- Home
- Entertainment
- చనువుగా ఉండు, బెడ్ షేర్ చేసుకో.. ఆఫర్స్ కోసం ఇలాంటివి తప్పవు, 41 ఏళ్ల బోల్డ్ బ్యూటీ సంచలన వ్యాఖ్యలు
చనువుగా ఉండు, బెడ్ షేర్ చేసుకో.. ఆఫర్స్ కోసం ఇలాంటివి తప్పవు, 41 ఏళ్ల బోల్డ్ బ్యూటీ సంచలన వ్యాఖ్యలు
చిత్ర పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ గురించి చర్చ ఎప్పుడూ జరుగుతూ ఉండేదే. మీటూ ఉద్యమం మొదలైన తర్వాత నటీమణులు తమకి ఎదురైన వేధింపులని బయట పెట్టడం ప్రారంభించారు.

చిత్ర పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ గురించి చర్చ ఎప్పుడూ జరుగుతూ ఉండేదే. మీటూ ఉద్యమం మొదలైన తర్వాత నటీమణులు తమకి ఎదురైన వేధింపులని బయట పెట్టడం ప్రారంభించారు. తాజాగా బాలీవుడ్ బోల్డ్ బ్యూటీ షమా సికిందర్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.
కాస్టింగ్ కౌచ్ విషయంలో తనకి ఎదురైన అనుభవాలని షమా తాజాగా ఇంటర్వ్యూలో బయట పెట్టారు. అయితే గతంలో కంటే ఇప్పుడు పరిస్థితి మెరుగైందని అన్నారు. అలాగని కాస్టింగ్ కౌచ్ పూర్తిగా తొలగిపోలేదు అని షమా సికిందర్ పేర్కొంది. గతంలో తాను అవకాశాల కోసం కమిట్మెంట్ తప్పనిసరిగా ఉండేది. ఆలాగైతేనే అవకాశాలు ఇచ్చేవారు.
అప్పట్లో పేరున్న కొందరు దర్శకులు, నిర్మాతలు తన దగ్గరకి వచ్చి చనువుగా ఉండాలని కోరేవారు. దాని అర్థం ఏంటో తెలియలేదు. కొన్నిసార్లు డైరెక్ట్ గానే బెడ్ షేర్ చేసుకోవాలని అడిగేసేవారు. ఇలా చేస్తేనే తమ ప్రాజెక్ట్స్ లో ఆఫర్స్ ఇస్తామని చెప్పేవారు.
నేను పనిచేయని దర్శక నిర్మాతలు కూడా తమతో చనువుగా ఉండాలని అడిగేవారు. మీతో నాకు చనువు ఎందుకు.. మనం కలసి పనిచేయట్లేదు కదా అని అడిగితే.. ఇలాగైతేనే నీకు ఆఫర్స్ వస్తాయి.. లేకుంటే రావు అని బెదిరించేవాళ్ళు. అందుకే గతంలో నటీమణులకు దర్శక నిర్మాతల విషయంలో చాలా భయాలు ఉండేవి అని షమా పేర్కొంది.
కానీ ఇప్పుడు పరిస్థితి మెరుగైంది. ఇప్పుడున్న యువ దర్శకులు నటీమణులకు గౌరవం ఇస్తున్నారు. పూర్తిగా అయితే కాస్టింగ్ కౌచ్ అంతం కాలేదు అని షమా పేర్కొంది. షమా కామెంట్స్ ప్రస్తుతం బాలీవుడ్ లో దుమారం రేపుతున్నాయి. ఇదిలా ఉండగా ఇంస్టాగ్రామ్ లో షమా సికిందర్ ఎంతటి సెన్సేషనల్ బ్యూటీలో అందరికి తెలుసు.
బికినీ ఫోటో షూట్స్ లో షమా చేసే హంగామా అంతా ఇంతా కాదు. కవ్వించే హాట్ స్టిల్స్ తో తరచుగా దుమారం రేపుతూనే ఉంటుంది. ఎప్పుడూ తడి సోకులు ఆరబోస్తూ కుర్రాలకి విజువల్ ట్రీట్ ఇస్తోంది. 41 ఏళ్ల వయసులో కూడా షమా ఉడికించే ఫోజులు ఇస్తూ రెచ్చగొడుతోంది.