారంతా కేటీఆర్ తో ముచ్చటించడం, సెల్ఫీలు తీసుకోవడం చేశారు.
అక్కినేని అమల, యంగ్ బ్యూటీ రీతూ వర్మ, జీవిత రాజశేఖర్ వారి కుమార్తెలు, రానా దగ్గుబాటి, మంచు లక్షి ఇతర నటీనటులు శర్వానంద్ రిసెప్షన్ లో సందడి చేసిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.