- Home
- Entertainment
- బ్లాక్ అవుట్ ఫిట్ లో షాలినీ పాండే మైండ్ బ్లోయింగ్ స్టిల్స్.. గ్లామర్ షోలో అదరగొడుతున్న నార్త్ బ్యూటీ..
బ్లాక్ అవుట్ ఫిట్ లో షాలినీ పాండే మైండ్ బ్లోయింగ్ స్టిల్స్.. గ్లామర్ షోలో అదరగొడుతున్న నార్త్ బ్యూటీ..
తొలి సినిమాతోనే సెన్సేషన్ క్రియేట్ చేసిన హీరోయిన్ షాలినీ పాండే (Shalini Pandey). ఇటు సోషల్ మీడియాలోనూ అదిరిపోయే ఫొటోషూట్లతో మైండ్ బ్లాక్ చేస్తోంది. లేటెస్ట్ గా ఈ బ్యూటీ షేర్ పిక్స్ నెటిజన్లను అట్రాక్ట్ చేస్తున్నాయి.

నార్త్ బ్యూటీ షాలినీ పాండే కేరీర్ హీరోయిన్ గా టాలీవుడ్ తోనే ప్రారంభించింది. తొలి సినిమా‘అర్జున్ రెడ్డి’తో తెలుగు ఆడియెన్స్ ను పలకరించింది. ఈ మూవీ క్రియేట్ చేసిన సెన్సేషన్ అంతా ఇంతా కాదు. బ్లాక్ బాస్టర్ హిట్ గా నిలవడంతో అటు విజయ్ దేవరకొండతో పాటు.. ఇటు షాలినీ పాండేకు మంచి గుర్తింపు వచ్చింది.
తెలుగు సినిమాతో సాలిడ్ హిట్ అందుకున్న షాలినీ పాండే ఆ తర్వాత తెలుగు తో పాటు తమిళంలో మంచి ఆఫర్లను అందుకుంది. ప్రస్తుతం బాలీవుడ్, కోలీవుడ్ లోనే ఈ బ్యూటీ నటిస్తూ ఆడియెన్స్ ను అలరిస్తోంది. స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంటూ కేరీర్ లో దూసుకుపోతోంది.
అయితే ఈ నార్త్ బ్యూటీ సోషల్ మీడియాలో తన క్రేజ్ పెంచుకునేందుకు హాట్ ఫొటోషూట్లు చేస్తోంది. ట్రెండీ అవుట్ ఫిట్స్ లో మతిపోగొడుతోంది. అదిరిపోయే అందాలతో కుర్రకారును ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఇటీవల స్విమ్ సూట్ లో బోల్డ్ గా దర్శనమిచిన ఈ బ్యూటీ ఇంటర్నెట్ ను షేక్ చేసిన విషయం తెలిసిందే.
తాజాగా బ్లాక్ అవుట్ ఫిట్ లో మైండ్ బ్లాక్ చేస్తోంది. స్టన్నింగ్ స్టిల్స్ తో అట్రాక్ట్ చేస్తోంది. గ్లామర్ షోలో నెక్ట్స్ లెవల్ అనిపించేలా షాలినీ పాండే ఫొటోషూట్లు చేస్తోంది. ఇటు నెటిజన్లు కూడా ఆమె గ్లామర్ పిక్స్ ను లైక్ చేస్తూ.. కామెంట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తున్నారు.
మోడల్ గా ప్రారంభమైన తన కేరీర్ ప్రస్తుతం హీరోయిన్ గా కొనసాగుతోంది. వరుస ఆఫర్లను అందుకుంటున్న ఈ బ్యూటీ తమిళ, హిందీ చిత్రాల్లో నటిస్తోంది. చివరిగా తెలుగు ఆడియెన్స్ ను ‘ఇద్దరి లోకం ఒకటే’ చిత్రంతో అలరించింది.
చివరిగా హిందీ చిత్రం ‘జయేష్ బాయ్ జోర్దార్’లో ఓ కీలక పాత్రలో నటించింది. ఈ మూవీ మే 20నే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రస్తుతం ఈ బ్యూటీ ‘మహారాజా’ అనే హిందీ ఫిల్మ్ లో నటిస్తోంది. మూవీ ఇంకా చితత్రీకరణ దశలోనే ఉంది. మున్ముందు మరిన్నిసినిమాల్లో అలరించేందుకు సిద్ధంగా ఉందీ బ్యూటీ.