MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Entertainment
  • Bigg Boss Telugu 5: సిరికి షణ్ముఖ్‌ తల్లి వార్నింగ్‌.. కూతురు రాకతో రవి కన్నీళ్లు.. మానస్‌ షాకింగ్‌ కామెంట్

Bigg Boss Telugu 5: సిరికి షణ్ముఖ్‌ తల్లి వార్నింగ్‌.. కూతురు రాకతో రవి కన్నీళ్లు.. మానస్‌ షాకింగ్‌ కామెంట్

బిగ్‌బాస్‌ తెలుగు 5వ సీజన్‌, 83వ ఎపిసోడ్‌ ఆద్యంతం ఎమోషనల్‌గా సాగింది. రవి కూతురు రాకపోతే అతని హృదయమేకాదు, ఇతర సభ్యులు సైతం ఆ తండ్రి కూతుళ్ల ప్రేమకి ఫిదా అయ్యారు. షణ్ముఖ్‌ తల్లి ఉమారాణి.. షన్నుకి,సిరికి కలిసి వార్నింగ్‌ ఇచ్చింది. ప్రియాంక సిస్టర్‌ కూడా ఆమెకి క్లాస్‌ పీకడం విశేషం. 

3 Min read
Author : Aithagoni Raju
Published : Nov 27 2021, 12:10 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

సన్నీ మదర్‌ కళావతి హౌజ్‌లో సందడి చేసే సన్నివేశాల నుంచి శుక్రవారం ఎపిసోడ్‌ ప్రారంభమైంది. 67ఏళ్ల వయసులోనే ఆమె చాలా ఎనర్జిటిక్‌గా కనిపించి అందరిని ఆశ్చర్యపరిచింది. అంతేకాదు ఆమె పుట్టిన రోజుని జరిపారు సభ్యులు. మరోవైపు సన్నీ కోసం ఎవిక్షన్‌ ఫ్రీ పాస్‌ని తీసుకొచ్చింది. సన్నీకి గిఫ్ట్ గా ఇస్తుంది. ఆమె వెళ్లిపోయిన తర్వాత ప్రియాంక సిస్టర్‌ వస్తుంది. ఆమెని గట్టిగా హగ్‌ చేసుకుని కన్నీళ్లు పెట్టుకుంది ప్రియాంక. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

ఈ సందర్భంగా ప్రియాంకకి వాళ్ల సిస్టర్‌ చాలా మంచి విషయాలు చెప్పింది. బాగా ఆడుతున్నావని, బాగా కనిపిస్తున్నావని, టాప్‌లో ఉండటం గ్రేట్‌ అంటూ ప్రశంసించింది. అదే సమయంలో గేమ్‌లో డీవియేట్‌ అవుతున్నావని, నీ గేమ్‌ నువ్వు ఆడాలని చెప్పింది. పరోక్షంగా మానస్‌ విషయంలో అతిగా ప్రవర్తించడాన్ని ఆమె ప్రియాంకకి కన్వే చేసే ప్రయత్నం చేసింది. డీవియేట్‌ అవుతున్నావని తెలిపింది. నువ్వు గెలిస్తే చరిత్ర అని డాడీ చెప్పినట్టు ప్రియాంకకి చెప్పింది వాళ్ల సిస్టర్‌. ఆమె సన్నీకి పెద్ద అభిమానిని అని తెలిపింది.
 

38

అంతకు ముందే మానస్‌, కాజల్‌ మధ్య ప్రియాంకకి సంబంధించిన డిస్కషన్‌ జరిగింది. ప్రియాంక తనకు చాలా అబద్దాలు చెప్పిందని, తన పాత బాయ్‌ ఫ్రెండ్‌ని నాతో రీప్లేస్‌ చేయాలనుకుంటుందని కాజల్‌తో షాకింగ్‌ కామెంట్‌ చేశాడు మానస్‌. అయితే తాను మాత్రం ఆమెకి నో చెప్పానని, తాను చెప్పేది అన్నీ వింటుందని, అన్ని విని చివరికి ఏదో అని వెళ్లిపోతుందని తెలిపారు మానస్‌ తెలిపారు. మానస్‌ చెప్పిన విషయాలకు కాజల్‌ సైతం షాక్‌కి గురవుతుంది. 

48

అనంతరం రవి వైఫ్‌ నీతూ వచ్చింది. రవి ఫ్రీజ్‌లో ఉన్న సమయంలో వచ్చి ఆయన్ని ముద్దు పెట్టుకుంది. ఇన్నాళ్లు దాచుకున్న ప్రేమ తెలియజేసింది. భార్యని చూసి రవి సైతం ఎమోషనల్‌ అయిపోయాడు. అయితే కూతురు రాకపోవడంతో తల్లడిల్లిపోయాడు. రవిని చాలా దూరమవుతున్నానని ఆమె ఎమోషనల్‌ అయ్యింది. బాగా ఆడుతున్నావని చెప్పింది. పర్సనల్‌ కబుర్లు చెప్పుకున్నారు. 

