MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Entertainment
  • శర్వా ‘మనమే’ OTT ఫ్రాడ్, అసలేం జరిగింది?

శర్వా ‘మనమే’ OTT ఫ్రాడ్, అసలేం జరిగింది?

భార్యాభర్తలు చనిపోవడంతో వాళ్ళ బాబు అనాథ అయితే ఇంకో కపుల్ ఎలా చూసుకున్నారు అనే పాయింట్..

2 Min read
Author : Surya Prakash
Published : Aug 30 2024, 09:30 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

శర్వానంద్(Sharwanand) తన 35వ సినిమాగా ‘మనమే’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో తెరకెక్కిన మనమే సినిమా నేడు జూన్ 7న థియేటర్స్ లో రిలీజయింది. ఈ సినిమాలో కృతిశెట్టి(Krithi Shetty) హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా మార్నింగ్ షో నుంచే డివైడ్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమా మామూలుగా అయితే ఓటిటిలో రిలిజ్ అయ్యేది. కానీ ఫ్రాడ్ జరగటం వలనే మనమే సినిమా ఓటీటీ రిలీజ్ ఆలస్యమవుతోంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26


ఈ నేపధ్యంలో ఈ చిత్రం ఓటిటిలో  ఎందుకు స్ట్రీమింగ్‍కు రావడం లేదనే విషయం ఇప్పటి వరకు చాలా మందిలో సందేహంగా మిగిలింది. అయితే, ఈ అంశంపై  నిర్మాత టీజీ విశ్వప్రసాద్ మాట్లాడారు. స్ట్రీమింగ్‍కు రావడం ఎందుకు ఆలస్యమవుతోందో వివరించారు.
 

36


విశ్వప్రసాద్ మాట్లాడుతూ...మనమే సినిమా నాన్ థియేట్రికల్ బిజినెస్ విషయంలో తాము మోసపోయాం. ఓ సంస్థకు తాము ఈ మూవీ నాన్ థియేట్రికల్ హక్కులు ఇచ్చామని, అయితే ఆ సంస్థ వివిధ కారణాలు చెబుతూ ఏ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍కు ఈ సినిమా హక్కులను అమ్మలేదని ఆయన తెలిపారు. దీని వల్ల తమకు భారీగా నష్టం వచ్చిందని తెలిపారు. ఈ కారణంగానే మనమే సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ ఆలస్యమవుతోంది.
 

46


అలాగే మనమే సినిమా నాన్ థియేట్రికల్ హక్కులను తీసుకున్న వ్యక్తులు తమకు డబ్బు చెల్లించలేదని నిర్మాత విశ్వప్రసాద్ వెల్లడించారు. దీని వల్ల తమకు 60 నుంచి 70 శాతం నష్టం వచ్చిందని వెల్లడించారు. ఈ మోసంపై తాము కోర్టును కూడా ఆశ్రయించామని ఆయన తెలిపారు. కేసు వేశామని అన్నారు. తాము నాన్ థియేట్రికల్ హక్కులను ఇచ్చిన వ్యక్తులు.. ఇతర సినిమాలను ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లకు అమ్ముతూ మనమే మూవీని మాత్రం హోల్డ్ చేస్తున్నారని విశ్వప్రసాద్ అన్నారు.

56


అలాగే మనమే సినిమా హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ ప్లాట్‍ఫామ్ సొంతం చేసుకున్నట్టు మొదట్లో రూమర్లు వచ్చాయి. అయితే, అసలు ఓటీటీ డీల్ జరగలేదని నిర్మాత విశ్వప్రసాద్ చెబుతున్నారు. దీంతో మనమే సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ మరింత ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

66

మనమే సినిమాకు శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహించారు. శర్వానంద్, కృతి శెట్టితో పాటు బాలనటుడు విక్రమ్ ఆదిత్య ప్రధాన పాత్ర పోషించారు. వీరి ముగ్గురి చుట్టూ ఈ మూవీ స్టోరీ సాగుతుంది. ఈ సినిమాలో రాహుల్ రవీంద్రన్, రాహుల్ రామకృష్ణ, సీరత్ కపూర్, వెన్నెల కిశోర్, శివ కందుకూరి కీరోల్స్ చేశారు. హేషమ్ అబ్దుల్ వహాబ్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ ఈ మూవీని నిర్మించారు.

About the Author

SP
Surya Prakash
తెలుగు సినిమా జర్నలిజం లో గత ఇరవై ఏళ్లుగా ఉన్నారు. కొన్ని వందల రివ్యూలు, విశ్లేషణాత్మక ఆర్టికల్స్ రాశారు. ఈయన ప్రముఖ సినీ విమర్శకుడు కూడా.
ఓటీటీ

Latest Videos
Recommended Stories
Recommended image1
Ankit Balyan: 471 మిలియన్ వ్యూస్ సాధించిన సింగర్ దారుణ హత్య.. ఎవరీ అంకిత్ బాలియాన్?
Recommended image2
Shakeela : వాళ్లు ప్రేమించింది నన్ను కాదు... జీవితంలోని చీకటి నిజాలు చెప్పిన షకీలా
Recommended image3
Ranabaali Release Date: రణబాలి మూవీ కొత్త రిలీజ్‌ డేట్‌.. విజయ్‌ దేవరకొండ, రష్మికకి అసలైన పండగ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved