- Home
- Entertainment
- Shanmukh :దీప్తి తో బ్రేకప్... మరో యూట్యూబ్ స్టార్ తో పాటు షణ్ముఖ్ కొత్త ఇంటి గృహప్రవేశం, ఫోటోలు వైరల్
Shanmukh :దీప్తి తో బ్రేకప్... మరో యూట్యూబ్ స్టార్ తో పాటు షణ్ముఖ్ కొత్త ఇంటి గృహప్రవేశం, ఫోటోలు వైరల్
బిగ్ బాస్ ఫేమ్ షణ్ముఖ్ జస్వంత్(Shanmukh Jaswanth) హైదరాబాద్ కొత్త ఇల్లు కొన్నారు. సొంతింటి కల నెరవేర్చుకున్నారు. షణ్ముఖ్ గృహప్రవేశం చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

తాజాగా షణ్ముక్ హైదరాబాద్‌లో ఓ కొత్త ఇల్లు కొనుకున్నాడు.దీనికి సంబంధించి గృహప్రవేశాన్ని సైతం పూర్తి చేశాడు. నటి, చాయ్ బిస్కెట్ ఫేం శ్రీ విద్యతో కలిసి కొత్త ఇంట్లోకి అడుగుపెట్టాడు.
బిగ్ బాస్ సీజన్ 5 రన్నర్ గా నిలిచాడు షణ్ముఖ్ జస్వంత్. ఈ షో ద్వారా మంచి పాపులారిటీ తెచ్చుకున్న షణ్ముఖ్ యధావిధంగా యూట్యూబ్ వీడియోలతో రెచ్చిపోతున్నారు. ఇక దీప్తి సునైనతో షణ్ముఖ్ బ్రేకప్ తర్వాత వార్తలలో నిలిచారు.
బిగ్ బాస్ హౌస్ లో తన తోటి కంటెస్టెంట్ సిరి హన్మంత్ తో షణ్ముఖ్ రొమాన్స్ నడిపారు. స్నేహితులం అంటూ శృతి మించి ప్రవర్తించారు. షణ్ముఖ్-సిరి రిలేషన్ వివాదాస్పదమైంది. వీరిద్దరూ ఒకరిపై మరొకరు అమిత ప్రేమ చూపించుకున్నారు. చివరకు గేమ్ కూడా వదిలేశారు. బిగ్ బాస్ టైటిల్ కోల్పవడం వెనుక అసలు కారణం కూడా ఇదే.
షణ్ముఖ్-దీప్తి (Deepthi Sunaina) బ్రేకప్ వెనుక అసలు కారణం ఏదైనా కానీ సిరి కారణమంటూ అందరూ కోడైకూశారు. ఇక బ్రేకప్ తర్వాత ఇద్దరూ సోషల్ మీడియాలో పరోక్షంగా పోస్ట్లు పెట్టుకుంటున్నారు. ముఖ్యంగా దీప్తి షణ్ముఖ్ పై కొటేషన్స్ విసురుతుంది. ఇక షణ్ముఖ్ మై లవ్ ఈజ్ గాన్ అంటూ... ఏకంగా సాంగ్స్ కి స్టెప్స్ వేసి ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తున్నారు.
ఇక కీలకమైన తన కొత్త ఇంటి గృహప్రవేశంలో ఊహించినట్లే దీప్తి కనిపించలేదు. అదే సమయంలో చాయ్ బిస్కెట్ ఫేమ్ శ్రీవిద్యతో కలిసి నూతన గృహ ప్రవేశం చేశాడు. శ్రీవిద్య షణ్ముఖ్ కలిసి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. షణ్ముఖ్ శ్రీదివ్యకు అంత ప్రాధాన్యత ఇవ్వడం విశేషత సంతరించుకుంది.
అన్నీ బాగుంటే శ్రీదివ్య ప్లేస్ లో దీప్తి ఉండేది. ఐదేళ్లు ప్రేమించుకున్న దీప్తి-షణ్ముఖ్ విడిపోతారని ఎవరూ ఊహించలేదు. అయితే అది జరిగింది. బ్రేకప్ తర్వాత ఇద్దరూ తమ తమ కెరీర్స్ పై ఫోకస్ పెడుతున్నారు.