58

అయితే రవి కూతురు విషయంలో కాసేపు సస్పెన్స్ లో పెట్టిన బిగ్‌బాస్‌ తర్వాత తన కూతురుని హౌజ్‌లోకి పంపించాడు. కూతురు అరుపుతో ఆగలేక గేట్‌ వద్దకి పరిగెత్తుకుంటూ వచ్చాడు రవి. హగ్‌ చేసుకుని ముద్దులు పెట్టాడు. ఈ సందర్భంగా తండ్రి కూతుళ్ల మధ్య ప్రేమ అందరిని హృదయాలను తాకింది. అందరిని కదిలించింది. రవి తన కూతురుతో కాసేపు గార్డెన్‌లోనూ ఆడుకున్నారు. చివరగా `డాడీ` సినిమాలోని చిన్నారి చిన్నారి పాటతో వారి మధ్య ఎమోషన్‌ని, ప్రేమని పీక్‌లోకి తీసుకెళ్లాడు బిగ్‌బాస్‌. 
 

68

చివరగా షణ్ముఖ్‌ తల్లి ఉమారాణి వచ్చారు. యోగక్షేమాలు మాట్లాడుకున్నారు. బాగా ఆడుతున్నావని, `బ్రహ్మా`గా పిలిపించుకున్నందుకు చాలా సంతోషంగా ఉందని చెప్పింది షన్ను తల్లి. అదే సమయంలో గట్టిగా క్లాస్‌ పీకడంతోపాటు వార్నింగ్‌ కూడా ఇచ్చింది. దీప్తిసునైనా గురించి అడిగాడు షణ్ముఖ్‌. అందుకు బాగుందని, ఆమెని కలిశానని, బాగా సపోర్ట్ చేస్తుందని తెలిపింది. ఆమెని కలిసినట్టు వెల్లడించింది. కలిస్తే ఏంటీ? అంటూ ప్రశ్నించింది. అయితే అమ్మ చెప్పింది నిజమేనా అంటూ ఏకంగా ఒట్టు వేయించుకున్నాడు షణ్ముఖ్‌. 

78

ఈ సందర్భంగా ఎప్పుడూ ఒకే రూమ్‌లో, ఒకరితోనే ఉండోద్దని చెప్పింది షన్ను తల్లి ఉమారాణి. ఎక్కువ ఆలోచిస్తున్నావని, అలా చేయోద్దని చెప్పింది. షన్ను ఇలా అయిపోతున్నాడేంటి? తాను బాధపడినట్టు తెలిపింది. ఆ విషయంలో ఇప్పుడు బయటపడ్డామని, బాగానే ఉన్నట్టు తెలిపాడు షణ్ముఖ్‌. అయితే సిరి ఆ సమయంలోనే దగ్గరికి రాగానే బాగా గేమ్‌ ఆడండి, ఎవరి గేమ్‌ వాళ్లు ఆడండి. ఎందుకు ఊరికే ఎమోషనల్‌ అయిపోతున్నారని క్లాస్‌ పీకింది. వాళ్లకి వార్నింగ్‌ ఇచ్చింది. ఇండైరెక్ట్ గా వీరిద్దరు చేసే పనులను ఆమె ప్రస్తావించి హెచ్చరించింది. గేమ్‌ పైనే ఫోకస్‌ చేయాలని చెప్పింది. ఇలా శుక్రవారం ఎపిసోడ్‌ ఆద్యంతం ఎమోషనల్‌గా ఫన్నీగా సాగిందని చెప్పొచ్చు. 
 

88

ప్రస్తుతం హౌజ్‌లో షణ్ముఖ్‌, రవి, మానస్‌, సన్నీ, శ్రీరామ్‌చంద్ర, ప్రియాంక, కాజల్‌, సిరి ఉన్నారు. వీరిలో మానస్‌ తప్ప అందరు నామినేషన్‌లో ఉన్నారు. రేపు ఎవరు ఎలిమినేట్‌ అవుతారనేది ఉత్కంట భరితంగా మారింది. ప్రియాంక, కాజల్‌లో ఒకరు ఎలిమినేట్‌ అయ్యే ఛాన్స్ ఉందనే టాక్‌ వినిపిస్తుంది.

also read: Bigg boss telusu 5: బిగ్ బాస్ లీక్... గుండెలు పిండేయనున్న ఈ వారం ఎలిమినేషన్, కన్నీరు ఆపుకోలేరు!
 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
R Madhavan: 'నువ్వు అహంకారిగా ఉండాలి'.. కొడుక్కి మాధవన్ ఎందుకలా సలహా ఇచ్చాడు?
Recommended image2
Namitha: తాళి, బొట్టు ఆడవాళ్లకేనా? మగవాళ్లకు ఎందుకు లేవు?.. దుమారం రేపుతున్న నమిత కామెంట్స్
Recommended image3
Chaitra Rai Remuneration: ఐదు రోజులకు చైత్ర రాయ్‌ ఎంత పారితోషికం అందుకుందో తెలుసా?.. ఆ భ్రమలకు ఫుల్‌ స్టాప్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved