రామ్ చరణ్ ఫ్యాన్స్ కోపానికి దిగొచ్చిన శంకర్.. గేమ్ ఛేంజర్ నుంచి సాలిడ్ అప్ డేట్ ? అభిమానులు శాంతిస్తారా?
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఫ్యాన్స్ కోపానికి గేమ్ ఛేంజర్ టీమ్ దిగివచ్చింది. సాలిడ్ అప్ డేట్ ఇవ్వడానికి రెడీ అవుతున్నారు. ఈనెలలోనే ఈసినిమా నుంచి సెకండ్ సింగిల్ రాబోతోంది.
మెగాపవర్ స్టార్ రాంచరణ్ నటిస్తున్న 'గేమ్ ఛేంజర్' సినిమా నుంచి అప్డేట్ వచ్చింది. ఈ సినిమా సెకండ్ సింగిల్‌ను ఈనెలలోనే రిలీజ్ చేస్తామని టీమ్ అఫీషియల్ గా రిలీజ్ చేసింది. రామ్ చరణ్ డాన్స్ చేస్తున్నట్టు ఉన్న ఓ పోస్టర్‌ను కూడా ఈ సందర్భంగా విడుదల చేశారు. ఈ పోస్టర్ లో చరణ్ తలకి ఎర్ర కండువా కట్టుకుని కనిపించారు.
ఇప్పటికే ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ గతంలో రిలీజ్ చేశారు. ఈనెలలో రెండు సాంగ్ ను రిలీజ్ చేయబోతున్నారు. రెండో సాంగ్ కోసం రాంచరణ్ ఫ్యాన్స్ చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు. చాలా కాలంగా గేమ్ ఛేంజర్ నుంచి ఎటువంటి అప్ డేట్ ఇవ్వలేదు. దాంతో చరణ్ ఫ్యాన్స్ కోపంగా ఉన్నారు.
బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 అప్ డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Game Changer 2
ఈసినిమా స్టార్ట్ అయ్యి మూడేళ్ళకకు పైనే అవుతుంది. కాని ఇంత వరకూ షూటింగ్ కంప్లీట్ అవ్వకపోవడంతో.. చరణ్ ఫ్యాన్స్ మండి పడుతున్నారు. మధ్యలో ఈసినిమా దర్శకుడు శంకర్ కమల్ హాసన్ భారతీయుడు 2 సినిమా కోసం చరణ్ సినిమాను నిర్లక్ష్యం చేశాడు అని మొదటి నుంచి మండిపడుతూ వచ్చారు.
ఇండియన్2 రిలీజ్ అయ్యి ప్లాప్ అయిన తరువాత కూడా రామ్ చరణ్ మూవీపై జాగ్రత్తలు పాటించడంలేదు అనికూడా ప్యాన్స్ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇక గేమ్ ఛేంజర్ మూవీ రిలీజ్ తరువాత సంగతి.. మూవీకి సబంధించి ఏ అప్డేట్ ఇవ్వక పోవడంపై కూడా గుస్సాగా ఉన్నారు మెగా అభిమానులు.
సర్వేపల్లి రాధాకృష్ణన్ తో ఉన్న ఈ స్టార్ హీరోను గుర్తుపట్టారా..? ఎవరో తెలిస్తే షాక్ అవుతారు..
గతంలో కూడా మూవీ టీమ్ పై ఇలాగే ప్రెజర్ తెస్తే.. ఏవో పోస్టర్లతో పాటు.. ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేశారు గేమం చేంజర్ టీమ్. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలై 'జరగండి' సాంగ్ పెద్దగా ప్రభావం చూపించలేకపోయింది. తొలి సాంగ్ పై ఫ్యాన్స్ నుంచే విమర్షలు వచ్చాయి. మూవీ ఎలా ఉంటుందా అని అంతా టెన్షన్ పడుతున్నారు.
వర్షం సినిమాలో హీరో ప్రభాస్ కాదా..? ఈ సినిమా మిస్ అయిన స్టార్ హీరో ఎవరంటే..?
ఈక్రమంలో అప్పుడప్పుడు అన్నా గేమ్ ఛేంజర్ నుంచి ఏదో ఒక అప్ డేట్ ఇవ్వాలని.. అసలు ఏం జరుగుతుందో తెలియకుండా ఉందని ఫ్యాన్స్ చేస్తున్న ఒత్తిడికి దిగి వచ్చింది శంకర్ టీమ్. గేమ్ ఛేంజర్ నుంచి వరుస అప్ డేట్స్ ను ఫ్లాన్ చేస్తున్నారు. ఈక్రమంలోనే గేమ్ చేంజర్ నుంచి సెకండ్ సింగ్ కు రెడీ అవుతున్నారు.
ఫస్ట్ సింగిల్ ఎలా ఉన్నా.. సెకండ్ సింగిల్‌ను మాత్రం భారీ స్థాయిలో ప్లాన్ చేశారు. దర్శకుడు శంకర్ ఆధ్వర్యంలో వస్తున్నీఈ మూవీలో బాలీవుడ్ స్టార్ కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నాడు. గేమ్ ఛేంజర్ సినిమాను ఈ ఏడాది క్రిస్మస్ కానుకగా విడుదల చేస్తామని వెంకటేశ్వర క్రియేషన్స్ ప్రకటించింది.
కల్కి సినిమాలో అమితాబ్ డూప్ గా నటించింది ఎవరు..? తెలిస్తే షాక్ అవుతారు
Game Changer Movie
ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఆర్‌ఆర్‌ఆర్ తర్వాత రాబోతున్న సినిమా కావడంతో వస్తున్న గేమ్ ఛేంజర్ ద్వారా మరో భారీ హిట్ కొట్టాలని రాంచరణ్ చూస్తున్నారు. శంకర్, కమల్ హాసన్ జోడిగా వచ్చిన భారతీయుడు-2 సినిమా ఫ్లాప్ కావడంతో శంకర్ కూడా ఈ సినిమాపై మరింత దృష్టి పెట్టారు. అయితే త్వరలోనే సెకండ్ సింగిల్ వస్తుందన్న వార్తలతో మెగా ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.