- Home
- Entertainment
- Shanmukh: దీప్తి సునైనాతో బ్రేకప్.. కొత్త అమ్మాయిని పరిచయం చేసిన షణ్ముఖ్,త్వరలో పెళ్లి
Shanmukh: దీప్తి సునైనాతో బ్రేకప్.. కొత్త అమ్మాయిని పరిచయం చేసిన షణ్ముఖ్,త్వరలో పెళ్లి
Shanmukh: యూట్యూబ్ తో కెరీర్ మొదలుపెట్టి.. వెబ్ సిరీస్ లతో అందరినీ ఆకట్టుకొని సినిమాల్లో అడుగుపెట్టిన షణ్ముఖ్ జశ్వంత్ తన కొత్త ప్రియురాలిని పరిచయం చేశాడు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.

షణ్ముఖ్ జశ్వంత్..
షణ్ముఖ్ జశ్వంత్... ఈ పేరుకు పరిచయం అవసరం లేదు. యూట్యూబ్ లో చిన్న చిన్న వీడియోలతో మొదలుపెట్టి, తన డ్యాన్స్ లు, వెబ్ సిరీస్ లతో బాగా ఫేమస్ అయ్యాడు. షణ్ముఖ్ కి సోషల్ మీడియాలో చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.ఇక.. షణ్ముఖ్ పేరు వినపడగానే.. వెంటనే దీప్తి సునైనా పేరు కూడా వినపడుతుంది.వీరిద్దరూ కలిసి చాలా డ్యాన్స్ వీడియోలు చేశారు. వీరి జంటకు కూడా విపరీతమైన క్రేజ్ ఉంది.
దీప్తి సునైనాతో బ్రేకప్..
వీరిద్దరూ చాలా సంవత్సరాలపాటు రిలేషన్ లో ఉన్నారు. ఇద్దరూ కలిసి స్పెషల్ గా టాటూలు కూడా వేయించుకున్నారు. కానీ ఆ తర్వాత కొన్ని మనస్పర్థల కారణంగా విడిపోయారు. తామిద్దరం విడిపోయాం అంటూ సోషల్ మీడియాలో అధికారికంగా ప్రకటించారు. షన్ను తనకు ఉన్న క్రేజ్ తో బిగ్ బాస్ లో అడుగుపెట్టాడు.విన్నర్ అవ్వాల్సిన వాడు రన్నరప్ గా నిలిచాడు. అయితే.. అక్కడి అతని ప్రవర్తన నచ్చక.. దీప్తి సునైనా బ్రేకప్ చెప్పినట్లు ప్రచారం జరిగింది. అయితే.. ఈ జంట మళ్లీ కలవాలని వారి అభిమానులు చాలా గట్టిగానే కోరుకున్నారు. కానీ, అది జరగలేదు. ఇద్దరూ తమ కెరీర్ మీద ఫోకస్ పెట్టారు.
రెండో ప్రయాణం..
మళ్లీ ఈ జంట ఎప్పటికైనా కలుస్తారని వారి అభిమానులు ఎదురు చూశారు. కానీ.. సడెన్ గా షణ్ముఖ్ ట్విస్ట్ ఇచ్చాడు. నిజంగానే.. దీప్తితో బ్రేకప్ నుంచి బయటపడినట్లు ప్రకటించాడు. మరో అమ్మాయితో తన రెండో ప్రయాణం మొదలైందని చెప్పాడు. తాను మరో అమ్మాయితో రిలేషన్ లో ఉన్నట్లు ఫోటోలు షేర్ చేశాడు. ఆ అమ్మాయి పేరు చెప్పలేదు.. ఆమె ఫేస్ కూడా ఫోటోలో క్లియర్ గా కనిపించకుండా జాగ్రత్త పడ్డాడు. ఆమె పుట్టిన రోజు సందర్భంగా.. తమ ప్రేమను కన్ఫామ్ చేశాడు. త్వరలోనే వీరిద్దరూ పెళ్లి కూడా చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. షణ్ముఖ్ ఇది ప్రకటించగానే... అభిమానులంతా శుభాకాంక్షలు తెలియజేశారు.
సినిమాలతో బిజీ..
దీప్తితో బ్రేకప్ అయిన తర్వాత షణ్ముఖ్ చాలా కాలం డిప్రెషనల్ లోకి వెళ్లిపోయాడు.కానీ, తర్వాతర్వాత దాని నుంచి బయటపడ్డాడు.ఇప్పుడు హీరోగా సినిమాలు కూడా చేస్తున్నాడు. ఓటీటీలో లీలా వినోదం అనే సినిమా చేశాడు. ఆ సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇప్పుడు ప్రేమకు నమస్కారం అనే సినిమా చేస్తున్నాడు. రీసెంట్ గా టీజర్ విడుదల చేయగా, విపరీతంగా ఆకట్టుకుంది. త్వరలోనే సిల్వర్ స్క్రీన్ పై ఈ సినిమా విడుదల కానుంది. శివాజీ, బ్రహ్మాజీ లాంటి హేమాహేమీలతో కలిసి షణ్ముఖ్ ఈ మూవీలో తెర పంచుకోవడం విశేషం.

