వెంకటేష్‌కి ఇది అవమానమే.. `సైంధవ్` టీమ్ ఇలా చేశారేంటి? పాన్ ఇండియా పరువు తీసేశారే?
విక్టరీ వెంకటేష్.. ఈ సంక్రాంతికి `సైంధవ్` చిత్రంతో వచ్చారు. ఈ మూవీ డిజాస్టర్ అయ్యింది. కానీ ఇది వెంకటేష్‌కి తీరని అవమానంగానే మిగిలింది. ఇంతకి ఏం జరిగిందంటే?
వెంకటేష్.. ఫ్యామిలీ హీరోగా తెలుగు చిత్ర పరిశ్రమలో ముద్ర వేసుకున్నారు. కామెడీ, ఫ్యామిలీ ఎమోషన్స్ ఆయన బలం. మధ్యలో కొన్ని యాక్షన్ సినిమాలు కూడా చేసి మెప్పించారు. కానీ ఫ్యామిలీ ఎమోషన్స్ ని మిస్ కాకుండా చూసుకున్నారు. అదేసమయంలో వెంకటేష్ అంటే రీమేక్‌లకు కేరాఫ్. చాలా వరకు ఆయన రీమేక్ చిత్రాలతోనే విజయాలు అందుకున్నారు. కానీ ఇటీవల ఆయనకు విజయాలు దోబూచులాడుతున్నాయి. సరైన హిట్ పడటం లేదు.
వెంకటేష్ చివరగా `ఎఫ్2`తో సక్సెస్ అందుకున్నారు. కానీ ఆ తర్వాత సక్సెస్ రాలేదు. `నారప్ప`, `వెంకీమామ`, `దృశ్యం2`, `ఎఫ్3` చిత్రాలు పెద్దగా ఆడలేదు. ఈ నేపథ్యంలో వెంకీ తాజాగా ఈ సంక్రాంతికి `సైంధవ్` చిత్రంతో వచ్చారు. `హిట్` ఫేమ్ శైలేష్ కొలను రూపొందించిన చిత్రమిది. బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టింది. డిజాస్టర్‌గా నిలిచింది. ఈ మూవీ కనీసం పది కోట్ల షేర్ కూడా రాబట్టలేకపోయింది. చాలా వరకు ఈ మూవీ రాంగ్ టైమింగ్ అన్నారు. సంక్రాంతికి యాక్షన్ మూవీ ఆడియెన్స్ రిసీవ్ చేసుకోలేదని అన్నారు. అంతేకాదు కంటెంట్ పరంగానూ ఇందులో మ్యాటర్ లేదని చెబుతున్నారు. మొత్తంగా ఈ సినిమా పెద్ద పరాజయం చెందింది.
ఇదిలా ఉంటే ఇందులో వెంకటేష్‌కి ఒక పెద్ద అవమానం జరిగిందనే టాక్ నడుస్తుంది. `సైంధవ్` సినిమాని ప్రారంభం నుంచి పాన్ ఇండియా చిత్రంగా ప్రమోట్ చేశారు. తెలుగుతోపాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీలోనూ రిలీజ్ చేస్తామని ప్రకటించారు. గ్లింప్స్, టీజర్, ట్రైలర్‌లోనూ ఆ విషయాలను ప్రకటించారు. కానీ తీరా ఈ మూవీ పాన్ ఇండియాగా విడుదల కాలేదు. జస్ట్ తెలుగులోనే రిలీజ్ అయ్యింది. పాన్ ఇండియా రిలీజ్ కాలేదు.
సినిమా కంటెంట్‌పై వాళ్లకి నమ్మకం లేకపోవడంతోనే పాన్ ఇండియాకి వెళ్లలేదా? అనే డౌట్ వస్తుంది. నార్త్ లో సినిమా రిలీజ్ కావాలంటే ఓటీటీ కమిట్ మెంట్లు క్లారిటీగా ఉండాలి. సినిమా విడుదలైన పది వారాల తర్వాతనే ఓటీటీలో రావాలి. అప్పుడే నార్త్ లో విడుదల చేయాల్సి ఉంటుంది. ఆ విషయంలో తేడా వచ్చి అక్కడ ఆపేశారా? అనే సందేహం కలుగుతుంది. నార్త్ కి అది సమస్య అయితే సౌత్ లో ఎందుకు రిలీజ్ కాలేదనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న.
కేవలం సినిమా ప్రచారం కోసమే `పాన్ ఇండియా` అనే పేరుని వాడుకున్నారా? అని అంటున్నారు నెటిజన్లు. ఇటీవల చాలా సినిమాలు ముందుగా పాన్ ఇండియా ప్రకటించి తర్వాత రిలీజ్ టైమ్‌కి లైట్ తీసుకుంటున్నారు. దీంతో పాన్ ఇండియా సినిమా అనే దానికి వ్యాల్యూ లేకుండా పోతుంది. చిన్న సినిమాల విషయంలో అలా జరిగిందంటే ఓకే, కానీ పెద్ద స్టార్ వెంకటేష్ సినిమాకి అలాంటి పరిస్థితి ఎదురు కావడమే ఇప్పుడు చర్చనీయాంశం అవుతుంది. ఇది వెంకీకి అవమానమే అంటున్నారు. `సైంధవ్` మేకర్స్ చేసిన పనికి వెంకీ బలి కావస్తుంది.
మరి ఇలాంటి సంఘటనలను చూసైనా ఇతర హీరోలు జాగ్రత్త పడితే బాగుంటుంది. లేదంటే పాన్ ఇండియా అనే పదానికే విలువ లేకుండా అవుతుంది. ఇక వెంకటేష్ హీరోగా నటించిన `సైంధవ్`లో శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్‌గా నటించింది. ఆండ్రియా, రుహానీ శర్మ, ఆర్య కీలక పాత్రలు పోషించారు. నవాజుద్దీన్ సిద్ధిఖీ విలన్‌గా నటించాడు. దాదాపు 25కోట్ల బిజినెస్‌తో విడుదలైన ఈ మూవీ కనీసం పది కోట్లు షేర్ కూడా రాబట్టలేకపోయింది. ఆల్మోస్ట్ చాలా థియేటర్ల నుంచి సినిమాని ఎత్తేసిన పరిస్థితి. వెంకీ సైతం మున్ముందు తన సినిమాల విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది.